ప్రాదేశిక ఎన్నిక‌ల్లో గులాబీ జెండా రెప‌రెప‌లు

తాజాగా జ‌రిగిన 17వ లోక్‌స‌భ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో 9 సీట్ల‌కే ప‌రిమిత‌మైన అధికార తెలంగాణ రాష్ట్ర స‌మితి పార్టీ తిరిగి కోలుకుంది. 17 లోక్‌స‌భ స్థానాల‌కు గాను ఒక దానిని మిత్ర‌ప‌క్షం ఎంఐఎంకు కేటాయించ‌గా మిగ‌తా 16 స్థానాల్లో పోటీ చేసింది. హోరా హోరీగా సాగిన ఈ పోటీల్లో అనూహ్యంగా బీజేపీ 4 సీట్లు గెలుచుకోగా ..3 సీట్ల‌ను కాంగ్రెస్ పార్టీ కైవ‌సం చేసుకుంది. విచిత్రం ఏమిటంటే ఎంపీ ఎన్నిక‌ల్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన రైతులు 186 మంది ఎంపీ సీటు కోసం నామినేష‌న్ దాఖ‌లు చేశారు. త‌మ న్యాయ‌ప‌ర‌మైన డిమాండ్ల సాధ‌న కోసం దేశ వ్యాప్తంగా చ‌రిత్ర సృష్టించారు. వీరిని లైట్ గా తీసుకున్న సిట్టింగ్ ఎంపీ క‌వితకు కోలుకోలేని షాక్ ఇచ్చారు. ఆమె ధ‌ర్మ‌పురి శ్రీ‌నివాస్ కొడుకు ధ‌ర్మ‌పురి అర‌వింద్ చేతిలో 60 వేల పై చిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇది సీఎంకు భారీ దెబ్బ‌. 

ఆ త‌ర్వాత జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో జీవ‌న్ రెడ్డి గెల‌వ‌డం కూడా మింగుడు ప‌డ‌లేదు. ఇటీవ‌ల జ‌రిగిన మూడు ఎమ్మెల్సీ స్థానాల‌ను టీఆర్ ఎస్ అభ్య‌ర్థులే గెలుపొందారు. అందులో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓట‌మి పాలైన తాండూరుకు చెందిన ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డికి సీఎం కేసీఆర్ ప‌ట్టుప‌ట్టి ఎమ్మెల్సీ ఇచ్చారు. ఆయ‌న గెలిచారు. త‌ప్ప‌నిస‌రిగా కేబినెట్‌లో కీల‌క ప‌ద‌వి అలంక‌రించ బోతున్న‌ట్లు స‌మాచారం. ఇక ప్రాదేశిక ఎన్నిక‌ల్లో గులాబీ జెండా రెప‌రెప‌లాడింది. ఆ పార్టీకి చెందిన అభ్య‌ర్థులు భారీ సంఖ్య‌లో గెలుపొందారు. అటు జెడ్పీటీసీల్లోను ఇటు ఎంపీటీసీల్లోను అన్ని జిల్లాల‌లో త‌మ ప్ర‌తాపాన్ని చూపించారు. కొన్ని జిల్లాలు మిన‌హా అన్ని ప్రాంతాల్లో వీరి హ‌వాకు ఎదురే లేకుండా పోయింది.

ఆదిలాబాద్ జిల్లాలో టీఆర్ ఎస్ కు 6 జెడ్పీటీసీలు, 83 ఎంపీటీసీలు రాగా , కాంగ్రెస్ పార్టీకి 3 జెడ్పీటీసీలు, 28 ఎంపీటీసీలు , బీజేపీకి 3 జెడ్పీటీసీలు 33 ఎంపీటీసీలు రాగా 14 మంది స్వ‌తంత్రులుగా గెలుపొందారు. భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో టీఆర్ ఎస్ 15 జెడ్పీటీసీలు, 115 ఎంపీటీసీ స్థానాలు విజ‌యం సాధించ‌గా కాంగ్రెస్ పార్టీ 3 జెడ్పీటీసీలు 25 ఎంపీటీసీలు , 11 ఎంపీటీసీ స్థానాల‌ను టీడీపీ కైవ‌సం చేసుకోగా 28 మంది ఇండిపెండెంట్లుగా త‌మ ప్ర‌తాపాన్ని చూపించారు. కొంరంభీం ఆసిఫాబాద్ జిల్లా చూస్తే..టీఆర్ఎస్ పార్టీకి చెందిన జెడ్పీటీసీలు 14 మంది గెలువ‌గా 83 మంది ఎంపీటీసీలు గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక్క జెడ్పీటీసీకే ప‌రిమితం కాగా 19 ఎంపీటీసీలు , బీజేపీ 3 ఎంపీటీసీలు, 16 మంది స్వ‌తంత్రులు నిలిచారు. జ‌న‌గామ జిల్లాలో అధికార పార్టీకి 11 జెడ్పీటీసీలు , 96 ఎంపీటీసీలు రాగా కాంగ్రెస్ కు ఒక జెడ్పీటీసీ, 33 ఎంపీటీసీలు, 10 మంది ఇండిపెండెంట్లు గెలుపొందారు. 

మెద‌క్ జిల్లాలో టీఆర్ ఎస్ పార్టీకి 18 జెడ్పీటీసీ స్థానాలు ద‌క్క‌గా 117 ఎంపీటీసీ స్థానాలు కైవ‌సం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీకి 2 జెడ్పీటీసీలు ద‌క్కించుకోగా 43 ఎంపీటీసీ స్థానాల్లో గెలుపొంద‌గా 29 ఇండిపెండెంట్లు విజ‌యం సాధించారు. మేడ్చెల్ జిల్లాలో అధికార పార్టీకి 4 జెడ్పీటీసీలు, 20 ఎంపీటీసీలు, కాంగ్రెస్ కు ఒక జెడ్పీటీసీ, 12 ఎంపీటీసీలు , బీజేపీకి ఒక ఎంపీటీసీ , ఇత‌రులు 9 మంది విజ‌యం సాధించారు. న‌ల్ల‌గొండ జిల్లాలో టీఆర్ ఎస్ కు 23 జెడ్పీటీసీలు, 194 ఎంపీటీసీలు, కాంగ్రెస్ పార్టీకి 9 జెడ్పీటీసీలు, 130 ఎంపీటీసీలు, బీజేపీకి 4 ఎంపీటీసీలు, ఇత‌రులు 14 మంది విజ‌యం సాధించారు. నిజామాబాద్ జిల్లాలో గులాబీ ద‌ళానికి 23 జెడ్పీటీసీలు, 186 ఎంపీటీసీలు, కాంగ్రెస్ కు 2 జెడ్పీటీసీలు , 46 ఎంపీటీసీలు, బీజేపీకి 2 జెడ్పీటీసీలు, 34 ఎంపీటీసీలు , 33 మంది ఇండిపెండెంట్లు గెలుపొందారు. 

ఇక సిద్దిపేట జిల్లాలో టీఆర్ఎస్ హ‌వాకు ఎదురే లేకుండా పోయింది. ఇక్క‌డ 22 సీట్ల‌లో జెడ్పీటీసీలుగా గెలుపొందితే 153 సీట్ల‌లో ఎంపీటీసీల‌ను కైవ‌సం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీకి ఒక్క జెడ్పీటీసీ సీటు ద‌క్క‌గా 28 సీట్ల‌లో ఎంపీటీసీలు విజ‌యం సాధించారు. 43 మంది ఇండిపెండెట్లు గెల‌వ‌డం విశేషం. పెద్ద‌ప‌ల్లి జిల్లాలో అధికార పార్టీకి 11 జెడ్పీటీసీలు, 91 ఎంపీటీసీలు, కాంగ్రెస్ కు 2 జెడ్పీటీసీలు, 31 ఎంపీటీసీలు, బీజేపీకి 6 ఎంపీటీసీలు, 10 ఇండిపెండెంట్లు విజ‌యం సాధించారు. సూర్యాపేట జిల్లాలో టీఆర్ ఎస్ కు 19 జెడ్పీటీసీలు, 143 ఎంపీటీసీలు, కాంగ్రెస్ కు 3 జెడ్పీటీసీలు 75 ఎంపీటీసీలు, బీజేపీకి 3 ఎంపీటీసీలు, 8 మంది ఇత‌రులు గెలుపొందారు. సంగారెడ్డి జిల్లాలో టీఆర్ ఎస్ కు 18 జెడ్పీటీసీలు, 177 ఎంపీటీసీలు, కాంగ్రెస్ కు 4 జెడ్పీటీసీలు, 101 ఎంపీటీసీలు , బీజేపీకి 2 ఎంపీటీసీలు ద‌క్క‌గా 15 ఇత‌రులు విజ‌యం సాధించారు. 

వికారాబాద్ జిల్లా విష‌యానికి వ‌స్తే..అధికార పార్టీ హ‌వా న‌డిచింది. 9 జెడ్పీటీసీలు, 139 ఎంపీటీసీ స్థానాలు కైవ‌సం చేసుకుంది. ఒక్క జెడ్పీటీసీ , 72 ఎంపీటీసీ స్థానాల‌ను కాంగ్రెస్ ప‌రం కాగా 9 స్థానాల్లో ఇత‌రులు గెలిచారు. యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలో టీఆర్ ఎస్ 11 జెడ్పీటీసీ, 84 ఎంపీటీసీ, కాంగ్రెస్ పార్టీకి 3 జెడ్పీటీసీలు, 72 ఎంపీటీసీలు, ఒక ఎంపీటీసీ స్థానంలో బీజేపీ ఉండ‌గా 11 స్థానాల్లో ఇండిపెండెంట్లు గెలుపొందారు. వ‌న‌ప‌ర్తి జిల్లాలో 13 జెడ్పీటీసీలు, 89 ఎంపీటీసీ స్థానాల‌ను అధికార పార్టీ అభ్య‌ర్థులు గెలుపొంద‌గా ఒక జెడ్పీటీసీ స్థానానికే కాంగ్రెస్ ప‌రిమిత‌మైంది. 21 ఎంపీటీసీ స్థానాల‌లో గెలుపొంద‌గా 17 మంది స్వ‌తంత్రులు విజ‌యం సాధించారు. రంగారెడ్డి జిల్లాలో టీఆర్సెస్ 15 జెడ్పీటీసీ, 126 ఎంపీటీసీ స్థానాల్లో , కాంగ్రెస్ 5 జెడ్పీటీసీ, 75 ఎంపీటీసీ స్థానాల్లో, బీజేపీ 18 ఎంపీటీసీ స్థానాల్లో , 37 మంది ఇండిపెండెంట్లుగా గెలుపొందారు. 

రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలో టీఆర్ ఎస్ పార్టీకి 11 జెడ్పీటీసీలు, 72 ఎంపీటీసీలు ద‌క్క‌గా కాంగ్రెస్ కు ఒక జెడ్పీటీసీ 18 ఎంపీటీసీలు, బీజేపీకి 8 ఎంపీటీసీ స్థానాలు 25 మంది స్వ‌తంత్రులు గెలుపొందారు. నిర్మ‌ల్ జిల్లాలో అధికార పార్టీకి 12 జెడ్పీటీసీలు, 85 ఎంపీటీసీలు, కాంగ్రెస్ కు 5 జెడ్పీటీసీలు, 51 ఎంపీటీసీలు , 14 ఇండిపెండెంట్లు నిలిచారు. మంచిర్యాల జిల్లాలో టీఆర్ ఎస్ కు 13 జెడ్పీటీసీలు, 78 ఎంపీటీసీలు, కాంగ్రెస్ కు 2 జెడ్పీటీసీలు, 36 ఎంపీటీసీలు, 16 స్వ‌తంత్రులు గెలుపొందారు. మంత్రి శ్రీ‌నివాస్‌గౌడ్ ప్రాతినిథ్యం వ‌హిస్తున్న మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలో అధికార పార్టీకి 13 జెడ్పీటీసీలు, 113 ఎంపీటీసీలు రాగా కాంగ్రెస్ కు 38 ఎంపీటీసీలు , 12 ఇత‌రులు గెలుపొందారు. క‌రీంన‌గ‌ర్ జిల్లాలో టీఆర్ ఎస్‌కు 15 జెడ్పీటీసీలు , 98 ఎంపీటీసీలు, కాంగ్రెస్ కు 26 ఎంపీటీసీలు, బీజేపీకి 15 ఎంపీటీసీలు , ఇత‌రులు 36 మంది విజ‌యం సాధించారు. 

ఇక కామారెడ్డి జిల్లా చూస్తే..14 జెడ్పీటీసీలు, 149 ఎంపీటీసీ స్థానాల‌ను అధికార పార్టీ అభ్య‌ర్థులు గెలువ‌గా, 8 జెడ్పీటీసీలు, 61 ఎంపీటీసీలు కాంగ్రెస్ , 4 బీజేపీ , 22 ఇత‌రులు గెలిచారు. మ‌హ‌బూబాబాద్ జిల్లాలో టీఆర్ ఎస్ కు 12 జెడ్పీటీసీలు, 132 ఎంపీటీసీలు, కాంగ్రెస్ కు 2 జెడ్పీటీసీలు 49 ఎంపీటీసీలు, బీజేపీకి ఒక ఎంపీటీసీ , ఇత‌రులు 15 సీట్ల‌లో గెలిచారు. జ‌గిత్యాల జిల్లాలో అధికార పార్టీకి  17జెడ్పీటీసీ 143 ఎంపీటీసీ, కాంగ్రెస్ పార్టీకి ఒక జెడ్పీటీసీ , 37 ఎంపీటీసీ స్థానాలు ద‌క్క‌గా , బీజేపీకి 19 ఎంపీటీసీ స్థానాలు, 15 ఇత‌రులు కైవ‌సం చేసుకున్నారు. ఖ‌మ్మం జిల్లాలో టీఆర్ ఎస్‌కు 16 జెడ్పీటీసీలు, 167 ఎంపీటీసీలు , కాంగ్రెస్ కు 3 జెడ్పీటీసీలు 58 ఎంపీటీసీలు, టీడీపీకి 5 ఎంపీటీసీలు , ఇత‌రులు  42 స్థానాలు చేజిక్కించుకున్నారు. 

జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లాలో అధికార పార్టీకి 6 జెడ్పీటీసీలు, 61 ఎంపీటీసీలు, కాంగ్రెస్ కు 4 జెడ్పీటీసీలు, 26 ఎంపీటీసీలు , బీజేపీకి 2 ఎంపీటీసీలు 16 ఇండిపెండెంట్లు గెలిచారు. నాగ‌ర్ క‌ర్నూలు జిల్లాలో అధికార పార్టీ త‌న హవాను కొన‌సాగించింది. 17 జెడ్పీటీసీలు, 137 ఎంపీటీసీలు , కాంగ్రెస్ పార్టీ 3 జెడ్పీటీసీలు 52 ఎంపీటీసీలు, బీజేపీ 4 ఎంపీటీసీ స్థానాలు గెలుపొంద‌గా 16 స్థానాల్లో స్వ‌తంత్రులు బ‌రిలో నిలిచారు. వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లాలో చూస్తే..ఫ‌లితాలు ఇలా ఉన్నాయి. టీఆర్ ఎస్ కు 16 జెడ్పీటీసీలు, 129 ఎంపీటీసీలు ద‌క్క‌గా కాంగ్రెస్ కు 43 ఎంపీటీసీ స్థానాలు మాత్ర‌మే ల‌భించాయి. ఇక్క‌డ ఇండిపెండెంట్లు 6 సీట్ల‌లో గెలిచారు. వ‌రంగ‌ల్ అర్బ‌న్ జిల్లాలో 7 జెడ్పీటీసీలు, 62 ఎంపీటీసీలు అధికార పార్టీకి ద‌క్క‌గా కాంగ్రెస్ కు 12 ఎంపీటీసీలు బీజేపీకి ఒక ఎంపీటీసీ ,ఇత‌రులు 12 సీట్ల‌లో గెలిచారు. 
 
జోగుళాంబ గ‌ద్వాల జిల్లాను చూస్తే ..12 జెడ్పీటీసీ స్థానాల‌తో పాటు 99 ఎంపీటీసీ స్థానాల‌లో గులాబీ జెండాలు రెప రెప లాడాయి. ఇక్క‌డ డికె అరుణ అల్లుడు బండ్ల కృష్ణ మోహ‌న్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. కాంగ్రెస్ కు ఒక్క జెడ్పీటీసీ ద‌క్క‌లేదు. 19 సీట్లు మాత్ర‌మే ఎంపీటీసీ స్థానాలు గెలుచు కోగ‌లిగింది. 13 మంది ఇండిపెండెంట్లుగా ఉన్నారు. ములుగు జిల్లాలో అధికార పార్టీకి 7 జెడ్పీటీసీలు, 48 ఎంపీటీసీలు, కాంగ్రెస్ కు ఒక జెడ్పీటీసీ, 23 ఎంపీటీసీలు, ఒక‌రు స్వ‌తంత్ర అభ్య‌ర్థి విజ‌యం సాధించారు. కొత్త‌గా ఏర్పాటైన నారాయ‌ణ‌పేట జిల్లాలో 9 జెడ్పీటీసీలు, 86 ఎంపీటీసీలు టీఆర్ ఎస్ కైవ‌సం చేసుకోగా ఒక జెడ్పీటీసీ, 17 ఎంపీటీసీ స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ ఒక జెడ్పీటీసీ , 26 ఎంపీటీసీ స్థానాల్లో విజ‌యం సాధించ‌గా 10 మంది ఇండిపెండెంట్లుగా నిలిచారు. ఇక మొత్తంగా చూస్తే ..అధికార పార్టీకి సంబంధించి 436 జెడ్పీటీసీ స్థానాల‌తో పాటు 3556 ఎంపీటీసీ స్థానాల‌ను గెలుచుకుని త‌న సత్తా ఏమిటో రుచి చూపించింది. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చూస్తే..74 జెడ్పీటీసీ స్థానాలు, 1377 ఎంపీటీసీ స్థానాల్లో విజ‌యం సాధించింది. బీజేపీకి 7 జెడ్పీటీసీలు, 211 ఎంపీటీసీలు రాగా, టీడీపీకి 21 ఎంపీటీసీ స్థానాలు, 5 మంది ఇండిపెండెంట్లు జెడ్పీటీసీలుగా బోణీ కొట్ట‌గా , 572 మంది స్వ‌తంత్ర అభ్య‌ర్థులు ఎంపీటీసీలుగా త‌మ స‌త్తా చాటారు. 

కామెంట్‌లు