పంచాయితీలలో పడకేసిన పాలన..?
ఎన్నికలు ముగిసి పదవుల్లో కొలువు తీరినా తెలంగాణలోని గ్రామ పంచాయితీలలో పాలన పడకేసింది. గ్రామాల అభివృద్హి గూర్చి పట్టించు కోవాల్సిన కొత్తగా ఎన్నికైన సర్పంచులు రోడ్డెక్కారు . ఇక నూతనంగా కొలువుల్లోకి వచ్చి చేరిన విలేజ్ సెక్రెటరీలు ఈ పాలన వద్దంటూ లోలోపట బాధ పడుతున్నారు. ప్రతి ఒక్కరు తమనే టార్గెట్ చేస్తుండడంతో చాలా మంది ఈ జాబ్ కంటే వేరే జాబ్ చూసు కోవడం వేటర్ అనే స్థాయికి చేరుకున్నారు. ఇక భాద్యతగా ఉండాల్సిన గ్రామాల ప్రధమ పౌరులు రాస్తారోకోలు , ఆందోళనలు , ధర్నాల బాట పట్టారు . తమకు మాత్రమే చెక్ పవర్ ఉండాలని , ఉప సర్పంచ్ కు ఉండొద్దంటూ డిమాండ్ చేస్తున్నారు . ఈ విషయం పై సర్పంచుల సంఘం ఈ మేరకు విన్నవించింది.
కొత్తగా ఎన్నికైన వీరంతా భారీ ఎత్తున గ్రామాలలో జరిగిన ఎన్నికల్లో ఖర్చు పెట్టారు . చేసిన ఖర్చులు గిట్టుబాటు కావడం లేదంటూ వాపోతున్నారు. దీంతో సందిట్లో సడేమియా అన్న చందంగా గ్రామ పంచాయితీలలో పాలన పడకేసింది . సిబ్బంది ఇస్తా రాజ్యంగా వ్యవహరిస్తుడడంతో సమస్యలు తీరడం లేదు . అయితే గ్రామాలకు నిధులు విడుదల చేయక పోతే అభివృద్ధి ఎలా జరుగుతుందని వారంటున్నారు . దీంతో సీరియస్ గా తీసుకున్న సర్కార్ సర్పంచులు అనుసరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది . ఇదే అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్ అయ్యారు . పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం టార్గెట్ పెట్టింది . అంతే కాకుండా నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోక పోతే సర్పంచులు , మున్సిపల్ చైర్మన్లు తొలగించేందుకు సైతం వెనుకాడ బోమంటూ వార్నింగ్ ఇచ్చారు .
పని చేయక పోతే పదవుల నుండి దింపేస్తాం . భయపడితే ఇలాగే వ్యవహరిస్తారు. చట్టాలు చేసినం . ఎలాంటి మార్పులు చేసే ప్రశక్తే లేదు . తెగే దాకా లాగితే నష్ట పోయేది మీరేనని తేల్చి చెప్పారు . బడ్జెట్ సమావేశాల్లో సభ ముందుకు రెవెన్యూ యాక్ట్ తీసుకు వస్తామని కేసీఆర్ స్పష్టం చేసారు . ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు గవర్నర్ కోరిన సవరణలు పెద్దవేమీ కావన్నారు . ఎలాంటి పరిస్థితుల్లో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు . ఎవరి బెదిరింపులకు లొంగేది లేదు. సర్పంచులు మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తే ఎవరికి నష్టం . వాళ్ళకు అధికారం పోతుంది . ఇక మిగిలేది ఉప సర్పంచ్ లకు పవర్ దక్కుతుంది . వాళ్ళే గ్రామ పంచాయతీలకు దిక్కుగా ఉంటారు. ఉద్యోగ సంఘాలు తమ పరిమితుల్లో వుంటే మంచిది. బెదిరింపులకు పాల్పడితే ఉపేక్షించమని..హెచ్చరించారు. దారికొస్తే సరేసరి లేకపోతే అంతే అంటూ హెచ్చరించడంతో సంఘాల నేతలు మిన్నకుండి పోయారు

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి