ఆన్‌లైన్ పేమెంట్స్‌లలో గూగుల్ పే నెంబర్ వన్
టెక్నాలజీ మారింది. ఎప్పటికప్పుడు మారుతూనే వున్నది. బ్యాంకింగ్ వ్యవస్థకు మరింత బలాన్ని ఇస్తోంది. పనితీరు మెరుగు పడేందుకు, ఎక్కువ సిబ్బంది, ఉద్యోగులు లేకుండా చేసేందుకు సాంకేతికత ఉపయోగపడుతుంది. దీంతో ప్రతి ఒక్కరు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో అనుసంధానం అవుతున్నారు. కంపెనీలు, వ్యక్తులు, వ్యవస్థలు, సంస్థలు, వ్యాపారులు, టెలికాం కంపెనీలన్నీ ఐటీ మీదే ఆధారపడ్డాయి. తాజాగా డిజిటల్ టెక్నాలజీ భారీగా విస్తరించింది. టెలికాం రంగంలో ప్రైవేట్ ఆపరేటర్ల ఆధిపత్యం ఎక్కువగా ఉంది. ఇండియాలో , ఏసియా ఖండంలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిలయన్స్ జియో 5 కోట్లకు పైగా సబ్ స్క్రైబర్స్‌తో రికార్డు బ్రేక్ చేసింది. ఎక్కడికి వెళ్లినా తమ నెట్ వర్క్ ఉండేలా ఫైబర్ సిస్టంను ఏర్పాటు చేసింది ఈ కంపెనీ. మిగతా టెలికాం కంపెనీలకు చుక్కలు చూపిస్తోంది.
బ్యాంకింగ్ రంగంలో పెను మార్పులు కలగడంతో కస్టమర్లకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కంపెనీలు యాప్స్‌ను తయారు చేశాయి. వీటిలో పే టిఎం ఇండియాలో ప్రతి ఒక్కరికి ఎరుకే. ఆ తర్వాత ఫోన్ పే వచ్చింది. గూగుల్ పే యాప్ కు ఎనలేని డిమాండ్ ఉంటోంది. ప్రపంచ వ్యాప్తంగా తన స్థానాన్ని పదిల పర్చుకుంటూనే ఈ యాప్ జనానికి అందుబాటులో ఉండేలా చేసింది కంపెనీ. ఇపుడు ప్రతి వంద మందిలో 65 శాతానికి పైగా కస్టమర్లు, ప్రజలు , వినియోగదారులు, స్టూడెంట్స్, ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరు గూగుల్ పేను డౌన్లోడ్ చేసుకుంటున్నారు. దీంతో ఇండియాలో గూగుల్ పే టాప్ ఒన్‌లో నిలిచింది. మరో వైపు ఫోన్ పే ఆన్ లైన్ పేమెంట్స్ యాప్‌లలో రెండవ స్థానంతో సరిపెట్టుకుంది.
ఈ యాప్స్ వల్ల చాలా మంది కస్టమర్లకు ఇబ్బందులు తొలగి పోయాయి. ఉన్న చోటు నుంచే ఫోన్ నెంబర్ కలిగి ఉండి, తమ బ్యాంకు అకౌంట్‌తో అనుసంధానం అయితే చాలు..ఇంకేం మీకు పాస్ వర్డ్ వస్తుంది. అదే కంపెనీ ఏర్పాటు చేస్తుంది. కావాల్సందిల్లా గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడమే. క్షణాల్లో మీరు ప్రపంచంలో ఏ మూలాలనున్నా సరే ఎన్ని డబ్బులనైనా ఈజీగా పంపించు కోవచ్చు. బ్యాంకులకు వెళ్లి నిలబడాల్సిన పని లేదు. ఫారాలు నింపాల్సిన అవసరం లేదు. గంటల తరబడి వేచి ఉండడం లేదు. జస్ట్ పంపించే వ్యక్తులు కూడా ఆయా మనీ ట్రాన్స్ ఫర్ కు చెందిన యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటే చాలు. ఎలాంటి ఇబ్బందులు పడకుండానే కావాల్సినంత పంపించేసు కోవచ్చు.
ఇక యాప్స్ డౌన్లోడ్ విషయానికి వస్తే, ఆన్ లైన్ నగదు చెల్లింపు సేవల సంస్థ ఫోన్ పే గత మే నెలాఖరు వరకు చూస్తే..4.70 మిలియన్స జనం డౌన్ లోడ్స్ తో రెండవ స్థానం పొందగా, గత ఏడాదితో పోలిస్తే కంపెనీ 27 శాతం వృద్ధి నమోదు చేసింది. 9 మిలియన్ల డౌన్ లోడ్స్ తో గూగుల్ పే (తేజ్ ) మొదటి స్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాలలో పే పాల్, క్యాష్ యాప్, యూనియన్ పే ఉన్నాయి. ఫోన్ పే, గూగుల్ పే యాప్స్ రెండూ కూడా ఇప్పటి దాకా గూగుల్ ప్లే స్టోర్ నుండి 10 కోట్ల డౌన్‌లోడ్ సాధించడం విశేషం. ఈ 10 కోట్లలో 90 శాతం ఒక్క ఇండియా నుంచి కస్టమర్లు డౌన్లోడ్ చేసుకోవడం ఓ రికార్డ్.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి