మోదీ ఫస్ట్..ధోనీ బెస్ట్..బిల్ గేట్స్ టాప్ నెంబర్ వన్

భారత ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీజీ హవా రోజు రోజుకు  పెరుగుతూనే ఉన్నది. తాజాగా యుగోవ్ అనే సంస్థ మోస్ట్ పాపులర్ పెర్సనాలిటీస్ ఎవరనే దానిపై ప్రతి ఏటా జాబితా వెల్లడించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఇప్పటికే టీమిండియా సారధ్యం నుంచి తప్పుకున్న మహేంద్ర సింగ్ ధోనికి ఆదరణ ఏ మాత్రం తగ్గలేదని మరోసారి రుజువైంది. ప్రపంచ వ్యాప్తంగా 42  వేల మందితో నిర్వహించిన సర్వేలో 8.58 శాతం మంది ధోనీనే ఇష్టపడ్డారు. మోడీ 15.66 శాతం ఓట్లతో టాప్‌‌ ప్లేస్‌‌లో నిలిచారు. ఇండియా స్పోర్ట్స్‌‌ పర్సన్‌‌  కేటగిరీలో ధోనీ తర్వాత సచిన్‌‌ రెండో స్థానంలో నిలవగా.. ప్రస్తుత సారథి విరాట్ కోహ్లీ మూడో స్థానం దక్కించు కున్నాడు.

కాగా మహిళల విభాగంలో లెజెండరీ బాక్సర్‌‌‌‌ మేరీ కోమ్‌‌ 10.36 శాతం ఓట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఇక పోతే వరల్డ్ వైడ్ గా మోస్ట్ పాపులర్స్ పర్సన్స్ లో బిల్ గేట్స్ మొదటి స్థానం దక్కించుకున్నారు. మాజీ అమెరికా దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా రెండో ప్లేస్ లో ఉన్నారు. మూడో స్థానంలో జాకీ చాన్, నాలుగో ప్లేస్ లో జిన్ పింగ్, ఐదో స్థానంలో చైనాకు చెందిన అలీబాబా వ్యవస్థాపకులు జాక్ మా నిలిచారు. నరేంద్ర మోడీ ఆరో ప్లేస్ లో ఉండగా తర్వాతి స్థానాల్లో ఫుట్ బాల్ ప్లేయర్ రోనాల్డో, దలై లామా, మెస్సి , వ్లాదిమిర్ పుతిన్, వారెన్ బఫట్ చోటు దక్కించుకున్నారు. 12 వ స్థానంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఉండగా మిగతా ప్లేసుల్లో ఎలోన్ మోస్క్ , డోనాల్డ్ ట్రంప్ , ఫ్రాన్సిస్ ఉన్నారు .

మరో వైపు ఈ తాజా జాబితాలో  ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్, పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కు చోటు దక్కింది. ఇక మహిళల విభాగంలో మిచెల్లీ ఒబామా ప్రథమ ప్లేస్ లో నిలిచారు. ఆమెతో పాటు  ఓప్రా విన్ఫ్రా, ఏంజిలీనా జూలీ, క్వీన్ ఎలిజిబెత్ -2 , ఎమ్మా వాట్ సన్ చోటు దక్కించుకున్నారు. ఇక పాకిస్థాన్ కు చెందిన హక్కుల కార్యకర్త మలాలా , పెంగ్ , హిల్లరీ క్లింటన్ ఉన్నారు. టెయిలర్ స్విఫ్ట్ ఈ జాబితాలో ఉండగా పాప్ సింగర్ మడోన్నా , ఏంజెల్లా మెర్కెట్ ఉంటే 13 వ స్థానంలో బాలీవుడ్ భామ దీపికా పదుకొనే నిలిచారు. 14 వ ప్లేస్ లో మరో ప్రముఖ నటీమణి ప్రియాంకా చోప్రా దక్కించుకున్నారు. తర్వాతి స్థానాల్లో ఐశ్వర్య రాయి, సుష్మితా సేన్, థెరిస్సా మే ,మెలేనియా ట్రంప్, యాంగ్ మీ చోటు సంపాదించారు. 

కామెంట్‌లు