మహిళలకు ఉచిత ప్రయాణం - ఆప్ అసాధారణ నిర్ణయం - 700 కోట్ల ఖర్చు

మహిళా సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ముందు నుంచి చెబుతూ వస్తోంది. ఆ దిశగా అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 7 లోక్‌సభ సీట్లను ఆప్ కోల్పోయింది. అన్ని సీట్లలో కమలం కాషాయ జెండాను ఎగుర వేసింది. మొదట్లో కాంగ్రెస్‌తో దోస్తీ కట్టాలని నిర్ణయించినా ఎందుకనో కేజ్రీవాల్ ఒప్పుకోలేదు. దీంతో ఆ రెండు పార్టీలు వేర్వేరుగానే పోటీ చేశాయి. ఈ సమయంలో ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఏదో రకంగా మరోసారి పవర్ లోకి రావాలని ఆప్ అధినేత కేజ్రీవాల్ శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ క్రమంలోనే మహిళలను టార్గెట్ చేశారు కేజ్రీ. ఎవరూ ఊహించని రీతిలో ..ఏరాష్ట్రంలో లేని విధంగా మహిళందరికి మెట్రో రైళ్లలో, ప్రభుత్వ బస్సుల్లో ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేసినా ఉచితమేనంటూ ప్రకటించారు. మరో రెండు నెలల్లో ఈ స్కీం అమలు లోకి వస్తుందని సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ పథకం పకడ్బందీగా అమలయ్యేలా చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తక్షణమే ప్రణాళిక తయారు చేయాలని సంబంధిత అధికారులను సీఎం ఆదేశించా...