టీటీడీ ఛైర్మ‌న్‌గా వైవీ సుబ్బారెడ్డి

ప్ర‌పంచంలోనే అత్యంత ఆదాయంతో పాటు కోట్లాది మంది భ‌క్తులు క‌లిగిన ఏకైక దైవం తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి ఛైర్మ‌న్‌గా మాజీ ఎంపీ వై.వి. సుబ్బారెడ్డి ప్ర‌మాణ స్వీకారం చేశారు. శ్రీ‌వారి ఆల‌యంలోని గ‌రుడాళ్వారు స‌న్నిధిలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ అనిల్ కుమార్ సింఘాల్ ..వై.వితో ప్ర‌మాణ స్వీకారం చేయించారు. ఉప ముఖ్య‌మంత్రి నారాయ‌ణ స్వామి, శాస‌న‌మండ‌లి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు, ఎమ్మెల్యేలు భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి, శ్రీ‌కాంత్ రెడ్డి, ర‌వీంద్ర‌నాథ్ రెడ్డి, మాజీ ఎంపీ మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డి, సినీ నిర్మాత దిల్ రాజు, పాల‌క‌మండ‌లి మాజీ స‌భ్యుడు రౌతు సూర్య ప్ర‌కాశ్ రావు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ సామాన్య ప్ర‌జ‌లకు ఇబ్బందులు లేకుండా చేయ‌డ‌మే త‌మ ముందున్న ల‌క్ష్య‌మ‌ని, ఎలాంటి అవినీతి, అక్ర‌మాల‌కు తావు లేకుండా చేస్తాన‌ని చెప్పారు. కాగా టీటీడీ ఛైర్మ‌న్‌గా ఆయ‌న‌కు ముందు నుంచే ప‌ద‌వి ల‌భిస్తుంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. కేబినెట్‌లో చోటు క‌ల్పిస్తార‌ని అనుకున్నారు.

త‌ర్వాత ఫైర్ బ్రాండ్ నేత రోజా పేరు కూడా వినిపించింది. త‌ర్వాత నాట‌కీయ ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. వైవీకి త‌ప్ప మ‌రొక‌రికి ఇచ్చే ప్ర‌స‌క్తి లేద‌ని ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స్ప‌ష్టం చేయ‌డంతో ఇత‌ర నాయ‌కులు మిన్న‌కుండి పోయారు. అంత‌కు ముందు ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మం ఉత్కంఠ భ‌రిత వాతావ‌ర‌ణంలో జ‌రిగింది. సుబ్బారెడ్డిని ఛైర్మ‌న్‌గా ఏపీ స‌ర్కార్ నియ‌మించింది. ఈ మేర‌కు దేవాదాయ శాఖ ఉత్త‌ర్వులు కూడా జారీ చేసింది. తెలుగుదేశం పార్టీ హ‌యాంలో ఏర్పాటైన బోర్డును ర‌ద్దు చేసింది. ఆ బోర్డులోని స‌భ్యులలో ముగ్గురు రాజీనామా చేయ‌క పోవ‌డంతో క‌థ మ‌ళ్లీ మొద‌టికొచ్చింది. ఈఓ చ‌ట్ట‌ప‌రంగా ఎదుర‌య్యే స‌మ‌స్య‌ల‌పై నిపుణుల‌తో చ‌ర్చించారు. దీంతో పాత క‌మిటీని ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. కొత్త ఛైర్మ‌న్‌గా సుబ్బారెడ్డి ప్ర‌మాణం చేయ‌డం కూడా జ‌రిగింది. నూత‌న పాల‌క‌మండ‌లిలోని మిగ‌తా సభ్యుల‌ను త్వ‌ర‌లోనే నియ‌మిస్తామ‌ని ఏపీ స‌ర్కార్ వెల్ల‌డించింది.

ఇప్ప‌టి దాకా ఛైర్మ‌న్‌గా ఉన్న పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ ఇటీవ‌ల రిజైన్ చేశారు. దీంతో కొత్త బోర్డు నియామ‌కానికి మార్గం సుగ‌మ‌మైంద‌ని అంతా భావించారు. కానీ బోర్డులోని ముగ్గురు మాత్రం స‌సేమిరా అనడంతో కొంత హై డ్రామా న‌డిచింది. కొత్త ఛైర్మ‌న్‌ను నియ‌మించినా అది పాత పాల‌క‌మండ‌లి మాత్ర‌మే అవుతుంది. కొత్త ఛైర్మ‌న్ ప‌ద‌వి కాలం ప్ర‌స్తుత బోర్డులో మిగిలిన 9 నెల‌ల కాలం మాత్ర‌మే ఉంటుంది. రాజీనామా చేయ‌కుండా ఉన్న స‌భ్యులు ..కొన‌సాగుతారు. దీంతో ..ఈఓ న్యాయ స‌ల‌హా తీసుకుని మొత్తం పాత బోర్డును ర‌ద్దు చేశారు. దీంతో ప్ర‌మాణ స్వీకారానికి మార్గం ఏర్ప‌డింది. అంత‌కు ముందు సుధా నారాయ‌ణ మూ్తి, సుగ‌వాసి ప్ర‌సాద్ బాబు, రుద్ర‌రాజు ప‌ద్మ‌రాజు, ఇ. పెద్దిరెడ్డి, డొక్కా జ‌గ‌న్నాథ్‌లు రాజీనామా స‌మ‌ర్పించిన వారిలో ఉన్నారు. వీరితో పాటు టీటీడీ ప్ర‌త్యేక ఆహ్వానితులుగా ఉన్న శ్రీ‌కృష్ణ‌, అశోక్ రెడ్డిల రాజీనామాల‌ను ఆమోదించింది. అంత‌కు ముందు వైవీ సుబ్బారెడ్డి 48వ ఛైర్మ‌న్‌గా ప్ర‌మాణ స్వీకారం చేశారు. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!