దౌడు తీస్తున్న డెయిలీ హంట్ - భారీగా ఇన్వెస్ట్ చేసిన సాఫ్ట్ బ్యాంక్
దేశ వ్యాప్తంగా న్యూస్ విషయంలో ట్రెండింగ్ సృష్టిస్తూ రికార్డులు బ్రేక్ చేస్తున్న డెయిలీ హంట్ కు భారీ ఆఫర్ ను ప్రకటించింది సాఫ్ట్ బ్యాంక్ . కంటెంట్ విషయంలో , న్యూస్ విషయంలో డైలీ హంట్ దూసుకెళుతోంది. తాజా వార్తలను, విశేషాలను, ప్రత్యేక కథనాలను యాప్‌లో పొందు పరుస్తోంది. దీంతో తక్కువ టైంలోనే భారీగా స్పందన వచ్చింది. డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ఎప్పటికప్పుడు న్యూస్‌ను, వ్యూస్‌ను పొందుపరుస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. 150 మిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టింది సాఫ్ట్ బ్యాంక్ .
ఒకరకంగా చెప్పాలంటే ఇండియన్ న్యూస్ స్టార్టప్‌లలో ఇదో రికార్డు అని చెప్పాలి. ఇపుడు సాఫ్ట్ బ్యాంకు డెయిలీ హంట్ కంపెనీగా మారి పోయింది. జపాన్ లో సాఫ్ట్ బ్యాంకుకు ఎక్కడలేని జనాదరణ ఉంది. బ్యాంకింగ్ రంగంలో అత్యున్నతమైన స్థానంలో ఉన్న సాఫ్ట్ బ్యాంకు ప్రపంచ వ్యాప్తంగా స్టార్టప్ కంపెనీలలో పెట్టుబడులు పెడుతోంది. అందులో భాగంగానే డైలీ హంట్ ను టేకోవర్ చేసింది. రీజినల్ లాంగ్వేజెస్ ప్రధానంగా ఈ న్యూస్ పనిచేస్తోంది. ఇందులో కంటెంట్ మిగతా వాటికంటే భిన్నంగా అప్ లోడ్ చేయడం కూడా కలిసొచ్చింది. డిజిటల్ ఫార్మేషన్ ఆధారంగా న్యూ టెక్నాలజీని ఉపయోగిస్తూ పెద్ద ఎత్తున స్టార్టప్స్ పనిచేస్తున్నాయి.
ఇక న్యూస్ విషయానికి వస్తే..న్యూస్, ట్రెండ్స్, బ్రేకింగ్స్, అప్ డేట్స్, అనాలిసిస్ , రివ్యూస్, వ్యూస్, స్పెషల్ స్టోరీస్, బిజినెస్, స్పోర్ట్స్, ఉమెన్ ఛాయిస్, కిడ్స్ కార్నర్, స్టార్టప్స్, సెలబ్రెటీస్, సక్సెస్ స్టోరీస్, పొలిటిక్స్, గేమ్స్, ఎకానమీ, మూవీస్, గాడ్జెట్స్, ..ప్రతి ఫార్మాట్ గురించి డైలీ హంట్ ..డేటాను నిక్షిప్తం చేస్తోంది.
సాఫ్ట్ బ్యాంక్ మరో లాజిస్టిక్ కంపెనీ డిల్లీవెరీ కంపెనీలో 413 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. మరొ 60 మిలియన్లను పెట్టుబడి పెట్టింది. ముఖ్యంగా ప్రత్యేకించి ఇండియాలోని కంటెంట్ ఆధారంగా పనిచేసే స్టార్టప్స్ పై ఎక్కువగా ఈ జపాన్ కంపెనీ దృష్టి పెట్టింది. టిక్ టాక్, హెలో కంపెనీలకు పెట్టుబడులు వెల్లువలా వచ్చి పడుతున్నాయి.
న్యూస్ యాప్స్ పరంగా న్యూస్ డాగ్ మోస్ట్ పాపులర్ స్టార్టప్‌గా పేరొందింది. ఇది చైనాకు చెందిన కంపెనీ. గత ఏడాది నుండి న్యూస్ కంటెంట్ బేస్డ్ అంకురాలకు ఎక్కువ డిమాండ్ ఉంటోంది. మొదట న్యూస్ హంట్ గా ప్రారంభించి..తర్వాత డైలీ హంట్‌గా మారింది. నోకియా కంపెనీ మాజీ ఉద్యోగులైన ఉమేష్ కుల్‌కర్ణి, చంద్రశేఖర్ సొహోనీ లు కలిసి 2009లో ప్రారంభించారు. 2012లో డైలీ హంట్ ను వీరేంద్ర గుప్త డైలీ హంట్ ను టేకోవర్ చేసుకున్నారు. అతనే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పని చేస్తున్నారు. అన్ని పేపర్లు, న్యూస్ ఛానల్స్ చూడాలంటే ఓపికుండాలి. అన్నీ కలిసి ఒకే చోట చూస్తే ఎలా ఉంటుందోనన్న ఆలోచనల్ంచి వచ్చిందే డైలీ హంట్.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి