వాగులు ..వంకలు ..నీళ్లు ..కన్నీళ్లు ..ఆగని వానలు..!

నిన్నటి దాకా నీళ్ల కోసం వేచి చూసిన జననానికి ఇప్పుడు ఎడతెగని వర్షాలతో లబోదిబోమంటున్నారు. ఆసరా కోసం ఎదురు చూస్తున్నారు . జలాశయాలు నీళ్లతో నిండి పోయాయి. విస్తారంగా కురుస్తున్న వానల దెబ్బకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. భారీగా కురుస్తున్న వర్షాలకు దీంతో గోదావరి , తదితర నదులన్నీ నీళ్లతో నిండి పోతున్నాయి . నెర్రెలు బారిన ప్రాజెక్టులన్నీ జలకళ ను సంతరించుకున్నాయి . ఇంకో వైపు ఎల్లంపల్లి తో పాటు కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బ్యారేజీ గేట్లను ఎత్తి వేశారు . నీరంతా ఆంధ్రప్రదేశ్ వైపు మళ్లుతోంది . వరద ఉదృతి పెరగడంతో నీటిని దిగువకు వదులుతున్నారు . 

కర్ణాటకలో భారీగా వర్షాలు కురుస్తుండడంతో  ఆల్మట్టి , నారాయణపూర్ ప్రాజెక్ట్లులు పూర్తి గా నిండు కుంటున్నాయి . దీంతో దిగువకు వదలడంతో జూరాల ప్రాజెక్ట్ పూర్తిగా నీటితో కళకళలాడుతోంది. మేడిగడ్డ బ్యారేజికి వరద నీరు వచ్చి చేరుతోంది . ఇక కడెం ప్రాజెక్ట్ నుంచి వచ్చిన వరద నీటితో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ పూర్తి నిండి పోయింది . నీటి నిల్వ పూర్తి స్థాయికి చేరుకుంది . పది గేట్లను కిందకు వదిలారు అధికారులు . మరో బ్యారేజ్ సుందిళ్ల కూడా నిది పోయింది . దానికి కూడా నీరు యెడ తెరిపి లేకుండా వస్తోంది . దీని పూర్తి నీటి మట్టం 130 మీటర్లకు గాను 129 మీటర్లకు చేరుకుంది . దీంతో దిగువకు నీళ్లను వదిలారు . అన్నారం , మేడిగడ్డ , తదితర బ్యారేజీలన్నీ నిండు కుండలను తలపిస్తున్నాయి . 

కర్ణాటకలో కురుస్తున్న వర్షాల దెబ్బకు  పాలమూరు జిల్లాలోని జూరాల ప్రాజెక్ట్ కు వరద నీళ్లు వచ్చి చేరుతున్నాయి . ఇప్పటికే ఉదృతి పెరగడంతో 26 గేట్లు ఎట్టి వేశారు . శ్రీశైలం ప్రాజెక్ట్ కు నీటిని విడుదల చేసారు అధికారులు . ప్రస్తుతం ప్రాజెక్ట్ లో 318 నీటి నిల్వ ఉండడంతో ..హైడల్ ప్రాజెక్ట్ దగ్గర విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది . మొత్తం నీట్లోంచి నెట్టెంపాడు ఎత్తిపోతల, భీమా , కోయిల్ సాగర్ లిఫ్ట్ లకు వరద నీటిని వదులుతున్నారు . మరో వైపు గోదావరి ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది . కొన్ని గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు . ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది . మంత్రులు సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అటు వైపు ఎల్లంపల్లి కొత్త కళను సంతరించుకుంది . పర్యాటకులను ప్రాజెక్టులు ఆకర్షిస్తున్నాయి. మొత్తం మీద నీటి కోసం అల్లాడిన జనం ఇప్పుడు కుండపోత వర్షాలతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి . 

కామెంట్‌లు