శ్రీనివాసం..మహా ప్రసాదం..నిత్య అన్నదానం..! ఎన్టీఆర్..ప్రసాద్‌ల పుణ్య ఫలం !

గోవిందా..గోవిందా..శ్రీనివాసా గోవిందా..ఆపద మొక్కుల వాడా..గోవిందా..అనాధ రక్షకా గోవిందా..ఎక్కడ చూసినా..ఏ మెట్లు ఎక్కినా ..ఆ అపురూపమైన శ్రీనివాసుడే. తిరుమల..తిరుపతి లక్షలాది భక్తుల భగవన్నామ స్మరణతో మార్మోమ్రోగుతూనే వున్నాయి. పేదలు..ధనికులు..అన్ని రంగాలకు చెందిన లబ్ధ ప్రతిష్టులు..సంస్థల అధిపతులు..ప్రపంచం..మెచ్చిన..మహానుభావులు..అనామకులు..అనాధలు..వృద్ధులు..పిల్లలు..దివ్యాంగులు..మహిళలు..అప్పుడే కళ్లు తెరిచిన చిన్నారులు..ఇలా వేలాది మంది నిత్యం ఆ తిరుమల కొండపై వెలసిన శ్రీనివాసుడిని చూసేందుకు తండోప తండాలుగా వస్తూనే వుంటారు. ప్రతి రోజూ శ్రీ వేంకటేశ్వర స్వామితో పాటు అలివేలు మంగమ్మలకు నభూతో నభవిష్యత్ అన్న రీతిలో పూజలు జరుగుతాయి. గాలిమోటార్లు, వాహనాలు, బస్సులు, రైళ్లు భక్తులను కొండ కింద నుండి కొండ పైకి చేరవేస్తాయి. స్వామి, అమ్మవార్లను వేడుకుంటే..దర్శించుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయని..కష్టాల నుండి గట్టెక్కుతామని ప్రగాఢ విశ్వాసం. ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం..ఇపుడు అత్యంత ఆదాయం కలిగిన పుణ్య క్షేత్రంగా వినుతికెక్కింద...