ఐదేళ్లల్లో రెండున్నర లక్షల కొలువులు - గూగుల్ టార్గెట్
ప్రపంచంలోనే అత్యంత ఆదాయంతో పాటు గణనీయమైన, నమ్మకమైన కంపెనీగా పేరున్న గూగుల్ సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లో సెర్చింగ్ దిగ్గజ కంపెనీగా ఇప్పటికే టాప్ పొజిషన్ లో ఉంది. ఎప్పటికప్పుడు మారుతున్న మార్పులను స్వాగతిస్తూనే ఇంకో వైపు వేలాది మందికి ప్రపంచ వ్యాప్తంగా కొలువులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు ట్రైనింగ్ తో పాటు ఉద్యోగం ఇవ్వాలని కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. ఈ విషయాన్ని గూగుల్ కంపెనీ సీఇఓ సుందర్ పిచ్చాయ్ వెల్లడించారు. అన్ని ఐటీ కంపెనీలకంటే ఎక్కువ డిమాండ్ గూగుల్ కంపెనీకి ఉంటోంది. ఎందుకంటే ఈ సంస్థలో జాబ్ చేయడం అంటే ఉద్యోగులు, నిరుద్యోగులు ఓ స్టేటస్ సింబల్ గా భావిస్తారు. అక్కడ ఉన్నన్ని సౌకర్యాలు ఇంకే కంపెనీలో ఉండవు. ఐటీ సెక్టార్ లో పని చేసే ప్రతి ఒక్కరి కల ఏమిటంటే చని పోయే లోపు ఒక్కసారైనా గూగుల్ లో పని చేయాలని.
ఉద్యోగ భద్రత, ఊహించని రీతిలో సౌకర్యాలు, అదనపు బహుమతులు, కావాల్సినంత భోజనం, ఇష్టమైన వేళల్లో పని చేసే వెసలుబాటు, కుటుంబాలతో కలిసి పోయేలా ఇంటి వాతావరణం ఉంటుంది. అందుకే మొదటి ప్రయారిటీ అంతా ఈ కంపెనీ కి ఇస్తారు ఉద్యోగులు. ఎథికల్ హ్యాకింగ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ , రోబోటిక్స్ , బిజినెస్ అనలిటిక్స్, డిజిటల్ టెక్నాలజీతో పాటు ఇతర ఉద్యోగాలకు కావాల్సిన నైపుణ్యాలను గూగుల్ స్వయంగా నేర్పుతుంది. కంపెనీ ఇందు కోసం రీసెర్చ్ అండ్ వింగ్ విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో ఎప్పటికప్పుడు కొత్త ఆవిష్కరణలు చోటు చేసుకుంటాయి. ప్రపంచంలో ఎక్కడ ఏ కొత్తది చోటు చేసుకున్నా దానిని గూగుల్ స్వీకరిస్తుంది. వెన్ను తట్టి ప్రోత్సహిస్తుంది. రాబోయే ఐదు సంవత్సరాలలో 250000 కొలువులు భర్తీ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నామని పిచ్చాయ్ వెల్లడించారు.
ప్రస్తుతానికి అమెరికాలోని యూత్ కోసం వీటిని భర్తే చేయనున్నారు. తర్వాత దశల వారీగా వివిధ విభాగాలలో అవసరమైన వారిని రిక్రూట్ చేయనుంది. డల్లాస్ లోని ఎల్ సెరంట్రో కమ్యూనిటీ కాలేజీలో, అమెరికా అధ్యక్షుడి కుమార్తె ఇవాంక ట్రంప్‌తో కలిసి ఆయన ఒక సమావేశంలో పాల్గొన్నారు. అమెరికాకు ప్రాధానత్యనిచ్చే సంస్థల్లో గూగుల్ కచ్చితంగా ఉంటుందని తెలిపారు. అమెరికన్ పౌరులకు కార్పొరేట్ సంస్థలు ఉద్యోగ నైపుణ్య శిక్షణనిచ్చే పథకాన్ని 2018 జూలైలో ట్రంప్ ప్రారంభించారు. ఇప్పటికే గూగుల్ గ్రో విత్ గూగుల్ పేరిట జాతీయ నైపుణ్య శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తూ.. వివిధ ఆన్‌లైన్ స్కిల్స్ లను ఉచితంగా నేర్పిస్తోంది. మొత్తం మీద గూగుల్ డెసిషన్ తో ఇతర కంపెనీలపై అదనపు వత్తిడి పెరిగే ప్రమాదం ఉంది. గూగుల్ తీసుకున్న ఈ నిర్ణయం ఆశావహులలో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి