బజాజ్ ఫైనాన్స్ అదుర్స్
ఓ వైపు భారత ఆర్ధిక పరిస్థితి మందగమనంలో కొనసాగుతుంటే మరో వైపు బజాజ్ ఫైనాన్స్ లాభాల బాటలో పయనిస్తోంది. ఏకంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్లేస్ ను వెనక్కి నెట్టేసింది. దాదాపు 2.32 లక్షల కోట్లకు మార్కెట్ విలువ పెరగడం విస్తు పోయేలా చేసింది. 10 ఏళ్ల కిందట 1 లక్ష పెట్టుబడి ఇప్పుడు 3.64 కోట్లైంది. ఇది ఇండియన్ మార్కెట్ లో ఓ రికార్డ్ కూడా. ఈ అయిదేళ్లో 13.61 రెట్లు బజాజ్ ఫైనాన్స్ షేరు పెరిగింది. నాన్ బ్యాంకింగ్ పైనాన్స్ రంగంలోని బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ మార్కెట్ విలువ పరంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని దాటేసింది. దీంతో దేశంలోని బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ లో అయిదో పెద్ద కంపెనీగా అవతరించింది. మార్కెట్ ట్రేడింగ్‌లో బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ విలువ 2.32 లక్షల కోట్లను అందుకుంది.
ఇదే సమయంలో ఎస్‌బీఐ మార్కెట్ విలువ 2.28 కోట్లుగా వుంటే తాజాగా ప్రకటించిన ట్రేడింగ్ లో ఎస్‌బీఐ షేర్లు 5.5 శాతం పతనమయ్యాయి. ఇండియాలోని అనేక ఎన్‌బీఎఫ్‌సీలు సంక్షోభం ఎదుర్కొంటుంటే మరోవైపు బజాజ్ ఫైనాన్స్ షేర్లు మాత్రం గత అయిదేళ్లలో 13.41 రెట్లు పెరిగి టాప్ పెర్‌ఫార్మర్‌గా నిలిచింది. ఇదే అయిదేళ్లకు చూస్తే ఎస్‌బీఐ షేర్లు కేవలం 5.62 శాతం లాభపడ్డాయి. బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్‌పై ఇన్వెస్టర్ల ఆసక్తి ఇంకా కొనసాగుతోందని ఎనలిస్టులు చెబుతున్నారు. ఎసెట్ క్వాలిటీ, లాభదాయకతలో బజాజ్ ఫైనాన్స్ మెరుగైన పనితీరే దానికి కారణమని పేర్కొంటున్నారు. బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ షేర్లు గత పదేళ్లలో ఏకంగా 36257 శాతం పెరిగాయి. మరో విధంగా చెప్పాలంటే అక్టోబర్ 1, 2009 లో ఎవరైనా లక్ష రూపాయలను బజాజ్ ఫైనాన్స్ షేర్లలో ఇన్వెస్ట్ చేసి ఉంటే, ఆ షేర్ల విలువ ఇప్పుడు 3.64 కోట్లకు చేరింది.
గత దశాబ్ద కాలంగా ఆగకుండా పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ షేర్లలో పెట్టుబడి పెట్టాలనుకునే వారు కొంత జాగ్రత్తగా వ్యవహరించడం మేలని, వ్యాల్యుయేషన్ పరంగా కొంత ఎక్కువ స్థాయిలోనే ఆ షేర్ ఉందని ఎనలిస్టులు సూచిస్తున్నారు. వ్యాల్యుయేషన్ పరంగా వీక్‌గా కనిపిస్తున్నా ఎస్‌బీఐ షేరు విషయంలోనూ కొంచెం జాగ్రత్త అవసరమేనని భావిస్తున్నారు. కిందటి వారంలో మోర్గాన్ స్టాన్లీ ఈ షేర్ రేటింగ్‌ను తగ్గించింది. ఎసెట్ క్వాలిటీ, నెట్ ఇంటరెస్ట్ మార్జిన్ల ప్రకారం చూస్తే ఎస్‌బీఐ షేర్ పెద్దగా వృద్ధి చెందక పోవచ్చనేది మార్గాన్ స్టాన్లీ అభిప్రాయం. దేశంలోని రుణ సంక్షోభం కారణంగా ఈ బ్యాంకు వద్ద అప్పులు తీసుకున్న వారిలో కొంత మంది బలహీనమైన వారూ ఉండొచ్చని మార్గాన్ స్టాన్లీ చెబుతోంది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి