కోట్లు దాటిన వ్యాపారం - ఆన్‌లైన్లో ఆహారం

ఎక్కడికైనా వెళితే ఏమేం హోటళ్లు ఉన్నాయో వెదికే బాధ తప్పింది జనాలకు. ఆకలి వేస్తే చాలు..ఏమైనా ఏదైనా తినేయొచ్చు క్షణాల్లో. ఈ కామర్స్ పుణ్యమా అని ఆన్‌లైన్‌లో టిఫిన్లు, భోజనాలు, ఇతర తిను పదార్థాలు ఇబ్బడిముబ్బడిగా లభిస్తున్నాయి. బిర్యానీ అంటేనే ప్రపంచంలోనే పేరొందిన హైదరాబాద్ ప్యారడైజ్ ఆదాయం నెలకు వంద కోట్లకు పైమాటే. అటు రెస్టారెంట్లతో పాటు ఆన్ లైన్ లో ఆర్డర్ చేస్తే చాలు ప్రపంచంలో ఎక్కడికైనా పంపించే ఏర్పాటు చేసింది యాజమాన్యం. డెలివరీ సిస్టం మారి పోయింది. రవాణా సదుపాయాలు పెరిగాయి. టెక్నాలజీ ఆహారపదార్థాలకు ఉపయోగ పడుతోంది. ముందుగా చెప్పాల్సి వస్తే తిరుమల తిరుపతి దేవస్థానం గురించి చెప్పుకోవాలి. రోజూ లక్షకు పైగా భక్తులు తిరుమల శ్రీ వేంకటేశ్వరుడిని దర్శించుకుంటారు. కానీ టీటీడీ ఎక్కడా క్షణం ఆలస్యం చేయకుండా పాలు, కాఫీలు, టిఫిన్లు, రుచికరమైన భోజనాలను అందజేస్తోంది. తెలంగాణలో అక్షయపాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో కేవలం 5 రూపాయలకే భోజనాన్ని అందిస్తోంది. ఇది కూడా సేవా భావంతో చేస్తున్నదే కావడంతో అనతి కాలంలోనే సక్సెస్ అయ్యింది. నగరాలకే కాకుండా ...