వెల్లి విరిసిన చైతన్యం..అన్నదాతల ఆగ్రహం - దేశం చూపు నిజామాబాద్ వైపు

ఎన్నికల వేళ దేశమంతా తెలంగాణలోని నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం వైపు చూస్తోంది. ఎన్నడూ లేనంతగా ఈ ప్రాంతం ఇపుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ ఏకంగా 200 మంది రైతులు ఎంపీ ఎన్నికల్లో బరిలో దిగారు. తాము పండించిన పంటకు మద్ధతు ధర లభించడం లేదని, ఆరుగాలం పండించే తమను తెలంగాణ ప్రభుత్వం పట్టించు కోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ జిల్లాలో ఎక్కువ శాతం పసుపు, చెరుకు పంట పండిస్తారు. ఎన్నిసార్లు మొత్తుకున్నా..విన్నవించుకున్నా ఉన్నతాధికారులు కానీ..పాలకులు కానీ తమ గోడు విన్న పాపాన పోలేదంటున్నారు బాధితులు. తమ సమస్యను దేశ వ్యాప్తంగా తెలియ చేయాలనే ఉద్ధేశంతోనే తాము ఎన్నికలను ఆయుధంగా మల్చుకున్నామని వారంటున్నారు. ఇక్కడ సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రైతుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేశానని ఆమె అంటున్నారు. కానీ అన్నదాతలు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాటలు తప్ప ఆచరణలో తమ గురించి ఆలోచించిన దాఖలాలు లేవన్నారు. ఎన్నికల సంఘం ప్రత్యేకంగా బ్యాలెట్ బాక్సులు ...