చెన్నైకి ఝలకిచ్చిన పంజాబ్

ఐపీఎల్ -12 టోర్నీలో ఇప్పటికే ప్లే ఆఫ్ రేస్‌లో ముందంజలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ ఎలెవన్ జట్టుకు ఆఖరులో కోలుకోలేని దెబ్బ తగిలింది పంజాబ్ జట్టు రూపంలో. కింగ్స్ పంజాబ్ తన ప్రతాపం ఏమిటో రుచి చూపించింది చెన్నై ఆటగాళ్లకు. ఏకంగా ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం నమోదు చేసుకుంది. స్వంత మైదానంలో జరిగిన తన చివరి లీగ్ మ్యాచ్‌ను ఘనంగా ముగించి తమ జట్టు అభిమానులకు కానుకగా ఇచ్చింది. చెన్నై కింగ్స్ మొదట బ్యాటింగ్ చేసింది. ఆ జట్టు నిర్దేశించిన 171 పరుగుల లక్ష్యాన్ని అవలీలగా ఇంకా రెండు ఓవర్లు మిగిలి ఉండగానే గెలుపొందింది. కింగ్స్ పంజాబ్ జట్టు విజయంలో కేఎల్ రాహుల్ అద్భుతమైన రీతిలో బ్యాటింగ్ చేశాడు. కళ్లు చెదిరేలా షాట్లు కొట్టాడు. బంతులను అవలీలగా బాదాడు. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 36 బంతులు మాత్రమే ఆడిన కేఎల్ ఏకంగా ఏడు ఫోర్లు అయిదు భారీ సిక్సర్లు కొట్టాడు. మొత్తం 71 పరుగులు చేసి బెంబేలెత్తించాడు. ఈ జట్టులో మరో కీలకమైన ఆటగాడిగా ఉన్న క్రిస్ గేల్ 28 బంతులు మాత్రమే ఆడి రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు కొట్టాడు..28 పరుగులు చేశాడు. ...