దేశమంతా అచ్యుత కోసం
ఆయన పేరు చెబితే చాలు దేశం పులకించి పోతుంది. అత్యంత సామాన్యమైన అట్టడుగు కుటుంబం నుంచి వచ్చిన అచ్యుత సామంత ఏకంగా ఎవరూ సాధించలేని విజయాలను నమోదు చేసుకున్నారు. కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలిచారు. ఆయన ఏకంగా ఓ విశ్వవిద్యాలయాన్నే ఏర్పాటు చేశారు. ఇప్పుడు తన కథను ఏకంగా దేశంలో అత్యంత జనాదరణ పొందిన కరం వీర్ లో తన అనుభవాలను మిస్టర్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో పంచుకోబోతున్నారు. సోని టెలివిజన్ ఛానెల్‌లో ప్రజాదరణ పొందిన కౌన్ బనేగా కరోడ్‌పతి కార్యక్రమం ప్రసారం అవుతోంది.
ఇందులో వివిధ రంగాల్లో దిగువ స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగిన ప్రముఖలను పరిచయం చేస్తారు. ఈసారి అతిథిగా కలింగ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, కలింగ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ పేరిట సంస్థలను ఏర్పాటు చేశారు. అత్యున్నత విద్యా ప్రమాణాలను అందిస్తూ దేశానికి, జాతికి, ప్రపంచానికే ఆదర్శంగా నిలిచారు. ఒడిశాలోని కందమహల్ నుంచి బీజేడీ ఎంపీగా విజయం సాధించి ప్రజల ప్రశంసలు అందుకుంటున్నారు అచ్యుత సామంత్.
ఈ కార్యక్రమంలో ఆయనకు ప్రముఖ సినీ నటి తాప్సీ పన్ను సహకరిస్తున్నారు. యథావిధిగా ఈ కార్యక్రమాన్ని అమితాబ్ బచ్చన్ నిర్వహించారు. బాల్యం నుంచి తాను ఎదుర్కొన్న సవాళ్లు, ఉన్నత విద్యా సంస్థలు స్థాపించే వరకు తాను ఎదిగిన తీరు, దాతృత్వం, దయాగుణం తనకు అబ్బిన విధంతో పాటు ఇప్పుడు పాలనా..దక్షుడిగా ఎదిగిన తీరును అచ్యుత సామంత ఇందులో వివరిస్తారు. చిన్నప్పటి నుంచి అచ్యుత ఎదుగుదలను ప్రత్యక్షంగా చూసిన ఆయన సోదరి ఇతి రాజ సామంత కూడా తనతో పాటూ ఉండడం విశేషం.
అమితాబ్ బచ్చన్ కోసం అచ్యుత సామంత, ఒడిశాలో ప్రసిద్ధి చెందిన చెన్న పొడ తిను పదార్థాన్ని, తన కిస్ సంస్థ విద్యార్థులు వేసిన పెయింటింగ్‌ను బహమతిగా తీసుకెళ్తున్నారు. ఆయన ఇంతకు ముందు ఎన్‌డీటీవీలో అమితాబ్ నిర్వహించిన బనేగా స్వచ్ఛ్ ఇండియా కార్యక్రమంలోనూ అతిథిగా పాల్గొన్నారు. దేశమంతటా రేపటి భవిష్యత్తు కోసం వేలాది మందిని అందిస్తున్న అచ్యుత సామంత ఏం చెప్పబోతున్నారనే దానిపై ఎదురు చేస్తోంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి