విద్యాదానం ..మహద్భాగ్యం - దాతలకు విన్నపం
రెండోసారి కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ ప్రభుత్వం మెల మెల్లగా ప్రజలకు ఉపయోగ పడేలా సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. గతంలో అమలు చేసిన కార్యక్రమాల స్థానంలో కొత్త వాటిని చేర్చి..సమాజాభివృద్ధిలో కీలక భూమిక పోషఙంచేలా చేస్తోంది. త్రిభాషా విధానాన్ని అమలు చేయాలని సంకల్పించగా ఆదిలోనే అభ్యంతరాలు వ్యక్తం కావడంతో వెనక్కి తగ్గింది. మరో వైపు తెలంగాణ ఉన్నత విద్యా మండలి మంచి ఆలోచన చేసింది. అన్ని యూనివర్శిటీ పరిధిలోని డిగ్రీ కోర్సులలో ఒకే సిలబస్ వుండేలా నిర్ణయించింది.
ఆ మేరకు ఎక్స్‌పర్ట్స్‌తో సిలబస్‌ను రూపొందించేలా చేసింది. దీని వల్ల ఎలాంటి ఇబ్బందులంటూ వుండవు విద్యార్థులకు. గతంలో కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛందంగా వంట గ్యాస్ సబ్సిడీని వదులుకునే కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమానికి అనూహ్యమైన స్పందన లభించింది. ఇదే స్ఫూర్తితో మోదీ సర్కార్ నిరుపేద విద్యార్థుల కోసం ఇంకో పథకానికి శ్రీకారం చుడుతోంది. దేశ వ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థల్లో చదువుకునే పూర్ స్టూడెంట్స్ కోసం బోధన ఖర్చును భరించేందుకు ఎవరైనా ముందుకు వస్తే..ట్యాక్స్ ఎక్షంప్షన్ ఇవ్వాలని నిర్ణయించింది. ఇందు కోసం ప్రత్యేకంగా ప్రణాళిక రూపొందిస్తోంది. ఒకరి బోధనకు ప్రతి ఒక్కరు అనే నినాదం తో ..ఒక పేద విద్యార్థి చదువుకునేందుకు విరాళం అందించేలా ప్రోత్సహిస్తారు.
ఇందు కోసం ఓ జాతీయ డిజిటల్ వేదికను ఏర్పాటు చేసి..దాతలకు , విద్యార్థులు - విద్యా సంస్థలకు నేరుగా అనుసంధానం చేస్తారు. ఇలా అందించే విరాళాలకు పన్ను మినహాయింపుతో పాటు మరికొన్ని ప్రోత్సాహకాలు అందించాలే యోచిస్తోంది. ఆయా విద్యా సంస్థల్లో గతంలో చదువుకున్న వారు, పై స్థాయికి ఎదిగిన వారు, సంస్థలు, కంపెనీలు, బిజెనెస్ టైకూన్స్, సిఇఓలు, మేనేజింగ్ డైరెక్టర్లు, ఛైర్మన్ లు , సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్స్ , క్రీడాకారులు, సినీ స్టార్స్ , నిర్మాతలు ..పొలిటికల్ లీడర్లు, ప్రజా ప్రతినిధులు , గ్రూప్ వన్ ఆఫీసర్లు, ఐఏఎస్‌లు ..బాధ్యత కలిగిన వారంతా ముందుకు వచ్చి ఒక స్టూడెంట్‌ను దత్తత తీసుకోవాలని సూచిస్తోంది.
వారందించే విరాళాలను నేరుగా ఆయా విద్యార్థుల ఖాతాల్లోకి జమ చేస్తారు. 2015 మార్చి 27న ప్రధాని మోదీ గివ్ ఇట్ అప్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 2018 జూన్ నెలాఖరు వరకు 1.04 కోట్ల మంది వినియోగదారులు గ్యాస్ సబ్సిడీని వదులుకున్నారు. ఈ స్పందనతో వచ్చిన స్ఫూర్తితో మరో కార్యక్రమాన్ని అమలు చేసేందుకు మోదీ సర్కార్ ఆ దిశగా అడుగులు వేస్తోంది. కేంద్ర సర్కార్ తీసుకున్న ఈ చర్యలను దేశ వ్యాప్తంగా పార్టీలకు అతీతంగా సపోర్ట్ లభిస్తోంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి