ఎయిర్‌బస్‌తో టెక్ మహీంద్రా ఒప్పందం

ఆటోమొబైల్స్ రంగంలో నెంబర్ వన్ పొజిషన్‌లో ఉన్న టెక్ మహీంద్రా కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్ బస్ తో ఒప్పందం చేసుకుంది. ఐటీ, ఇంజనీరింగ్ రంగంలో తనదైన ముద్రను కనబరుస్తూ వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తోంది. ఇప్పటికే సత్యం కంప్యూటర్స్ సంక్షోభంలో ఉన్న సమయంలో దానిని టేక్ ఓవర్ చేసుకుంది. న్యూ టెక్నాలజీని అంది పుచ్చు కోవడం లోను, దానిని ఇంప్లిమెంటేషన్ చేయడంలోను టెక్ మహీంద్రా కంపెనీ డిఫరెంట్ వేలో వెళుతోంది. తాజాగా తన టెక్నాలజీని అడాప్ట్ చేసేందుకు గాను ఎయిర్ బస్ కు సంబంధించిన క్యాబిన్, కార్గో డిజైన్ ఇంజనీరింగ్ విభాగంలో సర్వీసెస్ అందించేందుకు తాజాగా ఒప్పందం చేసుకుంది. ఈ సేవలన్నింటిని అయిదేళ్ల పాటు టెక్ మహీంద్రా కంపెనీ అందించనుంది. ప్రత్యేకమైన స్కిల్స్ కలిగి ఉండడం ఈ కంపెనీకున్న ప్రత్యేకత. క్యాబిన్ ఇంజనీరింగ్ బిజినెస్ రంగంలో మహీంద్రా టాప్ వన్ పొజిషన్‌లో ఉంది. టెక్ మహీంద్రా గ్లోబల్ హెడ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ ఐఓటి కార్తికేయన్ ఈ మేరకు టెక్ మహీంద్రా , ఎయిర్ బస్‌తో ఒప్పందం చేసుకున్న విషయాన్ని వెల్లడించారు. ఎయిర...