ఆభరణాల రంగంలోకి రిలయన్స్
రిలయన్స్ అంటేనే ఇండియా..భారత్ అంటేనే రిలయన్స్ అనే స్థాయికి చేరుకుంది రిలయన్స్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. ఓ వైపు టెలికాం రంగంలో జియో దెబ్బకు ఇతర కంపెనీలు డీలా పడిపోతే ఈ ఒక్క కంపెనీ మాత్రం రికార్డుల బ్రేక్ చేస్తూ ప్రపంచాన్ని విస్మయ పరిచేలా చేసింది. ఒకే ఒక్క రోజులో జియో లాంచ్ చేసిన రోజే ఏకంగా 5 కోట్ల మందికి పైగా సబ్‌స్క్రైబర్స్‌గా చేరారు. ఇతర టెలికాం ఆపరేట్స్ ఎయిర్‌టెల్, ఐడియా, వొడాఫోన్, తదితర కంపెనీలకు చెందిన వినియోగదారులు జియోలోకి మారిపోయారు. దీంతో గణనీయమైన ఆదాయాన్ని గడించింది ఈ కంపెనీ. రిలయన్స్ ఆధ్వర్యంలో ఫుట్ వేర్, రిలయన్స్ డిజిటల్ , టెలికాం, ఫ్యాషన్స్, ట్రెండ్స్..లాజిస్టిక్ తదితర రంగాలకు విస్తరించింది. దేశ వ్యాప్తంగా పలు చోట్ల రిలయన్స్ స్టోర్‌లను ఏర్పాటు చేసింది.
తన వ్యాపారాన్ని రోజు రోజుకు పెంచుకుంటూ ఆదాయాన్ని గడిస్తోంది. దేశ వ్యాప్తంగా ప్రతి సెంటర్ ప్లేస్‌లో రిలయన్స్ పెట్రోల్ బంకులను ఏర్పాటు చేసింది. వాటి స్థలాల విలువ లెక్కించలేనంతగా పెరిగింది. అన్ని కలిపి అమ్మితే ఏకంగా 1000 కోట్లకు పైగా ఉంటోందని మార్కెటింగ్ వర్గాల అంచనా. ఇండియాలో మహిళలే టార్గెట్‌గా కొన్ని వేల రకాల వ్యాపారం జరుగుతోంది. కస్టమర్లే దేవుళ్లు. వారి అభిరుచులు, అభిప్రాయాలు, కోరికలు తెలుసుకునే దిగ్గజ సంస్థలు ప్రొడక్ట్స్‌ను అమ్మగలుగుతున్నాయి. అందుకే అమెజాన్, ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్‌లు అందినంత మేర ఆఫర్లు ప్రకటిస్తూ కోట్లు గడిస్తున్నాయి. లాజిస్టిక్ రంగమంతా మూడు పూలు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది.
బంగారు ఆభరణాలు, వజ్రాలు, వెండి, తదితర వాటికి ఎనలేని డిమాండ్ ఉంటోంది. ఎక్కువగా భారతదేశంలో కొనుగోలు చేసేది మహిళలు, గర్ల్స్. రిలయన్స్ డిజిటల్స్ ఇప్పటికే ఏర్పాటు చేసిన రిలయన్స్ గ్రూపు..తాజాగా స్త్రీలను టార్గెట్ చేస్తూ.. డిఫరెంట్ డిజైన్స్ తో ఆకట్టుకునేలా ..ఐకానిక్ జ్యూయలర్స్ పేరుతో తాజాగా ప్రారంభించింది. లక్జరీ లేబుల్స్ ఎర్మింగిల్‌దో జెగ్నా, బ్రూక్స్ బ్రదర్స్ బ్యాలీ ఫేమస్ కంపెనీలకు చెందిన ఆభరణాలు ఇందులో లభించనున్నాయి. వీటికి ఎక్కడలేనంతటి డిమాండ్ ఉంటోంది ప్రపంచ వ్యాప్తంగా. టిఫ్పనీ అండ్ కంపెనీ ..రిలయన్స్ బ్రాండ్స్ టై అప్ అయింది. ఇరు కంపెనీలకు చెందిన బ్రాండ్‌లతో ఏర్పాటు చేసిన స్టోర్‌ను ముంబయిలోని జియో వరల్డ్ సెంటర్ మాల్‌లో ముఖేష్ అంబానీ ప్రారంభించారు. టిఫ్నీ కంపెనీ అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఐకానిక్ పేరుతో ఏర్పాటైన ఈ జ్యూయలరీ సెంటర్లు ప్రపంచ వ్యాప్తంగా ప్రారంభం కానున్నాయి. రాబోయే రోజుల్లో ఇంకెన్ని వ్యాపారాలను నిర్వహిస్తుందో వేచి చూడాలి.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి