పోస్ట్‌లు

సెప్టెంబర్ 28, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

పూరీ..పడి లేచిన కెరటం

చిత్రం
తెలుగు సినిమా రంగంలో అతడో సునామి. ఎవడి బతుకు వాడే బతకాలన్న ఫిలాసఫీ. అతడో ట్రెండ్ సెట్టర్. భావుకుడు. రచయిత. ఫిలాసఫర్ అన్నిటికంటే ఎలాంటి కల్మషం లేని వ్యక్తి. అతడే దమ్మున్న డైరెక్టర్ పూరీ జగన్నాథ్. రామ్ గోపాల్ వర్మ టీమ్ లో ఒకడు. గుండెల్లో గునపాలు దించినట్టు ఉంటాయి అతడి డైలాగ్స్. పూరి అంటేనే ఓ బ్రాండ్. ఓ సెన్సేషన్. తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ ను స్వంతం చేసుకున్న ఆయన టాప్ పొజిషన్ కు చేరుకున్నారు. అనుకోని పరిస్థితుల్లో కిందకు జారారు. సంపాదించుకున్న కోట్లాది రూపాయలు పోగొట్టుకున్నాడు. ఒకానొక సమయంలో తాను ఒంటరివాడై పోయాడు. కానీ కష్ట కాలంలో ఏ మాత్రం ధైర్యం కోల్పోలేదు. అన్నీ కోల్పోయినా ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమా తీసి మరో బ్లాక్ బ్లస్టర్ మూవీతో తిరిగి తన పవర్ ఏమిటో రుచి చూపించాడు. స్మూత్ కేరక్టర్ కే పరిమితమై పోయిన రామ్ పోతినేనిని ఈ సినిమాలో డిఫరెంట్ గా పూర్తి భిన్నంగా చూపించాడు. పూరీ అంటేనే మినిమమ్ గ్యారెంటీ వున్న డైరెక్టర్ గా పేరుంది. ఆయన తీసిన ప్రతి సినిమాలో హీరో కు ఓ స్పెషాలిటీ ఉంటుంది. అంతకంటే ఎక్కువగా ఐడెంటిటీ ఉంటుంది. మూస ధోరణితో సాగుతున్న టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ తో త...

స్మార్ట్ మొబైల్స్ లో షాన్ దార్ షావోమి

చిత్రం
భారతీయ మార్కెట్ ను చైనాకు చెందిన మొబైల్స్ కంపెనీల ఫోన్స్ దుమ్ము రేపుతున్నాయి. ఇప్పటికే దిగ్గజ కంపెనీలైన యాపిల్, శాంసంగ్ స్మార్ట్ ఫోన్స్ హవాను లెనోవా, వివో, ఒప్పో , షావోమి మొబైల్స్ డామినేట్ చేసే స్థాయికి చేరుకున్నాయి. రోజుకో కొత్త ఫీచర్స్ , డిజైన్స్ తో ఆకట్టుకునేలా ఉంటున్నాయి. కొనుగోలుదారులను, మొబైల్స్ ప్రియులతో పాటు యువతీ యువకులను ఎక్కువగా మెస్మరైజ్ చేస్తున్నాయి. ఇండియాలో ఎక్కడికి వెళ్లినా షావోమి స్టోర్స్ అగుపిస్తున్నాయి. ఇండియాలో ఎక్కువగా బిజినెస్ అంతా మిడిల్ క్లాస్ కు చెందిన వారిపైనే నడుస్తుంది. 130 కోట్ల భారతీయ జనాభాలో దాదాపు 70 శాతానికి మించి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోనే ఉన్నారు. మిగతా 30 శాతం జనం నగరాల్లో ఉంటున్నారు. ఇప్పటికే అత్యంత చౌకగా ఇంటర్నెట్ ఆధారిత సేవలు అందుతున్నాయి. భారతీయ టెలికాం సెక్టార్ లో కంపెనీల మధ్య వ్యాపార యుద్ధం మొదలైంది. ఇంతకు ముందు భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ప్రభుత్వ కంపెనీ అయితే , ప్రయివేట్ టెలికాం కంపెనీల్లో రిలయన్స్ గ్రూప్ నకు చెందిన జియో ఉండగా ఎయిర్ టెల్ , ఐడియా , వోడా ఫోన్ , టాటా టెలికాంలు ఉన్నాయి. వీటిల్లో ఇప్పుడు బీఎస్ ఎన్ ఎల్ నష్టాల్లో కొనసాగుతుండగ...

ఓ మహాత్మా ..ఓ మహర్షి..బాపూ మనందరికీ వెలుగు

చిత్రం
నా జీవితమే నా సందేశం..అంటూ చెప్పడమే కాదు ఆచరణలో చేసి చూపించిన జాతిపిత. మహోన్నత మానవుడు. అహింసపై శాంతి అనే ఆయుధంతో కొన్ని తరాలుగా ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తూనే ఉన్నారు. ఉంటారు కూడా. ఆంగ్లేయుల కబంధ హస్తాల్లో ఉన్న భారత దేశానికి స్వేచ్ఛను ప్రసాదించిన నాయకుడు. మోహన్ దాస్ కరం చంద్ గాంధీ ..బారిస్టర్ కోసం లండన్ కు వెళ్లిన ఆయన ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. హింసకు తావులేకుండా లక్షలాది మందిని ఏకం చేశాడు. తాను ఏది చెప్పాడో అదే ఆచరించి చూపాడు. తన పని తాను స్వంతంగా చేసు కోవడం, చని పోయేంత వరకు అబద్దం ఆడక పోవడం, సత్యాన్నే పలకడం, పెద్దలను, గురువులను గౌరవించడం. ప్రతి రోజు క్రమం తప్పకుండా ధ్యానం చేయడం. మంచి పుస్తకాలు చదవడం మహాత్ముని దినచర్య. ఈ దేశం ..ఈ జాతి ఆ మహాత్ముడిని ప్రతి రోజు తల్చుకుంటూనే ఉంటుంది. ఆయన పుట్టిన రోజును మనందరం పండుగలా జరుపుకుంటాము. 20 వ శతాబ్దంలో గాంధీజీ తప్ప ఇంకే నాయకుడు ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేయలేదు. ప్రతి దేశంలో ఆ గాంధీజీ విగ్రహం ఉండే ఉంటుంది. ఆయన బతికినంత కాలం హింస ను వ్యతిరేకించాడు. తోటి వారిని ప్రేమించాలని, కష్టాలలో ఉన్న వారిని ఆదు కోవాలని కోరారు. గాంధీజీని ఎక్క...

దుమ్ము రేపుతున్న సిద్ శ్రీరామ్ సాంగ్

చిత్రం
ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో త్వరలో రాబోతున్న బన్నీ నటించిన అల వైకుంఠపురంలో సినిమా లోని సాంగ్ విడుదలైన కొద్దీ సేపు లోపే మిలియన్స్ వ్యూస్ దాటేసింది. ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి సామజవరగమణ పేరుతో పాటను రాయగా, మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.థమన్ దీనికి మ్యూజిక్ అందించాడు. అంతకు ముందు థమన్ జూనియర్ ఎన్ఠీఆర్ తో త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చిన అరవింద సామెత సినిమాకు కూడా క్యాచీ ట్యూన్స్ ఇచ్చాడు. అజ్ఞాతవాసి మూవీ అనుకున్నంతగా ఆడలేదు. ఇప్పుడు కసితో బన్నీతో మూడో సినిమా తీస్తున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. హై పీచ్ లో సాగే ఈ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్ లో వైరల్ అవుతోంది. వేలాది మంది దీనిని చూస్తున్నారు. వింటున్నారు. తెలుగు సినీవాలిలో వేలాది పాటలు రాసిన చరిత్ర సిరివెన్నెలకు ఉన్నది. మరోసారి అయన కలం జూలు విదిల్చింది. దుమ్ము రేపుతోంది. అత్యంత భావోద్వేగంతో సాగిన ఈ సాంగ్ జనాన్ని మెస్మరైజ్ చేస్తోంది. దీనికి సిద్ శ్రీరామ్ ప్రాణం పోశాడు. 19 మే 1990 లో చెన్నైలో శ్రీరామ్ పుట్టాడు. కంపోసర్ గా, మ్యూజిక్ ప్రొడ్యూసర్ గా, ప్లే బ్యాక్ సింగర్ గా, పాటల రచయిత గా ఇప్పటికే పేరు తెచ్...