ఇన్నోవ్-8 స్టార్టప్‌ను కొనుగోలు చేసిన ఓయో

అంకురాల రంగంలో తనకంటూ ఓ స్టేటస్ సింబల్‌ను ఏర్పాటు చేసుకున్న ఇన్నోవ్8ను ప్రపంచ హోటల్ రంగంలో టాప్ రేంజ్‌లో ఉన్న ఓయో కంపెనీ ఏకంగా 30 మిలియన్స్‌కు కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ డిసిషన్‌తో స్టార్టప్స్ వేలో ఇదో మంచి శుభ పరిణామం అంటూ మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. హాస్పిటాలిటీ రంగంలో ఓయో వినూత్నమైన పంథాను అనుసరిస్తూ ఇతర హోటల్స్ కు చుక్కలు చూపిస్తోంది. ఇపుడు దేశ వ్యాప్తంగా ఓయో నెట్‌వర్క్ విస్తరించింది. ఎక్కడికి వెళ్లినా సరే ఓయో దర్శనం ఇస్తోంది. ఇదంతా ఆ కంపెనీ వ్యవస్థాపకుడు రితీష్ అగర్వాల్‌కే క్రెడిట్ దక్కుతుంది. ఇండియాతో పాటు ఓయో ప్రపంచంలోని 80 దేశాలకు విస్తరించింది. తనతో పాటు వర్కింగ్ పార్ట్‌నర్‌గా ఉన్న ఇన్నోవ్8ను చేజిక్కించుకుంది. దీంతో దాని మార్కెట్ వాల్యూ భారీగా పెరిగింది. జపాన్‌కు చెందిన సాఫ్ట్ బ్యాంక్ దీనికి వెన్ను దన్నుగా నిలుస్తోంది. ఇప్పటి దాకా ఇంకా ఎంత స్థాయిలో ఈ స్టార్టప్‌ను టేకోవర్ చేశారో ఇంత దాకా ఓయో కంపెనీ యాజమాన్యం ఇంకా వెల్లడించలేదు. గూర్గాన్ కేంద్రంగా ఈ సంస్థ విజయవంతంగా నడుస్తోంది. పని చేసే ప్రదేశంలో మరింత సం...