బీజేపీ సర్కార్ జోరు .. విపక్షాలు బేజారు .. పాక్ కు మోదీ చెక్..!
కొన్నేళ్లుగా కొనసాగుతూ వస్తున్న సమస్యకు కేంద్రంలోని కమల సర్కార్ చెక్ పెట్టింది. పక్కా ప్లాన్ తో అటు పక్కలో బల్లెంలా తయారైన దాయాది దేశం పాకిస్థాన్ ను కోలుకోలేకుండా చేసింది. ఎందరో దీని గురించి కొన్నేళ్లుగా ప్రస్తావిస్తూ వచ్చారు. కానీ ఏ ఒక్కరు నిప్పుల కుంపటి లాగా మారిన కాశ్మీర్ గురించి పట్టించు కోలేదు . అన్ని రాజకీయాలు దీని చుట్టూ తిరిగాయి . అటు కాంగ్రెస్ ఇటు జనతా , తదితర పార్టీలు చూసీ చూడనట్టు వ్యవహరించాయి. ఎందరో పాక్ కవ్వింపు చర్యలకు , కాల్పులకు బలై పోయారు. ఇది బాధాకరం . ఇరు దేశాల మధ్యన నెలకొన్న ఉద్రిక్త పరిస్థుతుల దృష్ట్యా సామాన్యులు , సైనికులు , ఇతరులు ప్రాణాలు కోల్పోయారు . కాశ్మీర్ మండుతున్న కొలిమి . దీనిని బూచిగా చూపిస్తూ పాక్ కొన్నేళ్లుగా రాజకీయం చేసింది . అక్కడంతా తీవ్రవాదులదే రాజ్యం . వారు చెప్పిందే ..చేసిందే చట్టం . దీనిపై దేశ వ్యాప్తంగా , అంతర్జాతీయంగా చర్చోప చర్చలు జరిగాయి . అయినా ఈ తీవ్రమైన సమస్య ఇంకా అలాగే ఉండి పోయింది .
గత కొంత కాలంగా నివురు గప్పిన నిప్పులా తయారైన కాశ్మీర్ కు ఏదో ఒకటి చేయల్లన నిర్ణయానికి బీజేపీ వచ్చింది . అనుకున్నదే తడువుగా వాస్తవాధీన రేఖ వెంట ఉన్న పాక్ పెంచి పోషిస్తున్న తీవ్రవాదులను మత్తు బెట్టింది సైన్యం . దీంతో ఉన్నపళంగా దేశ రాజధానిలో రాజకీయాలు మారి పోయాయి . ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది . దానిని అమలు చేసేందుకు పక్కా ప్లాన్ రచించింది . ఏకంగా దేశ వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించారు . దేశంలో ఏదో జరుగుతుందన్న చర్చ జోరుగా సాగేలా చేశారు . అంతా చర్చల్లో మునిగి పోతే .. మోదీ , అమిత్ షా తాము అనుకున్న రీతిలో స్పందించారు . నయా కాశ్మీర్ కు ఆమోదం తెలిపారు . దీని వెనుక రాజకీయాలు ఉండొచ్చు ..కాదనలేం ..కానీ మోదీ సర్కార్ తీసుకున్న ఈ హఠాత్ నిర్ణయానికి దేశంలో మద్దతు పెరుగుతోంది . కేవలం ఒకే ఒక్క రోజులో కథంతా మారి పోయింది . 70 ఏళ్లుగా కల్లోలానికి కేరాఫ్ గా మారిన జమ్మూ కాశ్మీర్ ముఖ చిత్రాన్ని ...దాని రూపు రేఖలను పూర్తిగా మార్చేసింది . ఈ ప్రాంతానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 ని రద్దు చేసింది .

దీంతో పాటు దానికి అనుబంధంగా ఉన్న 35 ఏ ..స్టోరీకి ముగింపు పలికింది . భారత రాష్ట్ర పతి ఆర్డర్ తో రాజ్యాంగాన్ని మార్చిన కేంద్ర ప్రభుత్వం అదే వేగంతో జమ్మూ కాశ్మీర్ ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేసింది . ఇక ఇప్పటి నుంచి జమ్మూ కాశ్మీర్ దేశంలో అన్ని ప్రాంతాలతో సమానం . నరేంద్ర మోడీ పంతం నెగ్గింది . షా ప్లాన్ వర్కవుట్ అయ్యింది . అసెంబ్లీతో కూడిన కేదన్రా పాలిత ప్రాంతంగా జమ్మూ కాశ్మీర్ , అసెంబ్లీ లేని ప్రాంతంగా లడక్ ఇక నుంచి ఉండబోతోంది . 370 వల్లనే అక్కడ టెర్రరిజం పెట్రేగి పోతోందని మోదీ మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు . గవర్నర్ సిఫారసుతో రాష్ట్రపతి ఆర్డర్ ఇవ్వడం జరిగి పోయింది . ఇక రాజ్యాంగ నియమాలన్నీ పూర్తిగా అమలు కానున్నాయి . జమ్మూ కాశ్మీర్ బిల్లుకు టీఆర్ ఎస్ , వైసీపీ , బీఎస్పీ , బీజేడీ , ఆప్ మద్దతు పలికాయి . కాంగ్రెస్ , పీడీపీ , ఆర్జేడీ వ్యతిరేకించాయి . అయితే దేశం తలను నరికారాని గులాం నబి ఆజాద్ పేర్కొన్నారు . ఇంకా లోతుల్లోకి వెళితే మోదీ నిర్ణయం దేశంలో హర్షతి రేఖలు వెల్లివిరియగా .. మరో వైపు అంతర్జాతీయంగా పాక్ కు వెన్నుదన్నుగా నిలుస్తున్న అమెరికా కు కూడా భారత్ చెక్ పెట్టిందనుకోవాలి .
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి