దార్శనికుడు..తెలంగాణ యోధుడు..బాపూజీ వర్ధిల్లు

ప్రపంచానికే పాఠం నేర్పిన తెలంగాణ మాగాణంలో ఎందరో వీరులున్నారు. మహోన్నతమైన మానవులను, మార్గదర్శకులను కన్నది తెలంగాణ తల్లి. పోరాటాలకు, ఉద్యమాలకు, బలిదానాలకు, ఆత్మతగాలకు నిలువెత్తు రూపం ఈ ప్రాంతం. ఉద్విగ్న చరిత్రకు ప్రతీకగా నిలిచిన పోరాట యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ. కరడు గట్టిన నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఆయన పోరాడారు. అన్ని రంగాల్లో దోపిడీకి లోనైన ఈ ప్రాంతపు విముక్తి కోసం జరిగిన ప్రతి సందర్భంలోను కొండా కీలక పాత్ర పోషించారు. తెలంగాణ ఉద్యమ నాయకుల్లో బాపూజీ కీలకంగా వ్యవహరించారు. అదిలాబాద్ జిల్లా వాంకిడి గ్రామంలో 1915 సెప్టెంబర్ 27న పుట్టారు. స్వాతంత్ర్యోద్యమంలో కీలకంగా పాల్గొన్నారు. అదే సమయంలో జరిగిన నిజాం వ్యతిరేక ఉద్యమంలో ముందు వరుసలో నిలుచున్నారు. 1952లో ఆసిఫాబాదు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. 1957లో చిన్నకొండూరు నుంచి విజయం సాధించి అదే సంవత్సరం శాసనసభ డిప్యూటి స్పీకరుగా ఎన్నికయ్యారు. 1962లో స్వల్ప తేడాతో ఓటమి చెందారు. అయితే ప్రత్యర్థి పాల్బడిన అక్రమాలపై కేసు వేసి విజయం సాధించారు. 1967లో భువనగిరి నుంచి గెలిచారు. కాసు బ్రహ్మానంద రెడ్డి మంత్రివర్గంల...