ఆత్మరక్షణలో పాకిస్తాన్..సై అంటున్న భారత్

నిన్నటి దాకా అంతర్జాతీయ వేదికలపై బీరాలు పలికిన పాకిస్తాన్ ఇప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ లో పడి పోయిందా. అవుననే అనిపిస్తోంది ప్రస్తుత నెలకొన్న పరిస్థితులను చూస్తే. ఓ వైపు ఇండియాపై లేనిపోని ఆరోపణలు చేస్తూ మరో వైపు భారత దేశంలోకి ఉగ్రమూకలను పంపిస్తున్న పాకిస్తాన్ కు కోలుకోలేని షాక్ ఇచ్చాయి ఇతర దేశాలు. దెబ్బకు ఇప్పుడు పూర్తిగా ఒంటరిగా మారింది పాక్. దౌత్య పరంగా ఇండియా పూర్తిగా సక్సెస్ కావడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏకంగా పీవోకే పై కన్నేశారు. దాడి చేసేందుకు సిద్దమవుతున్నట్లు కనిపిస్తోంది. ఇంకో వైపు భారత ప్రభుత్వ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అరబ్ దేశాధినేతలతో సంప్రదింపులు చేస్తున్నారు. ఆ మేరకు అటు వైపు నుంచి పూర్తి మద్దతు లభించేలా చేశారు. దోవల్ దెబ్బకు ఇంటర్నేషనల్ మాఫియా డాన్ దావుద్ ఇబ్రహీం పాకిస్తాన్ నుండి ఇతర చోటుకు మారిపోయాడన్న వార్తలు గుప్పుమన్నాయి.

ఆయన ఉన్నంత వరకు ఇండియాను ఒక్క అంగుళం కూడా స్వాధీనం చేసుకోలేమని పాకిస్థాన్ ఆర్మీ భావిస్తోంది. ఒక్కసారి కమిట్ అయినా లేదా ధోవల్ రంగంలోకి దిగారంటే ఇక వార్ వన్ సైడ్ అవ్వాల్సిందే. ప్రతి సారి ప్రమాదకరంగా, చెవిలో జోరీగ లాగా పాకిస్తాన్ ప్రవర్తిస్తుండటంతో ఇండియా దానికి తగిన రీతిలో బుద్ది చెప్పాలని డిసైడ్ అయ్యింది. అందుకే మెలమెల్లగా గ్రౌండ్ ప్రిపేర్ చేస్తోంది. పాక్‌ ఆక్రమిత కశ్మీరును స్వాధీనం చేసుకోవడం కోసం కసరత్తు చేస్తున్నట్టు అనిపిస్తోంది. జమ్మూ, కాశ్మీర్ లో 370 ఆర్టికల్ రద్దు తర్వాత ఇతర దేశాల నుండి పెద్ద ఎత్తున ఇండియాకు మద్దతు లభించింది. అమెరికా, రష్యా దేశాలు కూడా సపోర్ట్ గా నిలిచాయి. కేంద్ర మంత్రులు, బీజేపీ నేతల ప్రకటనలు, సైనికాధికారుల వ్యాఖ్యలు, కొంతకాలంగా సైన్యంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, అన్నీ చూస్తుంటే భారత్‌ ఆ దిశగా అతివేగంగా అడుగులు వేస్తున్నట్టు అగుపిస్తోంది. 

ప్రస్తుతం పాకిస్థాన్‌ ఆర్థికంగా చితికి పోయి ఉన్నది. అక్కడి ప్రభుత్వం బలహీనంగా ఉండడంతో అదే అదనుగా మోదీ సర్కారు కశ్మీరు విషయంలో చకచకా కీలకమైన అడుగులు వేస్తోంది. 2016లో యూరి దాడికి ప్రతీకారంగా భారత సైన్యం పీవోకేలోని ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్‌ దాడి చేసింది. దానికి పాక్‌ నుంచి ప్రతిస్పందన ఏదీ రాక పోవడంతో భారత్‌ మరింత ధైర్యం పుంజుకుంది. గత ఏడాది పుల్వామా దాడికి ప్రతీకారంగా ఇండియా వాయుసేన పీవోకేతోపాటు పాక్‌ ప్రధాన భూభాగంలోని బాలాకోట్‌పై కూడా దాడి చేసింది. అంతర్జాతీయంగా కూడా పాక్‌కు మద్దతు దొరకక పోవడంతో భారత్‌ మరింత ముందుకు వెళుతోంది. పీవోకేను భారత్‌ త్వరలో స్వాధీనం చేసుకోబోతోందని, ఇందుకు అమెరికా సహకారం అందిస్తుందని బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి గత ఆగస్టు 31న వెల్లడించారు కూడా. 

ఇజ్రాయెల్‌ నుంచి ట్యాంకు విధ్వంసక క్షిపణుల్ని, స్పైక్‌ బాంబుల్ని అత్యవసరంగా కొనుగోలు చేసింది. వివిధ ఆయుధాలకు అవసరమైన మందుగుండు సామగ్రిని దిగుమతి చేసుకుంటోంది. పాక్‌ సరిహద్దులో సుఖోయ్‌ విమానాలను మోహరించడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తోంది. కశ్మీర్‌పై జోక్యం చేసుకోవాలంటూ పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ పదేపదే కోరినా ట్రంప్‌ అంతగా స్పందించలేదు. గల్ఫ్‌ దేశాల నుంచి సైతం పాక్‌కు మద్దతు దక్కలేదు. మొత్తం మీద పాకిస్తాన్ ను ఒంటరిని చేసి అదును చూసి దెబ్బ కొట్టాలన్నది మోడీ ప్లాన్. మంచి దూకుడు మీదున్న ఇండియా ను ఢీకొనాలంటే పాకిస్తాన్ చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పాకిస్తాన్ మౌనంగా ఉండటమే. లేకపోతే ఇండియా చేతిలో భంగపాటు గురికాక తప్పదు. ఇండియా ప్లాన్ వర్కవుట్ అవుతుందా లేక ఇమ్రాన్ సక్సెస్ అవుతాడా అన్నది కాలమే సమాధానం చెప్పాలి. 

కామెంట్‌లు