ఐటీ కంపెనీల్లో నీటికి కష్టకాలం - సిబ్బందికి తక్కువ తాగండని ఆదేశం

దేశ వ్యాప్తంగా వానల కాలం ఇంకా ప్రారంభం కాక పోవడంతో తాగేందుకు నీళ్లందని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా చెన్నైని ఈ నీటి కొరత తీవ్రంగా వేధిస్తోంది. లక్షలాది మంది ఈ నగరంలో జీవనం కొనసాగిస్తున్నారు. ఐటీ రంగానికి వస్తే వందలాది ఐటీ కంపెనీలు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ నగరాలలో కొలువు తీరాయి. తాజాగా చెన్నై విషయానికి వస్తే, వేలాది మంది ఆయా ఐటీ కంపెనీల్లో పని చేస్తున్నారు. వీరందరికి ఉచితంగా కంపెనీలు సేవలందిస్తున్నాయి. నీళ్లతో పాటు ఫుడ్, టిఫిన్స్, టీ, కాఫీ, కూల్ డ్రింక్స్ అందిస్తున్నాయి. తాజాగా వర్షాలు కురియక పోవడంతో భూగర్భ జలాలు పాతాళంలోకి వెళ్లిపోయాయి. దీంతో నీటి కొరతను అధిగమించేందుకు ఏలాంటి చర్యలు తీసుకోవాలో తెలియక యాజమాన్యాలు ఆలోచనలో పడ్డాయి. మిగతా నగరాల్లో కొంత నీరు లభిస్తున్నప్పటికీ చెన్నైలో మాత్రం రోజు రోజుకు నీటి కొరత మరింత తీవ్రమయ్యేలా కనిపిస్తోంది. ముందు జాగ్రత్త చర్యగా నగరంలోని చాలా హోటళ్లలో నీళ్లు లేవంటూ బోర్డులు తగిలించారు. ఎంతైనా తినండి కానీ నీళ్లు మాత్రం అడగొద్దంటూ వేడుకుంటున్నారు. ఇంతటి నీటి తీవ్ర క...