కర్నాటకం..ఆద్యంతం రసవత్తరం..స్పీకరే సుప్రీం..ఢిల్లీకి చేరిన రాజకీయం ..!

అంతులేని ట్విస్టులతో రోజు రోజుకు తీవ్ర ఉత్కంఠకు..ఉద్వేగానికి లోను చేస్తున్న కన్నడ నాట రాజకీయం మరింత హీట్ ను పుట్టిస్తూ దేశ రాజకీయాలలో కొత్త చరిత్రకు తెర లేపింది కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే అంతా మారిపోతున్నాయి పరిస్థితులు. బల నిరూపణ జరగాల్సిందేనంటూ విపక్ష నేత యెడ్యూరప్ప డిమాండ్ చేశారు. బేషరతుగా జరిపి తీరాల్సిందేనంటూ తన అనుచర ఎమ్మెల్యేలతో కలిసి విధాన సభలో నిరసనకు దిగారు. అయినా స్పీకర్ రమేష్ కుమార్ ససేమిరా అన్నారు. తనకు విశేషమైన అధికారాలు ఉన్నాయని, తనను ఎవరూ నియంత్రించ లేరని, తాను భారత రాజ్యాంగ బద్దంగానే నడుచుకుంటున్నానని స్పీకర్ స్పష్టం చేశారు. దీంతో కన్నడ రాజకీయం మరింత వేడిని రాజేసింది. దీనిపై కమలనాథులు భగ్గుమన్నారు. సంకీర్ణ సర్కార్ నుండి 15 మంది ఎమ్మెల్యేలు జంప్ అయ్యారని, వారి శాసనసభ సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలని కోరుతూ ఆ రాష్ట్ర సంకీర్ణ ముఖ్యమంత్రి కుమార స్వామితో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత గుండూరావులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో కన్నడ పాలిటిక్స్ దేశ రాజధా...