పోస్ట్‌లు

ఆగస్టు 6, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

తోబుట్టువును కోల్పోయిన తెలంగాణ

చిత్రం
నిండైన రూపం ..భారతీయత కలిగిన సుష్మా స్వరాజ్ ఇక లేరు. పెదవులపై చెరగని ఆ చిరునవ్వు ను ఇక చూడలేం. ఆమెకు తెలంగాణ ప్రాంతం అన్నా, ఇక్కడి ప్రజలన్నా యెనలేని అభిమానం .. ప్రేమ కూడా . ఇక్కడి నుండి ఢిల్లీకి ఎవరు వెళ్లినా ఆప్యాయంగా పలకరించారు. అక్కున చేర్చుకున్నారు. తెలంగాణ ఉద్యమానికి ఆమె ఏ నాయకురాలు చేయలేని విధంగా మద్దతు పలికారు. ఇవ్వాళ దేశానికే కాదు తెలంగాణ సైతం పెద్ద దిక్కును కోల్పోయింది. తెలంగాణ ఏ రకంగా మోసపోయిందో , ఎంతటి దోపిడీకి గురైందో , ఎందుకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వాలో పార్లమెంట్ సాక్షిగా అద్భుతంగా ప్రసంగించారు . లెక్కలతో సహా విడమర్చి చెప్పారు. ఎన్నో సార్లు ఆమె తెలంగాణ ఉద్యమాన్ని చూసి చలించి పోయారు . పిల్లలు , ప్రజలు చేస్తున్న పోరాటానికి బేషరతుగా మద్దతు పలికారు . బీజేపీకి తీరని లోటు . ఇటీవల అనారోగ్యం కారణంగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు . అంతా చిన్నమ్మ అంటూ పిలుచుకునే సుష్మా స్వరాజ్ ఇక లేరన్న వార్తను జీర్ణించు కోలేక పోతున్నారు వేలాది మంది. ఆమెను దగ్గరగా చూసిన వాళ్ళు కన్నీటి పర్యంత మవుతున్నారు . ఢిల్లీ ముఖ్యమంత్రిగా , మాజీ కేంద్ర మంత్రిగా , బీజేపీ సీనియర్ నేతగా ఎన్నో సేవలు అందించారు . ...

తెలంగాణా దార్శనికుడికి సలాం..!

చిత్రం
మహోన్నత మానవుడు ..తెలంగాణ ప్రాంతపు దార్శనికుడు ..కొత్తపల్లి జయశంకర్ సారును స్మరించుకునే వేళ ఇది. ఆయన అడుగులు వేయక పోతే నేడు ఏర్పడిన తెలంగాణ వచ్చి ఉండేది కాదు . అది జగమెరిగిన సత్యం ..వాస్తవం కూడా. 6 ఆగస్తు 1934 లో వరంగల్ జిల్లా అక్కంపేట ఊరిలో పుట్టారు . 2011 లో ఈ లోకం నుండి నిష్క్రమించారు. ఆయన అందించిన స్ఫూర్తి కోట్లాది మందిని ప్రభావితం చేస్తోంది. తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో మంచి ప్రావీణ్యం ఉన్న జయశంకర్ సారు తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసి ఆజన్మ బ్రహ్మచారిగా జీవించారు. ఆర్థిక శాస్త్రంలో పీహెచ్‌డి పట్టా పొంది, ప్రిన్సిపాల్‌గా, రిజిష్ట్రార్‌గా పనిచేసి కాకతీయ విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ వరకు ఉన్నత పదవులు పొందారు. 1969 తెలంగాణ ఉద్యమంలోనూ, అంతకు ముందు నాన్ ముల్కీ ఉద్యమంలో, సాంబార్- ఇడ్లీ గోబ్యాక్ ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటులో కె.చంద్రశేఖరరావుకు సలహాదారుగా, మార్గదర్శిగా వెన్నంటి నిలిచారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం పలు పుస్తకాలు రచించారు. కళ్ళారా చూడాలని తరుచుగా చెప్పే జయశంకర్ రాష్ట్ర ఏర్పాటుకు ముందే మరణించారు. ...

మధురాతి మధురం గోవింద వసంతం..!

చిత్రం
అతడు గాయకుడు. అంతకంటే ఎక్కువగా సంగీత దర్శకుడు. ఇటీవల దేశాన్ని ఊపేస్తున్న పాటల్లో అతడి చేతిలో రూపొందిన పాటే టాప్ రేంజ్ లో నిలిచింది . ఆ గొంతులో ఏ మాధుర్యం దాగి ఉందో అర్థం చేసుకోవాలంటే అతడు సంగీతం అందించిన త్రిష నటించిన 96 మూవీ సాంగ్ వినాల్సిందే. ఒక్కసారి విన్నామా ఇక అతడితోనే ఉంది పోతాం. అలా మనల్ని సప్త సముద్రాలను దాటించేస్తాడు. అతడిలో ఏదో మ్యాజిక్ దాగి ఉంది. దానిని కాదనలేం . అతడి వాయిస్ లో అమృతం దాగి ఉంది ..కనుకనే కోట్లాది మంది అతడు ఇచ్చిన సాంగ్ ను వింటూ గడిపేస్తున్నారు. ఇప్పుడు యూట్యూబ్ లో గోవింద్ వసంత అని పేరు వెతికితే చాలు ..ఎందరో అతడికి ఫ్యాన్స్ అయిపోయారు .  అతడు అందించిన ఈ సినిమా కేవలం సంగీతం వల్లనే బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టింది . ఎన్నో అవార్డులు తెచ్చి పెట్టింది . ఇప్పటిదాకా ఊరిస్తూ వచ్చిన ఆ పాటే .. కాదలే కాదలే అన్న ఈ సాంగ్ ఇప్పుడు ప్రపంచమంతటా వైరల్ గా మారింది . ఈ సినిమాలో నటి త్రిష అద్భుతంగా నటించింది . మనసును చుట్టేసింది . ఇంతలా ..డీప్ గా కనెక్ట్ అయినా మూవీ సాంగ్ ఇంకేదీ లేదనే చెప్పాలి . లక్షలాది అభిమానులు ఈ పాటను వినకుండా ఉండలేక పోతున్నారు . అందుకేనేమో ఈ సాంగ్ ను ఎప్పుడూ ...

మిషన్ భగీరథ విజయం.. ఫలితాలు అద్భుతం - సీఎం కేసీఆర్

చిత్రం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ కార్యక్రమం అద్భుత ఫలితాలను ఇస్తోందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చెప్పారు . ఎల్లంపల్లి , కాళేశ్వరం ప్రాజెక్ట్ కు భారీగా చేరుకున్న నీటిని సీఎం ఏరియల్ సర్వ్యే ద్వారా పర్యవేక్షించారు. ఈ సందర్బంగా ధర్మపురిలో ని లక్ష్మి నరసింహ్మ స్వామి ని సీఎం దర్శించుకున్నారు . పూజలు చేశారు . ఏ చిన్న రైతు చని పోయినా  అయిదు లక్షలు సాయంగా అందజేస్తున్నామని  వెల్లడించారు. అతి త్వరలోనే రాష్ట్రం కన్న కలలు నిజం కాబోతున్నాయని కేసీఆర్ చెప్పారు. నిన్నటి దాకా నీళ్లు ఉండేవి కావు .. ఇప్పుడు భారీగా వరద నీరు వచ్చి చేరిందన్నారు .  కొందరు సన్నాసులు అవగాహన లేక అవాకులు చెవాకులు పేలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు నదుల పరంగా చూస్తే గోదావరి ఒక్కటే ప్రాణాధారమని సీఎం వెల్లడించారు. 400 టీఎంసీల నీళ్లు వాడుకునే వీలు కలుగుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం కూలీలు అహోరాత్రులు కస్టపడి పని చేశారని , అంతే కాకుండా ఇంజనీర్లు కూడా తక్కువ సమయంలో , మూడేళ్ళ కాలంలో , కేంద్రం నిధులు ఇవ్వక పోయినా ..రాష్ట్రం స్వంత ఖర్చుతో నిర్మాణం చేపట...

వెండిని ధరించలేం..బంగారం కొనలేం..!

చిత్రం
నీ ఇల్లు బంగారం కానూ అంటూ అప్పుడెప్పుడో చేయి తిరిగిన పాటల రచయిత ఆవేశపడి రాసిన సినీ గీతం ఇప్ప్పుడు పాడు కోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఉమ్మడి రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా విడి పోయాక ..ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో అప్పులు ఎక్కువై పోతున్నవని ఆందోళన చెందితే , దానికి భిన్నంగా ఏకంగా రాజధాని నగరమైన భాగ్యనగరంలో కిలోల కొద్దీ ..టన్నుల కొద్దీ కొంటున్నారు. ఇది మార్కెట్ వర్గాలనే కాదు ..ఐటి అధికారులను నివ్వెర పోయేలా చేస్తోంది. ఓ వైపు పసిడి ధరలు పైపైకి వెళుతున్నా మహిళలు మాత్రం కొనడం మాత్రం మాను కోవడం లేదు. ఇది మరింత విస్మయానికి గురి చేస్తోంది. బంగారం ధర ఇట్లుంటే వెండి తగదునమ్మా అంటూ దాని ధర కూడా రాకెట్ కంటే వేగంగా దూసుకు వెళుతోంది . భారతీయ మార్కెట్ లో బంగారం మెరుస్తోంది . చైనా ..అమెరికా దేశాల మధ్య వ్యాపార పరంగా యుద్ధం మొదలు కావడంతో పసిడి ధర ఆగనంటోంది . బులియన్ మార్కెట్ లో ఊహించని రీతిలో ధర అమాంత పెరుగుతూ ఉన్నా కొనుగోలు దారులు మాత్రం ఈ మాత్రం వెనక్కు తగ్గడం లేదు . లెక్కకు మించి కొనుగోలు చేస్తున్నారు . ఒకప్పుడు 20 వేల లోపు ఉన్న ధర ఇప్పుడు 36 వేలకు పైగా పెరుగుతూ పోతోంది . రెండు దేశాల మధ్య వార్ దీని ధరల...

పంచాయితీలలో పడకేసిన పాలన..?

చిత్రం
ఎన్నికలు ముగిసి పదవుల్లో కొలువు తీరినా తెలంగాణలోని గ్రామ పంచాయితీలలో పాలన పడకేసింది. గ్రామాల అభివృద్హి గూర్చి పట్టించు కోవాల్సిన కొత్తగా ఎన్నికైన సర్పంచులు రోడ్డెక్కారు . ఇక నూతనంగా కొలువుల్లోకి వచ్చి చేరిన విలేజ్ సెక్రెటరీలు ఈ పాలన వద్దంటూ లోలోపట బాధ పడుతున్నారు. ప్రతి ఒక్కరు తమనే టార్గెట్ చేస్తుండడంతో చాలా మంది ఈ జాబ్ కంటే వేరే జాబ్ చూసు కోవడం వేటర్ అనే స్థాయికి చేరుకున్నారు. ఇక భాద్యతగా ఉండాల్సిన గ్రామాల ప్రధమ పౌరులు రాస్తారోకోలు , ఆందోళనలు , ధర్నాల బాట పట్టారు . తమకు మాత్రమే చెక్ పవర్ ఉండాలని , ఉప సర్పంచ్ కు ఉండొద్దంటూ  డిమాండ్ చేస్తున్నారు . ఈ విషయం పై సర్పంచుల సంఘం ఈ మేరకు విన్నవించింది.  కొత్తగా ఎన్నికైన వీరంతా భారీ ఎత్తున గ్రామాలలో జరిగిన ఎన్నికల్లో ఖర్చు పెట్టారు . చేసిన ఖర్చులు గిట్టుబాటు కావడం లేదంటూ వాపోతున్నారు. దీంతో సందిట్లో సడేమియా అన్న చందంగా గ్రామ పంచాయితీలలో పాలన పడకేసింది . సిబ్బంది ఇస్తా రాజ్యంగా వ్యవహరిస్తుడడంతో సమస్యలు తీరడం లేదు . అయితే గ్రామాలకు నిధులు విడుదల చేయక పోతే అభివృద్ధి ఎలా జరుగుతుందని వారంటున్నారు . దీంతో సీరియస్ గా తీసుకున్న సర్కార్ సర్పం...

వాగులు ..వంకలు ..నీళ్లు ..కన్నీళ్లు ..ఆగని వానలు..!

చిత్రం
నిన్నటి దాకా నీళ్ల కోసం వేచి చూసిన జననానికి ఇప్పుడు ఎడతెగని వర్షాలతో లబోదిబోమంటున్నారు. ఆసరా కోసం ఎదురు చూస్తున్నారు . జలాశయాలు నీళ్లతో నిండి పోయాయి. విస్తారంగా కురుస్తున్న వానల దెబ్బకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. భారీగా కురుస్తున్న వర్షాలకు దీంతో గోదావరి , తదితర నదులన్నీ నీళ్లతో నిండి పోతున్నాయి . నెర్రెలు బారిన ప్రాజెక్టులన్నీ జలకళ ను సంతరించుకున్నాయి . ఇంకో వైపు ఎల్లంపల్లి తో పాటు కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బ్యారేజీ గేట్లను ఎత్తి వేశారు . నీరంతా ఆంధ్రప్రదేశ్ వైపు మళ్లుతోంది . వరద ఉదృతి పెరగడంతో నీటిని దిగువకు వదులుతున్నారు .  కర్ణాటకలో భారీగా వర్షాలు కురుస్తుండడంతో  ఆల్మట్టి , నారాయణపూర్ ప్రాజెక్ట్లులు పూర్తి గా నిండు కుంటున్నాయి . దీంతో దిగువకు వదలడంతో జూరాల ప్రాజెక్ట్ పూర్తిగా నీటితో కళకళలాడుతోంది. మేడిగడ్డ బ్యారేజికి వరద నీరు వచ్చి చేరుతోంది . ఇక కడెం ప్రాజెక్ట్ నుంచి వచ్చిన వరద నీటితో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ పూర్తి నిండి పోయింది . నీటి నిల్వ పూర్తి స్థాయికి చేరుకుంది . పది గేట్లను కిందకు వదిలారు అధికారులు . మరో బ్యారేజ్ సుందిళ్ల కూడా నిది పోయింది . దానికి కూడా...

తగ్గిన రాష్ట్రం ..ఇక నుంచి 28 రాష్ట్రాలు .. 9 కేంద్రపాలిత ప్రాంతాలు

చిత్రం
జమ్మూ కాశ్మీర్ విభజన బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలపడంతో దేశంలో ఒక రాష్ట్రం తగ్గినట్టయింది. ఇక నుంచి ఇండియాలో 28 రాష్ట్రాలు ..9 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉండనున్నాయి . 370 ఆర్టికల్ రద్దు వెనుక పెద్ద తతంగమే నడిచింది . ఊహించని రీతిలో బీజేపీ సర్కార్ కు ఈ విషయంలో ఆప్ పార్టీ మద్దతు పలకడం ఒకింత విస్తు పోయేలా చేసింది . నిత్యం కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న జమ్మూ కాశ్మీర్ సమస్యకు ఏదో ఒక రోజు చెక్ పెట్టే రోజు తప్పక వస్తుందని మోదీ చెప్పిన విధంగానే ..చేతల్లో చేసి చూపించారు . తాను తల్చుకుంటే చేయడం మాత్రమే ఉంటుందని స్పష్టం చేసారు విపక్షాలకు . ఇన్నాళ్లుగా రాష్ట్రంగా ఉన్న జమ్మూ కాశ్మీర్ నును రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది . దీంతో స్వయం ప్రతిపత్తి హోదా పోయి ..దేశంలోని మిగతా ప్రాంతాల లాగానే జమ్మూ కాశ్మీర్ లోనూ భారత రాజ్యాంగం అమలవుతుంది. అత్యంత నాటకీయ పరిణామాల మధ్యన రాష్ట్రపతి 370 ఆర్టికల్ ను రద్దు చేస్తూ గెజిట్ విడుదలైంది . దీంతో విపక్షాలు విస్తు పోయాయి . ఆపరేషన్ ఇంత త్వరగా పూర్తి చేస్తారని కలలో కూడా ఊహించి ఉండరు నేతలు . వారికి ఆ ఛాన్స్ కూడా ఇవ్వలేదు మోడీ అండ్ షా . దీనిపై తీవ్ర అభ్యంతరం తెలి...

బీజేపీ సర్కార్ జోరు .. విపక్షాలు బేజారు .. పాక్ కు మోదీ చెక్..!

చిత్రం
కొన్నేళ్లుగా కొనసాగుతూ వస్తున్న సమస్యకు కేంద్రంలోని కమల సర్కార్ చెక్ పెట్టింది. పక్కా ప్లాన్ తో అటు పక్కలో బల్లెంలా తయారైన దాయాది దేశం పాకిస్థాన్ ను కోలుకోలేకుండా చేసింది. ఎందరో దీని గురించి కొన్నేళ్లుగా ప్రస్తావిస్తూ వచ్చారు. కానీ ఏ ఒక్కరు నిప్పుల కుంపటి లాగా మారిన కాశ్మీర్ గురించి పట్టించు కోలేదు . అన్ని రాజకీయాలు దీని చుట్టూ తిరిగాయి . అటు కాంగ్రెస్ ఇటు జనతా , తదితర పార్టీలు చూసీ చూడనట్టు వ్యవహరించాయి. ఎందరో పాక్ కవ్వింపు చర్యలకు , కాల్పులకు బలై పోయారు. ఇది బాధాకరం . ఇరు దేశాల మధ్యన నెలకొన్న ఉద్రిక్త పరిస్థుతుల దృష్ట్యా సామాన్యులు , సైనికులు , ఇతరులు ప్రాణాలు కోల్పోయారు . కాశ్మీర్ మండుతున్న కొలిమి . దీనిని బూచిగా చూపిస్తూ పాక్ కొన్నేళ్లుగా రాజకీయం చేసింది . అక్కడంతా తీవ్రవాదులదే రాజ్యం . వారు చెప్పిందే ..చేసిందే చట్టం . దీనిపై దేశ వ్యాప్తంగా , అంతర్జాతీయంగా చర్చోప చర్చలు జరిగాయి . అయినా ఈ తీవ్రమైన సమస్య ఇంకా అలాగే ఉండి పోయింది .  గత కొంత కాలంగా నివురు గప్పిన నిప్పులా తయారైన కాశ్మీర్ కు ఏదో ఒకటి చేయల్లన నిర్ణయానికి బీజేపీ వచ్చింది . అనుకున్నదే తడువుగా వాస్తవాధీన రేఖ వెంట ఉన్న ...