బిగ్ ఆఫర్ కొట్టేసిన లివ్ స్పేస్
ఐటీ అంటేనే బెంగళూరు. ఇండియాకు స్వర్గధామంగా విరాజిల్లుతోంది. ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన దిగ్గజ కంపెనీలన్నీ పొరుగు సేవలను ఇక్కడి ఐటీ కంపెనీలతో అనుసంధానమై పనిచేస్తున్నాయి. ఇబ్బడి ముబ్బడిగా వచ్చి పడిన ఐటీ కంపెనీల పుణ్యమా అని లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్నాయి. అంకురాలకు, ఆంట్రప్రెన్యూర్లకు విపరీతమైన స్కోప్ లభిస్తోంది. దీంతో ఔత్సాహికులు, యంగ్ ఛాప్స్ అంతా ఐటీ జపం చేస్తున్నారు. జీవితానికి సరిపడా వేతనాలు ఉండనే ఉన్నాయి. కష్టపడి చదువుకుంటున్నారు.
ఎప్పుడూ లేనంతగా గత 10 సంవత్సరాలుగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి..అనుబంధంగా ఉన్న కోర్సులను చదివేందుకు ప్రయారిటీ ఇస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల నుండి ఇండియాకు వస్తున్నారు చదివేందుకు. అంతటి డిమాండ్ ఉంటోంది ఇక్కడి కాలేజీలు, సంస్థలకు. ఎంఐటీలు, ఐఐటీలు, ఎంఐటీలు వాటిలోనివే. హెవీ పోటీ ఉంటోంది వీటికి. లక్షలాది మంది ప్రతి ఏటా జేఇఇ మెయిన్స్, అడ్వాన్స్ కు ప్రిపేర్ అవుతారు. వీరిలో కొద్ది మందికి మాత్రమే ఛాన్స్ వరిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నాయి స్టూడెంట్స్ మీద. ప్రస్తుతం తాజాగా నిర్వహించిన సర్వేలో ఎక్కువ శాతం సక్సెస్ అయిన స్టార్టప్‌లలో బెంగళూరు కేంద్రంగా నడుస్తున్నవే ఉన్నాయి.
వరల్డ్ వైడ్‌గా బడా కంపెనీలన్నీ పింక్ సిటీనే ఎంచుకుంటున్నాయి. కొందరికి ఇల్లు కట్టడం, దానిని అందంగా తయారు చేసుకోవడం హాబీ. వారి అభిరుచులకు అనుగుణంగా ఫర్నీచర్ వస్తువులకు విపరీతమైన గిరాకి. బెంగళూరు కేంద్రంగా ప్రారంభమైన లివ్ స్పేస్ ఫర్నీచర్ బేస్డ్ స్టార్టప్ కంపెనీ. 15 మిలియన్ల డాలర్లను ఐకియా కంపెనీ పెట్టుబడి పెట్టింది. ఐకియా లివ్ స్పేస్ ఫర్నీచర్ ఈ రిటైలర్స్ కంపెనీగా మారింది. లివ్ స్పేస్ ఆన్ లైన్ లో ఇండ్లు, ఫ్లాట్స్ కు తగ్గట్టు డిజైన్ చేసి..ఫర్నీచర్ ఏర్పాటు చేస్తుంది.
టెక్నాలజీ ఇన్వెస్ట్ మెంట్ ఆధారంగా ఐకియా దీనిలో పెట్టుబడి పెట్టింది. తాము పడిన కష్టానికి దక్కిన ఫలితమిది అని వెల్లడించారు లివ్ స్పేస్ కో ఫౌండర్ రమాకాంత్ శర్మ. రిటైల్ టెక్నాలజీ, సప్లయి చైన్, తదితరవన్నీ ఇందులో మిళితమై ఉన్నాయని పేర్కొన్నారు. ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్ ప్రకారం 70 మిలియన్ డాలర్ల వాల్యూ లివ్ స్పేస్‌కు దక్కింది. ఇది కూడా ఓ రికార్డే. లివ్ స్పేస్‌ను 2014లొ అనూజ్ శ్రీవాత్సవ, శర్మలు కలిసి ప్రారంభించారు. ఐకియాతో పాటు జంగిల్ వెంఛర్స్, బెస్సెమెర్ వెంచర్ పార్ట్ నర్స్, హెలియన్ వెంచర్స్ ఇందులో పెట్టుబడులు పెట్టాయి.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి