దౌడు తీస్తున్న డెయిలీ హంట్ - భారీగా ఇన్వెస్ట్ చేసిన సాఫ్ట్ బ్యాంక్

దేశ వ్యాప్తంగా న్యూస్ విషయంలో ట్రెండింగ్ సృష్టిస్తూ రికార్డులు బ్రేక్ చేస్తున్న డెయిలీ హంట్ కు భారీ ఆఫర్ ను ప్రకటించింది సాఫ్ట్ బ్యాంక్ . కంటెంట్ విషయంలో , న్యూస్ విషయంలో డైలీ హంట్ దూసుకెళుతోంది. తాజా వార్తలను, విశేషాలను, ప్రత్యేక కథనాలను యాప్‌లో పొందు పరుస్తోంది. దీంతో తక్కువ టైంలోనే భారీగా స్పందన వచ్చింది. డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ఎప్పటికప్పుడు న్యూస్‌ను, వ్యూస్‌ను పొందుపరుస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. 150 మిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టింది సాఫ్ట్ బ్యాంక్ . ఒకరకంగా చెప్పాలంటే ఇండియన్ న్యూస్ స్టార్టప్‌లలో ఇదో రికార్డు అని చెప్పాలి. ఇపుడు సాఫ్ట్ బ్యాంకు డెయిలీ హంట్ కంపెనీగా మారి పోయింది. జపాన్ లో సాఫ్ట్ బ్యాంకుకు ఎక్కడలేని జనాదరణ ఉంది. బ్యాంకింగ్ రంగంలో అత్యున్నతమైన స్థానంలో ఉన్న సాఫ్ట్ బ్యాంకు ప్రపంచ వ్యాప్తంగా స్టార్టప్ కంపెనీలలో పెట్టుబడులు పెడుతోంది. అందులో భాగంగానే డైలీ హంట్ ను టేకోవర్ చేసింది. రీజినల్ లాంగ్వేజెస్ ప్రధానంగా ఈ న్యూస్ పనిచేస్తోంది. ఇందులో కంటెంట్ మిగతా వాటికంటే భిన్నంగా అప్ లోడ్ చేయ...