నల్లారి కంటే కేసీఆర్ మోస్ట్ డేంజర్

ఆంధ్రప్రదేశ్‌ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి కంటే సీఎం కేసీఆర్‌ తెలంగాణకు అత్యంత ప్రమాదకారిగా మారారని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు, ప్రజా ఉద్యమ కారుడు మందకృష్ణ మాదిగఆరోపించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఆయన మద్దతు తెలిపారు. వారి తరపున మందకృష్ణ మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణలో ఏనాడూ ప్రభుత్వ అత్యున్నత అధికారి, మరో ముగ్గురు ఐఏఎస్‌లను హైకోర్టు పిలిచి ఆగ్రహం వ్యక్తం చేసిన దాఖలాలు లేవన్నారు. అన్యాయం ప్రభుత్వం వైపు ఉందని న్యాయం, ధర్మం అంతా ఆర్టీసీ కార్మికుల వైపు ఉందన్నారు.   తెలంగాణ ఇస్తే చాలా రాష్ట్రాల డిమాండ్‌లు వస్తాయని కేంద్రం అనుకుంటే తెలంగాణ వచ్చి ఉండేది కాదన్నారు.

అలాగే ఆర్టీసీని విలీనం చేస్తే 91 కార్పొరేషన్‌ల డిమాండ్‌ చేస్తాయని సీఎం సొల్లు కబుర్లు చెబుతున్నారంటూ మండిపడ్డారు.గతంలో ప్రభుత్వంలో ఉన్న ఆర్టీసీనే విలీనం చేయమని కోరుతున్నామనే విషయంన్ని కేసీఆర్ గుర్తించడం లేదన్నారు. హైకోర్టులో తీర్పు రాక ముందే సుప్రీం కోర్టు వెళ్తామని చెప్పడం కార్మికుల అంతిమ విజయానికి నిదర్శనమన్నారు. ప్రతి ఒక్కరూ కేసీఆర్‌ సంగతి చూస్తాం, అంతు తేలుస్తాం అని అంటున్నారే తప్పా వాళ్ళు ఆచరణలో వెనక్కి వెళుతున్నారని ధ్వజమెత్తారు. ఇదిలా ఉండగా న్యాయస్థానంలో కేసీఆర్‌ ప్రభుత్వాన్ని హైకోర్టు బోనులో దోషిగా నిలబెట్టిన చరిత్ర ఆర్టీసీ కార్మికులదని మంద కృష్ణ కొనియాడారు. ఆర్టీసీ కార్మికులు కేసీఆర్‌కు శాపనార్థాలు పెట్టవద్దని, ఆయన ఆరోగ్యం బాగుండాలని ప్రతి కార్మికుడు కోరుకోవాలని హితవు చెప్పారు.

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం కావడం తథ్యమని అన్నారు. యుద్ధంలో శత్రువు బతికి ఉన్నప్పుడే గెలవాలని పిలుపు నిచ్చారు. ఆర్టీసీ ఆస్తులు కేసీఆర్‌ జాగీరు కాదని, ఏవడబ్బ సొమ్మని అమ్ముకుంటావు అంటూ నిప్పులు చెరిగారు. కార్మికులు విధుల్లో చేరక పోతే 100 శాతం ప్రైవేటీకరణ చేస్తామని చెప్పడం చూస్తే కేసీఆర్‌ ముందే కుట్ర పన్నాడని తెలుస్తోందన్నా రు. హైకోర్టులో విచారణ ప్రారంభమైనప్పటి నుంచి ప్రభుత్వానికి అక్షింతలు తప్పడం లేదని, ఒక దశలో ఇదేమి రాజరికం కాదని వ్యాఖ్యానించిందంటే ప్రభుత్వంపై రాజ్యాంగ సంస్థ ఎంత మేర అసహనంతో ఉందో ఇట్టే అర్థమైతుందని చెప్పారు.  

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!