ఆత్మరక్షణలో పాకిస్తాన్..సై అంటున్న భారత్

నిన్నటి దాకా అంతర్జాతీయ వేదికలపై బీరాలు పలికిన పాకిస్తాన్ ఇప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ లో పడి పోయిందా. అవుననే అనిపిస్తోంది ప్రస్తుత నెలకొన్న పరిస్థితులను చూస్తే. ఓ వైపు ఇండియాపై లేనిపోని ఆరోపణలు చేస్తూ మరో వైపు భారత దేశంలోకి ఉగ్రమూకలను పంపిస్తున్న పాకిస్తాన్ కు కోలుకోలేని షాక్ ఇచ్చాయి ఇతర దేశాలు. దెబ్బకు ఇప్పుడు పూర్తిగా ఒంటరిగా మారింది పాక్. దౌత్య పరంగా ఇండియా పూర్తిగా సక్సెస్ కావడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏకంగా పీవోకే పై కన్నేశారు. దాడి చేసేందుకు సిద్దమవుతున్నట్లు కనిపిస్తోంది. ఇంకో వైపు భారత ప్రభుత్వ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అరబ్ దేశాధినేతలతో సంప్రదింపులు చేస్తున్నారు. ఆ మేరకు అటు వైపు నుంచి పూర్తి మద్దతు లభించేలా చేశారు. దోవల్ దెబ్బకు ఇంటర్నేషనల్ మాఫియా డాన్ దావుద్ ఇబ్రహీం పాకిస్తాన్ నుండి ఇతర చోటుకు మారిపోయాడన్న వార్తలు గుప్పుమన్నాయి. ఆయన ఉన్నంత వరకు ఇండియాను ఒక్క అంగుళం కూడా స్వాధీనం చేసుకోలేమని పాకిస్థాన్ ఆర్మీ భావిస్తోంది. ఒక్కసారి కమిట్ అయినా లేదా ధోవల్ రంగంలోకి దిగారంటే ఇక వార్ వన్ సైడ్ అవ్వాల్సిందే. ప్రతి సారి ప్రమాదకరంగా, చెవిలో జోరీగ లాగా పాకిస్తాన్ ప్రవర్తిస్తుండటం...