లక్ష్మారెడ్డికి లైన్ క్లియర్..?

ప్రొఫెషనల్ గా డాక్టర్ కోర్సు చేసినా రాజకీయాల్లో మాత్రం ఈ వైద్యుడు వెరీ వెరీ స్పెషల్. సౌమ్యుడిగా, సహృదయుడిగా, మౌనంగా తనపని తాను చేసుకుని పోయే మనస్తత్వం కలిగిన పొలిటికల్ లీడర్ గా, తలపండిన రాజకీయ వేత్తగా, మేధావిగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన డాక్టర్ లక్ష్మారెడ్డి కి ఎంతో పేరుంది. తెలంగాణ రాష్ట్రంలో ఆయన విస్మరించలేని నాయకుడిగా ఎదిగారు. ఆ దిశగా తనను తాను మలుచుకున్నారు. అత్యంత కింది స్థాయి గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన ఈ లీడర్ ఇప్పుడు జన నాయకుడిగా, ప్రజలు మెచ్చిన సేవకుడిగా మారి పోయారు. చాలా మంది పొలిటికల్ లీడర్లు ఒక్కసారి పదవి వస్తే, దక్కితే చాలు ఇక తమ కోసం పని చేసిన వారిని, తమను నమ్ముకున్న వారిని పట్టించుకోరు. కానీ ఈ డాక్టర్ సాబ్ అలా కాదు. తన ఎదుగుదల కోసం, మొదటి నుంచి తన కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి జీవితాన్ని ప్రసాదించిన ఘనత లక్ష్మారెడ్డి కే దక్కుతుంది. పుట్టుకతో రెడ్డి సామాజిక వర్గానికి చెందినప్పటికీ ఆయన అన్ని వర్గాల వారిని ఆదరిస్తారు. చేతనైనంత మేరకు సహాయ చేస్తారు. ఎవ్వరికైనా ఆపద వస్తే చాలు వెంటనే స్పందిస్తారు. అంతే కాదు ఏకంగా తనకు జన్మను ప్రసాదించిన, తన ఉన్నతికి కారకులైన వారిని...