మహేషా ..మజాకా ! రిలీజ్ కాకుండానే వసూళ్లు !
ఘట్టమనేని మహేష్ బాబు అంటే కొందరికి మాత్రమే తెలుసేమో కానీ..మహేష్ బాబు పేరు చెబితే చాలు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా ఇట్టే గుర్తు పడతారు. చిన్న పిల్లల నుండి వృద్ధుల దాకా అంతా మనోడంటే పడి చచ్చే వాళ్లే. ఈ ప్రిన్స్ కెరీర్‌లో 25వ సినిమాగా మహర్షి సినిమా రిలీజ్ కాబోతోంది. ఊహించని రీతిలో ఎక్కడలేని విధంగా ప్రపంచ వ్యాప్తంగా ..ఇండియా వ్యాప్తంగా కోట్లాది రూపాయలు ఇప్పటికే వచ్చేశాయి. మినిమం గ్యారెంటీ ఉన్న దర్శకుడిగా పేరున్న వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో ప్రిన్స్ ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ మూవీగా తెర ముందుకు రానుంది. ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా పూర్తయింది. ఈ సినిమా ట్రైలర్‌కు యూట్యూబ్‌లో రికార్డు స్థాయిలో వ్యూవర్స్ వీక్షించడం కూడా ఓ రికార్డుగా మిగిలి పోయింది. అందానికి చిరునామా ఎవరైనా ఉన్నారంటే తెలుగు ఇండస్ట్రీలో అది ఒక్క మహేష్ బాబు మాత్రమే. ఎంతో మంది తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సినిమా రంగానికి చెందిన అందమైన భామలు..నటీమణులు ప్రిన్స్ అంటే పడి చస్తారు.
ఒక్క సినిమా అయినా సరే మహేష్ సరసన నటించాలని ఉవ్విళూరుతుంటారు. అదీ ఆయన ప్రత్యేకత. సెట్స్‌లో తప్ప ఇంకెక్కడా కామెంట్స్ చేయని ఒకే ఒక్కడు. రియల్ హీరో మహేష్ బాబు. ఆయన పూర్తి పేరు ఘట్టమనేని మహేష్ బాబు. చెన్నైయిలోనే చదివారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మంచి విజయాన్ని అందుకోగా..అదే డైరెక్టర్‌తో తీసిన బ్రహ్మోత్సవం బోర్లా పడింది. ఆ తర్వాత తమిళ సూపర్ డైరెక్టర్ మురగదాస్ తీసిన స్పైడర్ కూడా ఆశించిన రీతిలో సక్సెస్ కాలేదు. దీంతో మహేష్ బాబు పనైపోయిందంటూ ఇండస్ట్రీలో టాక్ వినిపించింది. ఇదే సమయంలో సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబుకు రెండు అనుకోని విజయాలను అందించారు. బాక్సాఫీస్ వద్ద రికార్డులు బ్రేక్ చేశారు. భారీ వసూళ్లను రాబట్టారు. శ్రీమంతుడు, భరత్ అనే నేను అనే రెండు సినిమాలు మహేష్ బాబు కెరీర్‌లో బిగ్గెస్ట్ సక్సెస్ నమోదు చేసుకున్నాయి.
7 ఆగస్టు 1975లో పుట్టారు. తండ్రి కృష్ణ పేరొందిన నటుడు. నిర్మాతగా, మహేష్ బాబు ఎంటర్ టైన్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను స్థాపించారు. 1979లో చైల్డ్ ఆర్టిస్టుగా నీడ సినిమాలో నటించారు. ఎనిమిదేళ్ల వయసులో మరో సినిమాలో నటించారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో 1999లో రాజకుమారుడు సినిమాలో నటించారు. తెలుగు వారి లోగిళ్లలో గుర్తుంచుకోదగిన సినిమాగా మహేష్ కు మురారి సినిమా మిగిలి పోతుంది. సొనాలీ బింద్రే కథానాయికగా నటించిన ఈ మూవీకి కృష్ణవంశీ డైరెక్టర్. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఒక్కడు బ్లాక్ బ్లస్టర్ మూవీగా నిలిచింది. అర్జున్ సినిమా కూడా భారీ సక్సెస్ నమోదు చేసుకుంది. త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అతడు రికార్డులను బ్రేక్ చేసింది. మహేష్ బాబును పూర్తి స్థాయి హీరోగా నిలబెట్టింది. పూరి జగన్నాథ్ డైరెక్టర్ గా వచ్చిన పోకిరి తెలుగు సినిమాను షేక్ చేసింది.
దూకుడు, బిజినెస్ మెన్ , సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, నేనొక్కడినే , శ్రీమంతుడు, భరత్ అనే నేను సినిమాలు మహేష్ కు మంచి పాత్రలు దక్కేలా చేశాయి. నంది అవార్డులను , ఫిల్మ్ ఫేర్ పురస్కారాలను అందుకున్నారు ప్రిన్స్. ఇంటర్నేషనల్ ఫిల్మ్ అకాడెమీ అవార్డు కూడా అందుకున్నారు. అందరూ హీరోలంతా వయస్సు పెరిగితే ..మహేష్ బాబు మాత్రం రోజు రోజుకు మరింత క్యూట్ గా తయారవుతూ ఇతర హీరోలకు ధీటుగా ఎదుగుతున్నారు. రెయిన్ బో హాస్పిటల్స్‌కు మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఓ గ్రామాన్ని ఆయన దత్తత తీసుకున్నారు. రెండేళ్ల పాటు వంశీ సినిమా మహర్షి మూవీ కోసం కష్టపడ్డారు. పూజా హెగ్డే కథానాయికి పాత్ర పోషిస్తోంది. పెట్టిన పెట్టుబడిలో 80 శాతం ఇప్పటికే తిరిగొచ్చింది. ఎంతో నమ్మకం పెట్టుకున్నారు ఈ సినిమాపై ప్రిన్స్.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి