పోస్ట్‌లు

అక్టోబర్ 16, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

దాతృత్వంలో శివ్ నాడార్ టాప్

చిత్రం
ప్రపంచంలో లెక్కలేనంత మంది ధనవంతులు ఉన్నారు. పట్టలేనంతగా కరెన్సీ, బంగారం, వజ్రాలు, వైఢూర్యాలు ఉన్నాయి. కానీ అంత కంటే ఎక్కువగా పేదలు కాలే కడుపులతో చావుకు దగ్గరవుతున్నారు. ఇక ఇండియా పరంగా చూస్తే జనాభా 130 కోట్లు ఉన్నా వీరిలో కేవలం 10 శాతం మంది చేతుల్లో మాత్రమే సంపద పోగై ఉన్నది. వీరిలో ఎక్కువగా దేశానికి పన్ను చెల్లించకుండా అక్రమ మార్గాల్లో, హవాలా రూపంలో ఇతర దేశాలకు తరలించి, అక్కడి బ్యాంకుల్లో దాచుకున్న వారే. వీరిలో ఇప్పటికే వేలాది మంది స్విస్ బ్యాంక్ లో దాచుకున్న వారున్నారు. మరో వైపు కోట్లాది ఆస్తులు, డబ్బులున్నా ఒక్క పైసా పేదల కోసం, సమాజ అభివృద్ధి కోసం పాటు పడిన దాఖలాలు లేవు. ఇదిలా ఉండగా కొందరు డబ్బున్న మారాజులు మాత్రం తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. వారిలో మొదటి స్థానంలో ఉన్నారు చెన్నైకి చెందిన పారిశ్రామిక టెక్ దిగ్గజం శివ్ నాడార్. తాజాగా ఇండియాలో దేశ ప్రజల సంక్షేమం కోసం వ్యక్తిగతంగా, తమ సంస్థల ద్వారా చేస్తున్న కృషి ఆధారంగా దాతల జాబితాను..రూపొందించారు. ఈ జాబితాలో ప్రముఖ రిలయన్స్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ మూడో స్థానంలో నిలిచారు. గతంలో ఆయన రెండో స్థానంలోఉండ...

ఇండియా కంటే పాక్ బెటర్

చిత్రం
ఓ వైపు దేశం అభివృద్ధి పథంలో దూసుకెళుతోంది అంటూ బీరాలు పలుకుతున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ మాటలు నీటి మూటలేనని తేలి పోయింది. ఓ వైపు ఉగ్రవాదులు, తీవ్రవాదులతో సతమవుతూనే, ఆర్ధిక రంగంలో తీవ్ర సంక్షోభంతో కొట్టు మిట్టాడుతున్న పాకిస్థాన్ పేదరిక నిర్మూలనలో మాత్రం ఇండియా కంటే మెరుగైన స్థాయిలో ఉన్నది. రోజుకు చిలుప పలుకులు పలుకుతూ జనాన్ని బురిడీ కొట్టిస్తున్న బీజేపీ సర్కార్ చేస్తున్నది ఏమీ లేదని స్పష్టమైంది. నోట్ల రద్దు, జీఎస్టీ, స్వచ్ఛ భరత్ అంటూ మెస్మరైజ్ చేస్తున్న మోదీ పనితీరు బాగోలేదన్నది స్పష్టమైంది. పేదరిక నిర్మూలనలో పూర్తిగా వెనుకబడింది. ఎంతగా అంటే పాకిస్థాన్, దక్షిణాఫ్రికా వంటి దేశాల కన్నా అథమ స్థితిలో ఉంది. 117 దేశాల సమాచారంతో రూపొందించిన గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో భారత దేశం 102వ స్థానంలో నిలిచింది. గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో 2015లో 93వ స్థానంలో ఉన్న ఇండియా తాజాగా 102వ స్థానానికి దిగ జారడం మేధావులను, ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. దక్షిణాసియా దేశాల్లో భారత దేశం మినహా మిగిలిన దేశాలు 66 నుంచి 94 వరకు ర్యాంకులు సాధిస్తే, మనం మాత్రం మరింత వెనక్కి వెళ్లడం విస్తు పోయేలా చేసింది. బ్...

కేసీఆర్‌ ఫాంహౌజ్‌లో కానిస్టేబుల్‌ ఆత్మహత్య

చిత్రం
గజ్వెల్‌లోని ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవసాయ క్షేత్రంలో వెంకటేశ్వర్లు అనే కానిస్టేబుల్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. కేసీఆర్‌ ఫాంహౌజ్‌లో విధులు నిర్వర్తిస్తున్న 12వ బెటాలియన్‌కు చెందిన వెంకటేశ్వర్లు ఏకే 47 తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఫాంహౌజ్‌లో వెంకటేశ్వర్లు హెడ్‌గార్డ్‌గా విధుల్లో ఉన్నట్టు సమాచారం. ఈ వార్త తెలంగాణ అంతటా వైరల్ గా మారింది. ఓ వైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్రంగా మారింది. వీరి సమ్మెకు అన్ని ఉద్యోగ సంఘాలతో పాటు ప్రతిపక్ష పార్టీలన్నీ మద్దతు పలికాయి. హైకోర్టు కూడా సర్కార్ తీరుపై సీరియస్ అయ్యింది. టీఆర్టీ అభ్యర్థులు రోడ్డెక్కారు. ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నం చేశారు. సీఎం పై నిప్పులు చెరిగారు. ఇంకో వైపు విద్యుత్ ఉద్యోగులు ధర్నా బాట పట్టారు. ఇదిలా ఉండగా వెంకటరర్లు సూసైడ్ చేసు కోవడం తెలంగాణాలో సంచలం కలిగించింది. మద్యం మత్తులోనే వెంకటేశ్వర్లు ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌ డేవిస్‌ అనుమానం వ్యక్తం చేశారు. అతను గత కొంతకాలంగా విధులకు సరిగా హాజరు కావడం లేదని తెలిపారు. వెంకటేశ్వర్లు భార్య విఙ్ఞప్తితో తిరి...

టీఎస్ సర్కార్ కు హైకోర్టు షాక్

చిత్రం
నిన్నటి దాకా మొండి వైఖరితో వ్యహరిస్తున్న తెలంగాణ ప్రభత్వానికి రాష్ట్ర హైకోర్టు షాక్ ఇచ్చింది. తక్షణమే ఆర్టీసీ కార్మికులకు నిలిపి వేసిన సెప్టెంబర్ నెల వేతనాలను వారి ఖాతాల్లో జమ చేయాలని ఆదేశించింది. కోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంప పెట్టు లాంటిదని ఆర్టీసీ జేఏసీ నాయకులు చెప్పారు. సోమవారం లోపు ప్రతి ఒక్క కార్మికుడికి అందేలా చూడాలని, లేకపోతే బాగుండదని హెచ్చరించింది ధర్మాసనం. సెల్ఫ్ డిస్మిస్ అన్న పదంతో కాకా పుట్టించిన కేసీఆర్ కు ఝలక్ ఇచ్చింది కోర్టు. తమ న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం కార్మికులు చేస్తున్న సమ్మె తీవ్ర రూపం దాల్చింది. సీఎం మొండి వైఖరి నశించాలని, కార్మికులతో బేషరత్ గా చర్చలు చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. అంతకు ముందు కార్మికులకు ఎలాంటి జీతాలు చెల్లించబోమని సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రకటించడంపై సర్వత్రా నిరసన వ్యక్తమైంది. అంతే కాకుండా కార్మికులంతా వారంతట వారే డిస్మిస్ అయ్యారంటూ చేసిన వ్యాఖ్యలతో ఇద్దరు ఆర్టీసీ కార్మికులు సూసైడ్ చేసుకున్నారు. దీంతో తెలంగాణ అంతటా కార్మికులు ఆందోళనలు చేపట్టారు. ఆర్టీసీ జేఏసీ నేతలు అశ్వత్థామ రెడ్డి, రాజి రెడ్డి, థామస్ రెడ్డి లను పోలీసులు ...