టీటీడీ ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి

ప్రపంచంలోనే అత్యంత ఆదాయంతో పాటు కోట్లాది మంది భక్తులు కలిగిన ఏకైక దైవం తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్‌గా మాజీ ఎంపీ వై.వి. సుబ్బారెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీవారి ఆలయంలోని గరుడాళ్వారు సన్నిధిలో జరిగిన కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనిల్ కుమార్ సింఘాల్ ..వై.వితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, శాసనమండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, సినీ నిర్మాత దిల్ రాజు, పాలకమండలి మాజీ సభ్యుడు రౌతు సూర్య ప్రకాశ్ రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ సామాన్య ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేయడమే తమ ముందున్న లక్ష్యమని, ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావు లేకుండా చేస్తానని చెప్పారు. కాగా టీటీడీ ఛైర్మన్‌గా ఆయనకు ముందు నుంచే పదవి లభిస్తుందని ప్రచారం జరిగింది. కేబినెట్‌లో చోటు కల్పిస్తారని అనుకున్నారు. తర్వాత ఫైర్ బ్రాండ్ నేత రోజా పేరు కూడా విని...