తగ్గిన రాష్ట్రం ..ఇక నుంచి 28 రాష్ట్రాలు .. 9 కేంద్రపాలిత ప్రాంతాలు
జమ్మూ కాశ్మీర్ విభజన బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలపడంతో దేశంలో ఒక రాష్ట్రం తగ్గినట్టయింది. ఇక నుంచి ఇండియాలో 28 రాష్ట్రాలు ..9 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉండనున్నాయి . 370 ఆర్టికల్ రద్దు వెనుక పెద్ద తతంగమే నడిచింది . ఊహించని రీతిలో బీజేపీ సర్కార్ కు ఈ విషయంలో ఆప్ పార్టీ మద్దతు పలకడం ఒకింత విస్తు పోయేలా చేసింది . నిత్యం కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న జమ్మూ కాశ్మీర్ సమస్యకు ఏదో ఒక రోజు చెక్ పెట్టే రోజు తప్పక వస్తుందని మోదీ చెప్పిన విధంగానే ..చేతల్లో చేసి చూపించారు . తాను తల్చుకుంటే చేయడం మాత్రమే ఉంటుందని స్పష్టం చేసారు విపక్షాలకు . ఇన్నాళ్లుగా రాష్ట్రంగా ఉన్న జమ్మూ కాశ్మీర్ నును రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది .
దీంతో స్వయం ప్రతిపత్తి హోదా పోయి ..దేశంలోని మిగతా ప్రాంతాల లాగానే జమ్మూ కాశ్మీర్ లోనూ భారత రాజ్యాంగం అమలవుతుంది. అత్యంత నాటకీయ పరిణామాల మధ్యన రాష్ట్రపతి 370 ఆర్టికల్ ను రద్దు చేస్తూ గెజిట్ విడుదలైంది . దీంతో విపక్షాలు విస్తు పోయాయి . ఆపరేషన్ ఇంత త్వరగా పూర్తి చేస్తారని కలలో కూడా ఊహించి ఉండరు నేతలు . వారికి ఆ ఛాన్స్ కూడా ఇవ్వలేదు మోడీ అండ్ షా . దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపాయి . జమ్మూ కాశ్మీర్ కు ఎక్కడలేని అధికారాలను గతంలో కట్టబెట్టారు. దేశంలో రాష్ట్రాలకు ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు జరిగితే , అక్కడ ఆరేళ్లకు ఒకసారి జరుగుతాయి . అక్కడ కేంద్రం ఏదైనా అమలు చేయాలన్నా లేక నిర్ణయం తీసుకోవాలన్నా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ తీర్మానం పెట్టాలి ..ఆమోదం కావాలి . దీంతో అన్నీ ఉన్నా అక్కడ ఏమీ చేయలేక చేష్టలుడిగి పోయాయి గత ప్రభుత్వాలు . ఈ ఆర్టికల్ ను అడ్డం పెట్టుకుని మూడు పార్టీలు రాజ్యం చెలాయిస్తున్నాయని బీజేపీ వాదిస్తూ వచ్చింది . ఎన్నికల్లోని మేనిఫెస్టో లో ఆ ఆర్టికల్ ను రద్దు చేస్తామని హామీ ఇచ్చింది .
ఆ మేరకు తనకు పూర్తి మెజారిటీ దక్కడంతో ఆపరేషన్ ను కూల్ గా ఇంప్లిమెంట్ చేసింది . ఇక నుంచి అసెంబ్లీ లేని ప్రాంతంగా లడఖ్ ఉండబోతోంది . అమిత షా బిల్లును ప్రవేశ పెట్టడంతో సభ ఒక్కసారిగా దద్దరిల్లింది . ఇది ప్రజాస్వామ్యానికి తీరని నష్టంగా విపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేసారు . అయితే దీనిని చీకటి రోజుగా కాంగ్రెస్ నేత గులాం నబి ఆజాద్ అన్నారు . మరో వైపు జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దును తాము ఒప్పుకోమంటూ పాకిస్థాన్ ప్రకటించింది . కాశ్మీర్ వివాదాస్పద ప్రాంతమని , దాని హోదాలో ఎలాంటి మార్పులను ఒప్పుకోమని స్పష్టం చేశారు . ఇది వివాదాస్పద ప్రాంతంగా అంతర్జాతీయంగా గుర్తింపు వుంది. మోదీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని ఆరోపణ చేశారు . యుఎస్ లో ఈ మేరకు ఫిర్యాదు చేస్తామని ప్రకటించింది ఆ దేశ సర్కార్ . కానీ ఇప్పుడు మోదీ , షా ఎవరిని పట్టించుకునే స్థితిలో లేరు . ఈ రద్దుతో ఆర్టికల్ రద్దు చేయాలని కోరుతూ ఉద్యమించిన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కి నివాళి అర్పించినట్టవుతుందని కమలనాథులు పేర్కొంటున్నారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి