బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేసిన బిర్యానీ బై కిలో - 15 వేల కోట్ల బిర్యానీ వ్యాపారం

ఫుడ్ ప‌రంగా బిర్యానికి ఉన్నంత క్రేజ్ ఇంకే ఫుడ్ ఐటంకు లేదంటే అతిశ‌యోక్తి కాదేమో. ఇండియాలో స్టార్ట‌ప్‌ల హ‌వా కొన‌సాగుతోంది. ఓ వైపు కేంద్రం ఇంకో వైపు రాష్ట్రాలు, బ్యాంకులు, వివిధ కంపెనీలు అంకుర సంస్థ‌ల‌కు చేయూత‌నిస్తూ ప్రోత్స‌హిస్తున్నాయి. స్టార్టింగ్‌లో ఉన్నా స‌రే వారి ఐడియాలు వ‌ర్క‌వుట్ అయ్యేలా అన్ని వ‌స‌తుల‌ను స‌మ‌కూరుస్తున్నారు. హైద‌రాబాద్ బిర్యానీకి ప్రపంచ వ్యాప్తంగా విప‌రీత‌మైన డిమాండ్ ఉంది. ముఖ్యంగా దేశ విదేశాల నుంచి వ‌చ్చే ట్రావెల‌ర్స్ ఫ‌స్ట్ ప్ర‌యారిటీ బిర్యానీనే ఉంటోంది. హైద‌రాబాద్ అంటేనే బిర్యానీ ..బిర్యానీ అంటేనే ఈ సిటీనే. బిర్యాని తినాలంటే మ‌రింత రుచి క‌రంగా ఉండాలంటే బిర్యానీ రైస్ డిఫ‌రెంట్ మోడ్‌లో త‌యారు చేస్తున్నారు. ఈ రైస్‌కు హ‌య్య‌స్ట్ రేట్స్ పెట్టి కొంటున్నారు.

ఇదే ఫార్మాట్‌లో ఫుడ్ రంగంలో బిర్యానీ బై కిలో స్టార్ట‌ప్ రుయ్ మంటూ దూసుకెళుతోంది. ఐవీ క్యాప్ వెంఛ‌ర్స్ సంస్థ ఏకంగా ఈ స్టార్ట‌ప్‌లో 30 కోట్ల ఫండింగ్ స‌మ‌కూర్చింది. సంప్ర‌దాయ ద‌మ్ బిర్యానీ మ‌రింత రుచిక‌రంగా ఉంటోంది. ఫ్రెష్ బిర్యానీని త‌యారు చేసింది మాత్రం కౌషిక్ రాయ్‌, విషాల్ జిందాల్, రితేష్ సిన్హా లు క‌లిసి 2015లో. ఆర్డ‌ర్స్ ఇస్తే చాలు క్షణాల్లో డోర్ డెలివ‌రీ చేస్తుంది ఈ అంకుర సంస్థ‌. బిర్యానీతో పాటు క‌బాబ్స్‌, బ్రెడ్స్, త‌దిత‌ర ఫుడ్ ఐట‌మ్స్‌ను అందుబాటులో వుంచింది బిర్యానీ బై కిలో స్టార్ట‌ప్. గ‌త మూడేళ్ల కాలంలో ..ప్రారంభించిన త‌ర్వాత బిబికె త‌న వ్యాపారాన్ని విస్తరించింది. దేశంలోని ఢిల్లీ, ముంబ‌యి, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, మొహాలీ , లుథియానాలో వీటిని ఏర్పాటు చేశారు.

జియోగ్రాఫిక్ ఆధారంగా వెస్ట్, నార్త్ ఇండియా వ్యాప్తంగా త‌న వ్యాపారాన్ని మ‌రింత విస్త‌రించేలా ఏర్పాట్లు చేస్తోంది. బిర్యానీకి ఉన్న మార్కెట్ 1500 కోట్ల వ్యాపారం న‌డుస్తోంది. ఇది కూడా ఓ రికార్డే. మంత్లీ ట‌ర్నోవ‌ర్ ప‌రంగా చూస్తే 15 వేల కోట్ల‌కు పైగా ఉంటోంద‌ని మార్కెట్ వ‌ర్గాల అంచనా. మ‌నం మాత్రం బిర్యానే క‌దా అనుకుని తేలిగ్గా తీసుకుంటాం. ఐవీక్యాప్ వెంఛ‌ర్స్ కంపెనీ ఫౌండ‌ర్ అండ్ మేనేజింగ్ పార్ట్ న‌ర్ విక్రం గుప్తా ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ ..బిర్యానీ బై కిలో స్టార్ట‌ప్ కు మంచి భ‌విష్య‌త్ ఉంది. అందుకే మేం దీనినే ఎంచుకున్నాం. 30 కోట్లు మొద‌టి విడ‌తగా పెట్టుబ‌డిగా పెట్టాం. మ‌రిన్ని పెట్టుబ‌డులు పెట్టేందుకు ఆలోచిస్తామ‌న్నారు. ఏది ఏమైనా బిర్యానీ లో ఉన్నంత మ‌జా..ఏకంగా భారీగా మ‌నీ వ‌చ్చేలా చేస్తోంది. ఇదీ వ్యాపార‌మంటే. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!