గూగుల్ సూపర్ కంప్యూటర్

ప్రపంచాన్ని ఒంటి చేత్తో శాసిస్తున్న గూగుల్ టెక్ దిగ్గజం మరో చరిత్రకు నంది పలికింది. ఎప్పుడైతే భారత దేశానికి చెందిన ఐటీ దిగ్గజం, అత్యంత మేధావిగా పేరొందిన సుందర్ పిచ్చెయ్ గూగుల్ కంపెనీకి సిఇఓగా ఉన్నారు. ఎప్పుడైతే ఆయన తన బాధ్యతలు చేపట్టారో ఇక అప్పటి నుంచి ఆ కంపెనీ స్వరూపమే పూర్తిగా మారి పోయింది. వారం లో ఒక రోజు స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేయకుండా ఉండేలా చర్యలు చేపట్టారు సుందర్. ఈ చెన్నై కుర్రాడు ఏది చేసినా, లేదా ఏ డిసిషన్ తీసుకున్నా అది ప్రపంచాన్ని, ఐటీ రంగాన్ని తీవ్ర ప్రభావం చూపిస్తుంది.

తనకు ఏడాదికి వందల కోట్ల రూపాయలు అందుతున్నా తాను మాత్రం వెరీ సింపుల్ గా ఉండటం ఆయనకు మాత్రమే చెల్లింది. ఇటీవల తనకు సౌకర్యాలు, అదనపు ప్రయోజనాల కింద కంపెనీ ఇవ్వబోతున్న 400 కోట్ల డాలర్లను తిరిగి కంపెనీ లోని ఉద్యోగుల సౌకర్యం కోసం, విద్య, వైద్యం, ఉపాధి కల్పించేందుకు తిరిగి ఇచ్చేశారు సుందర్. తనలోని మానవత్వాన్ని, దాతృత్వాన్ని ఈ రూపకంగా చాటుకున్నారు. తాజాగా గూగుల్ అసాధారణమైన ఆవిష్కారణలకు శ్రీకారం చుట్టింది.

ఈ మేరకు గూగుల్ లో రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ను ఏర్పాటు చేసింది. సరికొత్త ఐడియాలు, ఆవిష్కరణలకు ప్రోత్సాహం కల్పిస్తోంది. ఈ సందర్బంగా సూపర్‌ ఫాస్ట్‌ కంప్యూటర్లు 10 వేల యేళ్లలో గణించగల గణనలను కేవలం 200 సెకన్లలో సాధించిన కొత్త కంప్యూటర్‌ సికామోర్‌ మెషీన్‌ను శాస్త్రవేత్తలు పరీక్షించారు. ఇది సూపర్‌ కంప్యూటర్ల కంటే కోట్ల రెట్ల వేగంతో పని చేసిందని తెలిపారు. ఈ తరహా వేగాన్ని క్వాంటమ్‌ సుప్రిమసీ అంటారు. గూగుల్‌ సంస్థకు చెందిన పరిశోధనా బృందం దీన్ని తయారు చేస్తోంది.

సాధారణ కంప్యూటర్లు ప్రతి విషయాన్ని బైనరీల రూపంలో అర్థం చేసుకుంటాయి. ఇందు లోనూ అదే పద్ధతి ఉన్నా రెంటినీ ఒకేసారి తీసుకోగలదు. సాధారణ కంప్యూటర్లు సమాచారాన్ని బిట్స్‌ రూపంలో తీసుకుంటుండగా, సికామోర్‌ క్యూబిట్స్‌ రూపంలో తీసుకుంటుంది. ఇందులోని క్వాంటమ్‌ ప్రాసెసర్‌ 54 క్యూబిట్స్‌ సామర్థ్యంతో తయారైంది. తమ సంస్థకు చెందిన ఉద్యోగులు దీన్ని నిర్మించడం తమకు గర్వ కారణమని గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ ట్వీట్‌ చేశారు. ఆయన వారిని ప్రత్యేకంగా అభినందించారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!