సర్వేలన్నీ ఒకే మాట..ఒకే బాట..అన్నీ గంప గుత్తే
దేశ వ్యాప్తంగా 17వ సార్వత్రిక ఎన్నికలు ఏడు దశల్లో జరిగాయి. కొన్ని చెదురుమదురు సంఘటనలు మినహా పోలింగ్ పూర్తయింది. ఇక సర్వే సంస్థలు పొలోమంటూ ఇబ్బడి ముబ్బడిగా ప్రీ పోల్ సర్వేల ఫలితాలు ప్రకటించాయి. అసలు ఏయే పార్టీలకు ఎన్ని సీట్లు వస్తాయో కూడా చెప్పేశాయి. అన్నీ ఒకే రాగం ఆలాపించాయి. అదేమిటంటే మోదీ తిరిగి అధికారంలోకి రానున్నారని ఇవే స్పష్టం చేశాయి. ఇంకా ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కాలేదు. ఎవరు ఎవరికి ఒటు వేశారో తెలియదు. కానీ సర్వేలన్నీ కమలానికే మద్ధతు పలికాయి. సర్వేలకు ఉన్న ప్రాతిపదికత ఏమిటో ఇప్పటి వరకు అర్థం కాలేదు. కనీసం ప్రతిపక్షాలు, ప్రాంతీయ పార్టీలు అడ్రస్ లేకుండా పోయాయి.
దేశ వ్యాప్తంగా ఇప్పటికప్పుడు నిజమైన సర్వే చేపడితే ..ఎక్కడ చూసినా ప్రజా వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంది. జనాన్ని తమ వైపు తిప్పుకోవడంలో, వారిని ఓట్లుగా మల్చుకోవడంలో కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలు ఘోరంగా వైఫల్యం చెందాయి. చంద్రబాబు అన్నట్టు సర్వేల మాటలు నమ్మకండి. నాకు పూర్తి విశ్వాసం ఉన్నది..తిరిగి మేం అధికారంలోకి వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మరో వైపు ఎలా ప్రమాణం స్వీకారం చేయాలో..ఎవరెవరికి పోర్ట్ ఫోలియోలు ఇవ్వాలో..ఏయే శాఖలు తన వద్ద వుంచుకోవాలో..ఎవరిని టార్గెట్ చేయాలో..ఎలా మానిటరింగ్ చేస్తూ..పోయిన పవర్ ను ..తిరిగి తెచ్చుకోవాలోనని వైఎస్ జగన్ కలలు కంటున్నారు. తండ్రి మరణించిన వార్త తెలియగానే ఎమ్మెల్యేలతో సంతకాలు చేయించిన ఘనమైన చరిత్ర ఆయనది.
మరో వైపు తొమ్మిదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్న తెలుగు తమ్ముళ్లు, ఎమ్మెల్యేలు , నేతలు ప్రజలను పట్టించు కోలేదు. తమ గొయ్యిని తామే తవ్వుకున్నారు. సవాలక్ష సమస్యలతో ఉన్న ఏపీ ప్రజలు బాబు పాలన కారణంగా ఇబ్బందులు పడ్డారు. రాక రాక తిరిగి పవర్లోకి వచ్చిన చంద్రబాబు మరింత డెవలప్ మెంట్ మీద దృష్టి పెట్టి ఉవింటే ఇంతటి ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొని ఉండే వారు కాదేమో. ఇక సర్వేల విషయానికి వస్తే..మోదీ ఏం చేశారని ..దేశానికి ఏం వెలగ బెట్టారని ఓటర్లు ఓట్లు వేశారో చెప్పలేదు. నోట్ల రద్దు దెబ్బకు జనం విలవిలలాడి పోయారు. మరికొందరు రోడ్ల మీదకు వచ్చారు. ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిన పాపాన పోలేదు.
మోదీ చిరునవ్వు నవ్వుతూనే ఉన్నారు. తనకు ఎదురే లేదంటూ ముందుకు సాగుతున్నారు. సర్వేల దెబ్బకు విపక్షాలు మిన్నకుండి పోగా మోదీ అండ్ అమిత్ షా టీం మాత్రం సంతోషంలో మునిగి తేలుతోంది. మరో వైపు లగడపాటి ఓ ఛానల్‌లో మాట్లాడుతూ తాము 175 సీట్లలో సర్వే చేయలేదని..120 సీట్లలో దశల వారీగా సర్వే చేపట్టామని తెలిపారు. జనంలోకి వచ్చే ముందు..ఏం మాట్లాడుతున్నామో తెలుసుకుని మాట్లాడాలి. ఇలాంటి వాళ్లు నేతలుగా చెలామణి అవుతున్నందునే ఈ దేశం ఇలా తగులబడింది. ప్రీ పోల్ సర్వేలను ప్రకటించకుండా అత్యున్నత న్యాయ స్థానం ప్రకటిస్తే మేలు కలుగుతుందన్నది పలువురి భావన.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి