దివ్యాంగుల‌ పాలిట దైవం..మీరా షెనాయ్..!

అత్యున్న‌త‌మైన సామాజిక‌వేత్త‌ల‌లో ఒక‌రిగా పేరు తెచ్చుకున్నారు మీరా షెనాయ్. సామాజిక‌, ఆర్థిక‌, ఉపాధి త‌దిత‌ర రంగాల‌లో అరుదైన వ్య‌క్తిగా ..బెస్ట్ సోష‌ల్ ఆంట్ర‌ప్రెన్యూర్‌గా పేరు తెచ్చుకున్నారు. చెన్నైయిలో పుట్టినా హైద‌రాబాద్‌ను కేంద్రంగా చేసుకున్నారు. యూత్ ఫ‌ర్ జాబ్స్ పేరుతో ఏర్పాటు చేసిన సంస్థ ఇపుడు నిరుద్యోగుల ఆశ‌ల‌కు రెక్క‌లు తొడుగుతోంది. డాక్యుమెంటేష‌న్ స్పెష‌లిస్టుగా, క‌మ్యూనికేష‌న్ ఎక్స్‌ప‌ర్ట్‌గా, మెంటార్‌గా, డైరెక్ట‌ర్‌గా, సోష‌ల్ ఇంజ‌నీర్‌గా ..ఉమెన్ ఎంప‌వ‌ర్‌మెంట్ దిశ‌గా ఎన‌లేని కృషి చేశారు. అవార్డులు, పుర‌స్కారాలు అందుకున్నా సింపుల్‌గా ఉండ‌టం ఆమె ప్ర‌త్యేక‌త‌. ప్ర‌పంచ బ్యాంకు అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థకాల రూప‌క‌ల్ప‌న‌లో ..ప్ర‌ధాన‌మైన డాక్యుమెంట్స్ రూపొందించ‌డంలో మీరా షెనాయ్ కీల‌క పాత్ర పోషించారు. ఎవ‌రికైనా ప్ర‌తిభ వుంటుంది..దానికి సాన పెడితే త‌ప్ప‌కుండా త‌మ కాళ్ల మీద తాము నిల‌బ‌డ‌తార‌న్న‌ది ఆమె గ‌ట్టిగా న‌మ్మారు. అందుకే యూత్ 4 జాబ్స్ కు శ్రీ‌కారం చుట్టారు. అసంఘ‌టిత రంగంలో ఉన్న పేద కుటుంబాల పిల్ల‌ల‌ను ఒకే తాటిపైకి తీసుకు రావ‌డం, వారు త‌మ కాళ్ల మీద తాము నిల‌బ‌డేలా చేయ‌డం దీని ఉద్దేశం. ఇందు కోసం సొసైటీలో ప్ర‌తి రంగంలో కుదురుకునేలా ..ప‌నులు చేప‌ట్టేలా తీర్చిదిద్దుతారు ఈ సంస్థ‌లో. కేంద్ర‌, రాష్ట ప్ర‌భుత్వాల‌కు ఆర్థిక స‌ల‌హాదారుగా , జీవ‌నోపాధులు, మార్కెటింగ్, స్వ‌యం సమృద్ధిని సాధించేలా పాటుప‌డ్డారు.

యునైటెడ్ నేష‌న్స్ డెవ‌ల‌ప్‌మెంట్ ప్రోగ్రాం కు మీరా షెనాయ్ సీనియ‌ర్ అడ్వ‌యిజ‌ర్‌గా ఉన్నారు. ఎన్ ఎస్ డి ఏ కు ఛైర్మ‌న్‌గా ఉన్న ప్ర‌ధాన‌మంత్రికి స్కిల్లింగ్, ఎంప్లాయిమెంట్ అండ్ స‌పోర్టింగ్ కీల‌క స‌ల‌హాదారుగా ఉన్న ర‌మాదొరైకి స‌పోర్ట్‌గా ప్ర‌స్తుతం వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆమె చెన్నైయిలో ఓ మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబంలో జ‌న్మించారు. ఎస్ ఎస్ భ‌ట్నాగ‌ర్ అవార్డు పొందిన డాక్ట‌ర్ సుబోధ్ స‌హాయ్‌ను పెళ్లి చేసుకున్నారు. యునెస్కోలో 11 విభాగాల్లో ఆయ‌న రీసెర్చ్ చేశారు. ఎంప్లాయిమెంట్ జ‌న‌రేష‌న్ అండ్ మార్కెటింగ్ మిష‌న్ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్‌గా మీరా ప‌నిచేశారు. ఆయా కంపెనీల‌లో ఎంట్రీ లెవ‌ల్ ఉద్యోగాల‌లో గ్రామీణ ప్రాంతాల‌కు చెందిన యువ‌తీ యువ‌కుల‌కు ఉపాధి క‌ల్పించేలా కృషి చేశారు. ప‌నుల్లో ప్ర‌తిభ క‌న‌బ‌ర్చేలా యూత్ 4 జాబ్స్ ద్వారా శిక్ష‌ణ ఇస్తారు. ఆరేళ్లు అక్క‌డ ప‌నిచేశాక‌..2 ల‌క్ష‌ల 20 వేల మంది యువ‌త‌ను తీసుకున్నారు. వారికి అన్ని రంగాల‌లో ట్రైనింగ్ ఇప్పించారు. ఇందులో 70 శాతానికి పైగా ఉద్యోగాలు పొందారు. ఈ ఘ‌నత దేశంలో ఈ ఒక్క సంస్థ‌నే సాధించ‌డం విశేషం. ఐటీ రంగంలో పూర్తి పార‌ద‌ర్శ‌క‌త ఉండేలా యూత్‌ను తీర్చిదిద్దారు. ఆమె చేసిన కృషికి గుర్తింపుగా వాల్ స్ట్రీట్ జ‌ర్న‌ల్‌లో ప్ర‌త్యేక క‌థ‌నం ప్ర‌చురిత‌మైంది. ప్ర‌పంచ బ్యాంకుకు స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్‌గా, క‌న్స‌ల్టెంట్‌గా ఉన్నారు.

బీహార్ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న జీవిక ప్రాజెక్టుకు స‌ల‌హాదారుగా ఉన్నారు. ప్ర‌తిభ‌, వ్యూహాలు, కెపాసిటి బిల్డింగ్ పై మాడ్యుల్ త‌యారు చేశారు. దీని వ‌ల్ల కొంత మేర వ‌ల‌స‌లు త‌గ్గాయి. జాతీయ‌, అంత‌ర్జాతీయ సంస్థ‌లు మీరా షెనాయ్‌ను స్కిల్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్‌పై ప్ర‌సంగించేందుకు ఆహ్వానించాయి. దివ్యాంగుల‌పైనే ఎక్కువ‌గా మేడం కాన్‌సెంట్రేష‌న్ చేశారు. యుఎన్‌డిపి, వ‌ర‌ల్డ్ బ్యాంక్‌తో పాటు సెర్ప్ తో ప‌ర‌స్ప‌ర స‌హ‌కార ఒప్పందం చేసుకున్నారు. అటు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం యూత్ ఫ‌ర్ జాబ్‌తో సెంట‌ర్ ఫ‌ర్ పిడ‌బ్ల్యుడి లైవ్లీహుడ్స్ అనే పేరుతో కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తోంది. ఇదంతా రిటైట్ , మార్కెటింగ్ ఇంట‌ర్వెన్ష‌న్‌ను ప్రాతిప‌దిక‌గా చేసుకుని జ‌రుగుతోంది. టిఆర్ ఆర్ ఏఐఎన్ సంస్థ‌తో ఒప్పందం క‌లిగి వుంది. రిటైల్ అసోసియేష‌న్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం చేసుకోవ‌డంతో వేలాది మంది నిరుద్యోగుల‌కు క‌నీస భ‌ద్ర‌త‌తో కూడిన ఉపాధి దొరుకుతోంది. అంత‌ర్జాతీయ కార్మిక సంస్థ ఏర్పాటు చేసిన క‌మిష‌న్‌లో స‌భ్యురాలిగా నియ‌మింప‌బ‌డ్డారు మీరా షెనాయ్. విక‌ల‌త్వం , లేబ‌ర్ మార్కెట్‌పై విస్తృతంగా ప‌రిశోధ‌న‌లు చేశారు.

కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా అమ‌లు చేస్తున్న ఎన్ ఎస్ డిసి అండ్ మినిస్ట్రీ ఆఫ్ రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ కి స‌ల‌హాదారుగా ఉన్నారు. అమ‌లు చేస్తున్న ఈ ప‌థ‌కంలో మేడం కీల‌క పాత్ర పోషించారు. ఇటీవ‌ల జైపూర్‌లో జ‌రిగిన లిట‌ర‌రీ ఫెస్టివ‌ల్‌లో ఆమె డిస‌బిలిటి మీద రాసిన పుస్త‌కాన్ని ఆవిష్క‌రించారు. ప్ర‌పంచంలోనే అత్యంత భారీ ఫెస్టివ‌ల్ గా పేరున్న‌ది. హిందీ వెర్ష‌న్ లో రెండోసారి పుస్త‌కం ప్ర‌చుర‌ణ‌కు నోచుకుంది. దేశంలోనే మొద‌టిసారిగా యూత్ 4 జాబ్స్ హైద‌రాబాద్‌లో ట్రైనింగ్ సెంట‌ర్ ప్రారంభ‌మైంది. 14 రాష్ట్రాలు 24 న‌గ‌రాల‌లో ఈ సంస్థ విస్త‌రించింది. ఇందులో మీరా షెనాయ్‌తో పాటు టీం స‌భ్యులుగా గోపాల్ గార్గ్, అనిల్ మాథుర్ ఉండ‌గా..బోర్డు స‌భ్యులుగా రిటైర్డ్ ఆంధ్రాబ్యాంకు ఉద్యోగి గోపినాథ్, సిఏ ర‌వి కొల‌థూర్, అజ‌య్ గాంధి ఉన్నారు. బోర్డ్ ఆఫ్ అడ్వ‌యిజ‌ర్స్‌గా సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి జ‌యేష్ రంజ‌న్, బుడితి రాజశేఖ‌ర్‌తో పాటు అమ‌ల అక్కినేని, లూయిస్ మిరండా, సుచిత్రా షెనాయ్, దీన‌ద‌యాళ‌న్ తోడ్పాటు అంద‌జేస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా సోష‌ల్ సెక్టార్‌లో పేరున్న ప‌ది మందిని ఎంపిక చేస్తేలో అందులో మొద‌టి వ‌రుస‌లో నిలుస్తారు మీరా. క‌మ్యూనికేష‌న్ రంగంలో స్పెష‌లిస్ట్‌గా ఆమె పేరు తెచ్చుకున్నారు. డాక్యుమెంటేష‌న్ ప్ర‌జెంటేష‌న్ చేయ‌డంలో ఆమెకు సాటి రారెవ్వ‌రు. దివ్యాంగులు కూడా మ‌నుషులేన‌ని..వారు కూడా స‌మాజంలో భాగ‌మేన‌ని..వారిని మ‌నుషులుగా గుర్తించాల‌ని ఆమె త‌పించారు. ఏకంగా వారు అన్ని రంగాల‌లో భాగం పంచుకునేలా తీర్చిదిద్దారు. వెలుగులో ఆమె కీల‌క భాగ‌స్వామిగా ఉన్నారు. మ‌హిళ‌ల‌ను గ్రామీణ విలేక‌రులుగా త‌ర్ఫీదు ఇచ్చారు. వారు స్వంతంగా త‌మ క‌థ‌ల‌ను తామే ప్ర‌చురించుకునేలా చేశారు. రూర‌ల్ రిపోర్టింగ్‌లో ఇదో రికార్డుగా పేర్కొన‌వ‌చ్చు. గ‌ర్వించద‌గిన క‌మ్యూనికేష‌న్ స్పెష‌లిస్టుల‌లో ఆమె కూడా ఒక‌రు. ఎన్నో అవార్డులు, రివార్డులు, పుర‌స్కారాలు అందుకున్నారు. దివ్యాంగుల అభ్యున్న‌తి కోసం చేసిన కృషికి గుర్తింపుగా  రాష్ట్ర‌ప‌తి చేతుల మీదుగా జాతీయ అవార్డు తీసుకున్నారు. అంత‌ర్జాతీయ విక‌లాంగుల దినోత్స‌వం సంద‌ర్భంగా అందుక‌న్నారు. కార్పొరేట్ కంపెనీల‌లో శిక్ష‌ణ‌, ఉపాధి క‌ల్పించినందుకు గుర్తింపు తెచ్చుకున్నారు. నాట్ జ‌స్ట్ ఆర్ట్ పేరుతో డిజిట‌ల్ ఫ్లాట్ ఫారంను క్రియేట్ చేశారు.

విజువ‌ల్ ఆర్టిస్టుల‌కు , దివ్యాంగుల‌కు ఒక వేదిక‌గా ఉప‌యోగ‌ప‌డేలా తీర్చిదిద్దారు. ఆర్ట్ వ‌ర‌ల్డ్‌లో వీరు భాగ‌స్వామ్యం ఉండేలా చూశారు. ఆయా పాఠ‌శాల‌లు, క‌మ్యూనిటీ సెంట‌ర్ల‌లో యూత్ 4 జాబ్స్‌లో శిక్ష‌ణ పొందిన వారు ఇక్క‌డ పిల్ల‌ల‌కు ట్రైనింగ్ ఇస్తారు. భ‌రోసా క‌ల్పిస్తారు. 2011లో మ‌న్‌థ‌న్ అవార్డు తో పాటు ఎన్‌సిపిఇడిపి - హెల్లెన్ కెల్లర్ అవార్డు పొందారు. యుఎన్‌డిపి అండ్ వ‌ర‌ల్డ్ బ్యాంక్ ప‌బ్లికేష‌న్స్‌లో  వ‌ర్క్ చేసినందుకు గాను బెస్ట్ ప్రాక్టీస్‌గా నామినేట్ చేయ‌బ‌డ్డారు. 2012-13లో బిజినెస్ అండ్ క‌మ్యూనిటీ కేట‌గిరిలో ఫెట్జెర్ ఫౌండేష‌న్ యుఎస్ ఏ అవార్డు ప్ర‌క‌టించింది. స్కిల్ డెవ‌ల‌ప్ మెంట్ కేట‌గిరీ కింద బీహార్ ప్ర‌భుత్వం 2014లో బెస్ట్ ఇన్నోవేష‌న్ ఫోరం రెండో అవార్డుకు ఎంపిక చేసింది. 2015లో స్టాన్‌ఫోర్డ్ న‌గ‌రంలో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించిన సెర్మ‌నీలో హ్యాపినెస్ హాల్ ఆఫ్ ఫేమ్ గా మీరా షెనాయ్‌ను ఇంట్ర‌డ్యూస్ చేశారు. అదే ఏడాది రోట‌రీ క్ల‌బ్ వొకేష‌న‌ల్ ఎక్స‌లెన్స్ అవార్డు ద‌క్కించుకున్నారు. జీవ‌నోపాధుల క‌ల్ప‌న విష‌యంలో ఏషియాలోనే ప్ర‌తిష్టాత్మ‌క‌మైన పుర‌స్కారాన్ని అందుకున్నారు. వియ‌న్నాలోని యుఎన్ ఆఫీస్‌లో కేస్ స్ట‌డీ స‌మ‌ర్పించినందుకు ప్ర‌శంస‌లు ల‌భించాయి. జీరో ప్రాజెక్టు కాన్ఫ‌రెన్స్‌లో ప్ర‌త్యేకంగా పాల్గొన్నారు.

2016లో అమెరికాలో స్పిరిట్ ఆఫ్ హ్యుమానిటీ తో స‌త్క‌రించారు. రెండు కేట‌గిరీల‌లో దీనిని అందుకోవ‌డం ఆమెకు ద‌క్కిన అరుదైన గౌర‌వంగా భావించాలి. బెంగ‌ళూర్ ఎన్ హెచ్ ఆర్ డిలో ట్రైనింగ్ మాడ్యుల్స్ , కేస్ స్ట‌డీస్ స‌మ‌ర్పించినందుకు గాను 2017లో బెస్ట్ అవార్డు పొందారు. స‌మాజంలో మార్పు కోసం..దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు ప్ర‌స‌రింప చేసినందుకు గాను మీరాను బెస్ట వుమెన్ అచీవ‌ర్‌గా ఫిక్కీ ఘ‌నంగా స‌త్క‌రించింది. మ‌నుషుల ప‌ట్ల ఆద‌ర‌ణ‌..అద్భుత‌మైన క‌మ్యూనికేష‌న్స్ , పీఆర్, రైటింగ్ స్కిల్స్ క‌లిగి ఉన్న ఆమెతో క‌లిసి ప‌ని చేసినందుకు ఆనందంగా వుంది. అంత‌కంటే గ‌ర్వంగా ఉంది కూడా. సింప్లిసిటినీ ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డే మీరా షెనాయ్ ఎప్పుడూ డిఫ‌రెంట్‌గా ప్ర‌జెంట్ చేయ‌డం ఎలాగో ఆలోచిస్తూనే వుంటారు. నిజంగా వ‌య‌సు శ‌రీరానికే కానీ మ‌న‌సుకు కాదన్న వాస్త‌వం మేడంను చూస్తే తెలుస్తుంది.  ఎక్క‌డో చ‌దివా..క్రియేటివిటీ ఈజ్ ఏ ఆర్ట్ ఆఫ్ సెన్సిబిలిటి అని..ఇపుడ‌నిపిస్తోంది..మీరా షెనాయ్ ఎంచుకున్న మార్గం గొప్ప‌ద‌ని..

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!