ఎయిర్‌బస్‌తో టెక్ మహీంద్రా ఒప్పందం
ఆటోమొబైల్స్ రంగంలో నెంబర్ వన్ పొజిషన్‌లో ఉన్న టెక్ మహీంద్రా కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్ బస్ తో ఒప్పందం చేసుకుంది. ఐటీ, ఇంజనీరింగ్ రంగంలో తనదైన ముద్రను కనబరుస్తూ వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తోంది. ఇప్పటికే సత్యం కంప్యూటర్స్ సంక్షోభంలో ఉన్న సమయంలో దానిని టేక్ ఓవర్ చేసుకుంది. న్యూ టెక్నాలజీని అంది పుచ్చు కోవడం లోను, దానిని ఇంప్లిమెంటేషన్ చేయడంలోను టెక్ మహీంద్రా కంపెనీ డిఫరెంట్ వేలో వెళుతోంది. తాజాగా తన టెక్నాలజీని అడాప్ట్ చేసేందుకు గాను ఎయిర్ బస్ కు సంబంధించిన క్యాబిన్, కార్గో డిజైన్ ఇంజనీరింగ్ విభాగంలో సర్వీసెస్ అందించేందుకు తాజాగా ఒప్పందం చేసుకుంది.
ఈ సేవలన్నింటిని అయిదేళ్ల పాటు టెక్ మహీంద్రా కంపెనీ అందించనుంది. ప్రత్యేకమైన స్కిల్స్ కలిగి ఉండడం ఈ కంపెనీకున్న ప్రత్యేకత. క్యాబిన్ ఇంజనీరింగ్ బిజినెస్ రంగంలో మహీంద్రా టాప్ వన్ పొజిషన్‌లో ఉంది. టెక్ మహీంద్రా గ్లోబల్ హెడ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ ఐఓటి కార్తికేయన్ ఈ మేరకు టెక్ మహీంద్రా , ఎయిర్ బస్‌తో ఒప్పందం చేసుకున్న విషయాన్ని వెల్లడించారు. ఎయిర్ బస్ స్ట్రాటజిస్టిక్ కస్టమర్ అండ్ పార్ట్ నర్ గా మహీంద్రా కంపెనీతో కొనసాగుతోంది. ఇన్నొవేటివ్ ఇంజనీరింగ్, డిజిటల్ సొల్యూషన్స్ ను కస్టమర్స్ అందించేందుకు ఎంఓయు చేసుకున్నామని తెలిపారు. ఈ ప్రాసెస్ తక్షణమే ప్రారంభమవుతుందని, ఇందులో భాగంగా టెక్నికల్ సపోర్ట్ ఇచ్చేందుకు అన్ని ఏర్పాటు చేశామన్నారు. తమ కంపెనీకి ప్రపంచ వ్యాప్తంగా ఎయిర్ బస్ కు టెక్నాలజీ అందించడంలో ఇంతకు ముందు అనుభవం ఉందన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా విమానయాన రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రపంచలోని దేశాల మధ్య అంతరాలు చెరిగి పోతున్నాయి. దీంతో ఎయిర్ బస్‌ల తయారీ వేగవంతమవుతోంది. ప్రైవేట్ సంస్థలు విమానాలను నడిపిస్తున్నాయి. వీటన్నింటికి ఇపుడు టెక్నాలజీ అన్నది ముఖ్యం. ప్రతి ఎయిర్ బస్ ఆపరేటర్ కంపల్సరీగా టెక్నాలజీతో అనుసంధానం కావాల్సిందే. ఈ సమయంలో డిజిటల్ టెక్నాలజీ అనుసంధానమై ఉన్నది. దీని వల్ల కస్టమర్లకు మెరుగైన , వేగవంతమైన సేవలు అందజేసేందుకు వీలవుతుందని కార్తికేయన్ వెల్లడించారు. ఎయిర్ బస్‌లకు రోజు రోజుకు డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. దీంతో పాటే టెక్నాలజీని అప్ డేట్ చేయాల్సి ఉందన్నారు. దేశ వ్యాప్తంగా ఎన్నో కంపెనీలు ఐటీ పరంగా, ఇంజనీరింగ్ రంగంలో కొలువు తీరి ఉన్నాయి. సేవలు అందజేస్తున్నాయి. కానీ ఎయిర్ బస్ లకు ప్రత్యేకంగా టెక్నాలజీని అడాప్ట్ చేయడంలో టెక్ మహీంద్రానే ఎం
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి