ఒప్పుకోని ఫ్యాన్స్ - ఆలీకి తిరిగి ఛాన్స్


తెలుగు బుల్లి తెరమీద బిగ్ రియాల్టీ షో గా ఇప్పటికే పేరు పొందిన స్టార్ మా టీవీ ప్రసారం చేస్తున్న బిగ్ బాస్ ప్రోగ్రాం లో అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి అప్పూర్వమైన రీతిలో ఆదరణ లభిస్తోంది. దేశ వ్యాప్తంగా బిగ్ బాస్ పై కొంత వ్యతిరేకత వ్యక్తమైనా ప్రోగ్రాంకు రేటింగ్ పెరుగుతోంది. దీంతో స్టార్ టీవీ యాజమాన్యం రీజినల్ సెక్టార్స్ లలో దీనిని ఆయా ప్రేక్షకుల మనోభావాలు దెబ్బ తినకుండా ప్లాన్ చేసింది. కన్నడలో కమల్ హాసన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. తెలుగులో స్టార్ టీవీ మా టీవీని కొనుగోలు చేశాక వినోద రంగంపైనే ఎక్కువగా దృష్టి పెట్టింది. మొదటగా బిగ్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ వున్న సెలెబ్రెటీస్ ను ఎంపిక చేసింది. అంతకు ముందు మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాం ను టెలికాస్ట్ చేసింది. ఇది హిందీలో ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ చేస్తున్న కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమానికి మాతృక.

దీనిని మొదటగా తెలుగు నటుడు నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ ప్రోగ్రాం కు విపరీతమైన రీతిలో ఆదరణ లభించింది. మా టీవీకి భారీ ఆదాయం కూడా సమకూరింది. మరో వైపు తెలుగు బుల్లి తెరమీద ఇప్పటికే జీ తెలుగు, ఈటీవి, జెమిని, తదితర ఛానల్స్ ఉన్నాయి. వీటిని ఎదుర్కొనేందుకు మా టీవీ యాజమాన్యం డిఫ్ఫరెంట్ గా కార్యక్రమాలను, రియాల్టీ షోస్ , సీరియల్స్ ను రూపొందిస్తోంది. ఇప్పటికే కార్తీక దీపం , అగ్ని సాక్షి కి ఆదరణ ఉంటోంది. తాజాగా స్టార్ట్ చేసిన బిగ్ బాస్ రియాల్టీ షో కు అనుకున్న దానికంటే రెస్పాన్స్ వస్తోంది. ఇది ఈ టీవీలో మూడో సీజన్. మొదటి బిగ్ బాస్ ప్రోగ్రాం ను నటుడు జూనియర్ ఎన్టీఆర్ స్టార్ట్ చేస్తే రెండో సీజన్ బిగ్ బాస్ ను నటుడు నాని హోస్ట్  చేసారు. ఇక మూడో సీజన్ బిగ్ బాస్ ను నటుడు అక్కినేని నాగ్ వ్యాఖ్యాతగా సక్సెస్ ఫుల్ గా నడిపిస్తున్నాడు.

ఆయన లేని సమయంలో నటి రమ్యకృష్ణ దుమ్ము రేపింది. అయితే బిగ్ బాస్ లో రోజు రోజుకు కొత్తగా ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి. ప్రోగ్రాం మరింత రసవత్తరంగా తయారైంది. సింగర్ రాహుల్ సిప్లికార్, పునర్నవి ల మధ్య కెమిస్ట్రీ తారా స్థాయికి చేరడం, ఆమె రాహుల్ ను ముద్దు పెట్టు కోవడం తెలుగునాట వైరల్ గా మారింది. ఇక ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న అలీ ఎలిమినేషన్ లో వెళ్లి పోవడం విస్తు పోయేలా చేసింది. కాగా అనుకోని రీతిలో ఫ్యాన్స్ రేటింగ్ లో ఆలీకే  ఎక్కువగా ఓట్లు పడ్డాయి. దీంతో అలీ తిరిగి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యాడు. మిగతా సభ్యులు పండుగ చేసుకున్నారు. మొత్తం మీద బాబా భాస్కర్, శివ జ్యోతి, శ్రీ ముఖి , వరుణ్, రాహుల్ , పునర్నవి , రితిక తో పాటు అలీ కూడా చేరడంతో ఎవరు అసలైన బాస్ అన్నది తెలియక ఫ్యాన్స్ ఉత్కంఠకు లోనవుతున్నారు. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!