ఆటపై సచిన్ ఆందోళన

భారత క్రికెట్ లెజెండ్ గా పేరొందిన సచిన్ రమేష్ టెండూల్కర్ ఆటలో ప్రవేశించి నేటితో ముప్పై ఏళ్ళు పూర్తయ్యాయి. ఈ సందర్బంగా ఈ దిగ్గజ ఆటగాడు క్రికెట్ గురించి తన మనసులోని అభిప్రాయాలను పంచుకున్నాడు. సంప్రదాయ టెస్టు క్రికెట్‌లో నాణ్యమైన పేసర్ల కొరత ఉందని సచిన్‌ టెండూల్కర్‌ అన్నాడు. అందువల్లే ఐదు రోజుల ఆటలో బ్యాట్‌కు, బాల్‌కు మధ్య హోరాహోరీ పోరు కరువైందని విశ్లేషించాడు.1970, 80 దశకాల్లో సునీల్‌ గవాస్కర్ తో అండీ రాబర్ట్స్, డెన్నిస్‌ లిల్లీ, ఇమ్రాన్‌ ఖాన్‌ల మధ్య ఆసక్తికర పోరు జరిగేది.

అనంతరం నాకూ మెక్‌గ్రాత్, అజహరుద్దీన్, వసీమ్‌ అక్రమ్‌ల మధ్య కూడా దీటైన పోరు జరిగింది. అయితే ఇప్పుడు మాత్రం ప్రపంచ వ్యాప్తంగా అతి తక్కువ మంది నాణ్యమైన సీమర్లు ఉండటంతో ఆ పోరే కరువైందని సచిన్‌ ఆందోళన వ్యక్తం చేశాడు. సరిగ్గా 30 ఏళ్ల క్రితం 1989 నవంబర్‌ 15న సచిన్‌ టెండూల్కర్‌ తొలి టెస్టు మ్యాచ్‌ ఆడాడు. ఈ నేపథ్యంలో గత మూడు దశాబ్దాల్లో టెస్టు క్రికెట్‌లో వచ్చిన మార్పులపై కామెంట్స్ చేశాడు. క్రికెట్‌లో ప్రమాణాలు తగ్గడం టెస్టులకు మంచిది కాదు. నాణ్యత పెరిగి తేనే ఆట బతుకుతుంది. పిచ్‌లలో జీవం కొరవడటమే అసలు సమస్య అని అన్నాడు.

బ్యాట్‌కు బంతికి మధ్య హోరా హోరీ జరిగే సమతుల్యమైన పిచ్‌లను తయారు చేస్తేనే టెస్టు క్రికెట్‌ ఆసక్తి రేపుతుందని సచిన్‌ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఈ ఏడాది ఇంగ్లండ్‌లో జరిగిన యాషెస్‌ పోరు రసవత్తరంగా జరిగిందని చెప్పాడు. 1999లో చెన్నైలో పాక్‌తో జరిగిన టెస్టులో వెన్ను నొప్పితో బాధపడుతూ చేసిన సెంచరీ, 2004లో సిడ్నీలో సాధించిన డబుల్‌ సెంచరీ, 2011 కేప్‌టౌన్‌లో స్టెయిన్‌తో జరిగిన పోరు తన కెరీర్‌లో అతి పెద్ద సవాల్‌గా నిలిచిన ఇన్నింగ్స్‌లని సచిన్‌ ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నాడు. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!