టీఎస్ సర్కార్ కు హైకోర్టు షాక్

నిన్నటి దాకా మొండి వైఖరితో వ్యహరిస్తున్న తెలంగాణ ప్రభత్వానికి రాష్ట్ర హైకోర్టు షాక్ ఇచ్చింది. తక్షణమే ఆర్టీసీ కార్మికులకు నిలిపి వేసిన సెప్టెంబర్ నెల వేతనాలను వారి ఖాతాల్లో జమ చేయాలని ఆదేశించింది. కోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంప పెట్టు లాంటిదని ఆర్టీసీ జేఏసీ నాయకులు చెప్పారు. సోమవారం లోపు ప్రతి ఒక్క కార్మికుడికి అందేలా చూడాలని, లేకపోతే బాగుండదని హెచ్చరించింది ధర్మాసనం. సెల్ఫ్ డిస్మిస్ అన్న పదంతో కాకా పుట్టించిన కేసీఆర్ కు ఝలక్ ఇచ్చింది కోర్టు. తమ న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం కార్మికులు చేస్తున్న సమ్మె తీవ్ర రూపం దాల్చింది. సీఎం మొండి వైఖరి నశించాలని, కార్మికులతో బేషరత్ గా చర్చలు చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేశాయి.

అంతకు ముందు కార్మికులకు ఎలాంటి జీతాలు చెల్లించబోమని సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రకటించడంపై సర్వత్రా నిరసన వ్యక్తమైంది. అంతే కాకుండా కార్మికులంతా వారంతట వారే డిస్మిస్ అయ్యారంటూ చేసిన వ్యాఖ్యలతో ఇద్దరు ఆర్టీసీ కార్మికులు సూసైడ్ చేసుకున్నారు. దీంతో తెలంగాణ అంతటా కార్మికులు ఆందోళనలు చేపట్టారు. ఆర్టీసీ జేఏసీ నేతలు అశ్వత్థామ రెడ్డి, రాజి రెడ్డి, థామస్ రెడ్డి లను పోలీసులు అరెస్ట్ చేశారు. కార్మికుల నుంచి వత్తిళ్లు రావడంతో వెంటనే నాయకులను విడుదల చేశారు. కార్మికులకు పూర్తి స్థాయిలో అన్ని పార్టీలతో పాటు ప్రజా సంఘాలు, విద్యార్ధి, ఉపాధ్యాయ, టీజేఏసీ సంస్థలు మద్దతు తెలిపాయి.

మేధావులు, కవులు, కళాకారులు, టీచర్లు సైతం కార్మికులకు అండగా నిలిచారు. దీంతో కార్మికుల సమ్మె సకల జనుల సమ్మెగా మారింది. ఇదే సమయంలో సెప్టెంబర్ నెల వేతనాలను సర్కార్ నిలిపి వేసిందని, దీంతో తమ కుటుంబాలు గడవడం కష్టంగా మారిందంటూ కార్మికుల తరపున హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. దీంతో విచారణకు స్వీకరినించిన కోర్టు కీలకమైన తీర్పు వెలువరించింది. ఆలస్యం చేయకుండా వెంటనే కార్మికులందరికీ వేతనాలు ఇవ్వాలని తీర్పు చెప్పింది. అయితే జీతాలు తీసుకుని తిరిగి యధావిధిగా సమ్మెలో కార్మికులు పాల్గొంటారని ఆర్టీసీ జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. 

కామెంట్‌లు