దివ్యాంగుల పాలిట దైవం..మీరా షెనాయ్..!

అత్యున్నతమైన సామాజికవేత్తలలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు మీరా షెనాయ్. సామాజిక, ఆర్థిక, ఉపాధి తదితర రంగాలలో అరుదైన వ్యక్తిగా ..బెస్ట్ సోషల్ ఆంట్రప్రెన్యూర్‌గా పేరు తెచ్చుకున్నారు. చెన్నైయిలో పుట్టినా హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకున్నారు. యూత్ ఫర్ జాబ్స్ పేరుతో ఏర్పాటు చేసిన సంస్థ ఇపుడు నిరుద్యోగుల ఆశలకు రెక్కలు తొడుగుతోంది. డాక్యుమెంటేషన్ స్పెషలిస్టుగా, కమ్యూనికేషన్ ఎక్స్‌పర్ట్‌గా, మెంటార్‌గా, డైరెక్టర్‌గా, సోషల్ ఇంజనీర్‌గా ..ఉమెన్ ఎంపవర్‌మెంట్ దిశగా ఎనలేని కృషి చేశారు. అవార్డులు, పురస్కారాలు అందుకున్నా సింపుల్‌గా ఉండటం ఆమె ప్రత్యేకత. ప్రపంచ బ్యాంకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల రూపకల్పనలో ..ప్రధానమైన డాక్యుమెంట్స్ రూపొందించడంలో మీరా షెనాయ్ కీలక పాత్ర పోషించారు. ఎవరికైనా ప్రతిభ వుంటుంది..దానికి సాన పెడితే తప్పకుండా తమ కాళ్ల మీద తాము నిలబడతారన్నది ఆమె గట్టిగా నమ్మారు. అందుకే యూత్ 4 జాబ్స్ కు శ్రీకారం చుట్టారు. అసంఘటిత రంగంలో ఉన్న పేద కుటుంబాల పిల్లలను ఒకే తాటిపైకి తీసుకు రావడం, వారు తమ కాళ్ల మీద తాము నిలబడేలా చేయడం దీని ఉద...