మించిన అంచ‌నాలు .. టాప్ రేంజ్‌లో ఆర్థిక ఫ‌లితాలు

ఇప్ప‌టికే ఇండియ‌న్ మార్కెట్ రేంజ్‌ను అందుకుని ..అంచ‌నాల‌కు మించి త‌న వ్యాపార లావాదేవీల‌ను విస్త‌రించుకుంటూ ..ప్ర‌త్య‌ర్థుల కంపెనీల‌కు కోలుకోలేని షాక్‌ల‌కు గురి చేస్తున్న రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ లిమిటెడ్ ఆర్థిక ఫ‌లితాలు మించి పోయాయి. అటు టెలికాం రంగంలో ఇప్ప‌టికే టాప్ పొజిష‌న్‌లో ఉన్న స‌ద‌రు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ త‌న ద‌రిదాపుల్లోకి ఏ సంస్థ రాకుండా దూసుకెళుతోంది. ఇప్ప‌టికే పెట్రో కెమిక‌ల్, చ‌మురు శుద్ధి వ్యాపారాలు కొంత ఒడిదుడుల‌కు లోనైనా..రిటైల్, టెలికాం సేవ‌లు భారీగా ప్రాఫిట్‌ను సాధించాయి. జూన్ నెల‌తో ముగిసిన ప్ర‌స్తుత ఫైనాన్షియ‌ల్ ఇయ‌ర్ తొలి త్రైమాసికంలో ఆర్ఐఎల్ క‌న్సాలిడేటెడ్ నిక‌ర లాభం 6.8 శాతం వృద్ధితో 10 వేల 104 కోట్ల రూపాయ‌ల‌కు చేరింది.

గ‌త ఏడాది ఇదే ఆర్థిక సంవ‌త్స‌రం ..ఇదే కాలానికి నిక‌ర లాభం 9 వేల 459 కోట్లుగా న‌మోదైంది. వార్షిక ప్రాతిప‌దిక‌న వృద్ధి క‌న‌బ‌ర్చినా..త్రైమాసిక ప్రాతిప‌దిక‌న కొంత మేర‌కు నిరాశ ప‌ర్చింది. జూన్ త్రైమాసికంలో రిల‌య‌న్స్ స్టాండ్ లోన్ లాభం 2.4 శాతం వృద్ధితో 9 వేల 36 కోట్ల ఆదాయం గ‌డించ‌గా, ఏప్రిల్ జూన్ కాలానికి క‌న్సాలిడేటెడ్ ప్రాఫిట్ ల‌క్ష 72 వేల 956 కోట్ల‌కు చేరుకుంది. ఈ ఆదాయానికి ప్ర‌ధాన కార‌ణం రిటైల్ వ్యాపార అమ్మ‌కాలు భారీగా పెర‌గ‌డం. కంపెనీకి సంబంధించి స్థూల లాభంలో రిటైల్, జియో వ్యాపారాల వాటా 32 శాతానికి పెరిగింది. గ‌తంలో ఈ వాటా 25 శాతంగా ఉండింది. ఇక పెట్రో కెమిక‌ల్ వ్యాపార స్థూల ప్రాఫిట్ 4.4 శాతం పెరిగి 7 వేల 508 కోట్లుగా న‌మోదైంది. ఇక చ‌మురు శుద్ధి వ్యాపార స్థూల ఆదాయం 15.2 శాతం పెరిగి 4 వేల 508 కోట్ల‌కు చేరుకుంది.

గ‌త నెల‌లో ముగిసిన మూడు నెల‌ల్లో పీపా ముడి చ‌మురును శుద్ధి చేయ‌డం ద్వారా 8.1 డాల‌ర్ల మార్జిన్ ఆర్జించింది. గ‌త ఏడాది లో ఇదే కాలానికి మార్జిన్ 10.5 డాల‌ర్లుగా ఉంది..అంటే 2.4 మార్జిన్ త‌గ్గింది. ఆర్థిక మంద‌గ‌మ‌నంతో పాటు అంత‌ర్జాతీయ మార్కెట్‌లో వాణిజ్య ప‌ర‌మైన యుద్ధం, కొత్త యూనిట్ల ప్రారంభం వ‌ల్ల‌నే మార్జిన్ల‌కు భారీ స్థాయిలో గండి ప‌డింద‌ని ఆర్ఐఎల్ కంపెనీ వెల్ల‌డించింది. రిల‌య‌న్స్ రిటైల్ ప‌రంగా చూస్తే 2 వేల 409 కోట్ల ఆదాయం గ‌డించింది. రిల‌య‌న్స్ జియో లాభం 45.6 శాతం వృద్ధి చెంది 891 కోట్ల‌కు చేరుకుంది. గ‌త ఏడాది పోలిస్తే 612 కోట్లు ప్రాఫిట్ రాగా..270 కోట్ల ఆదాయం పెరిగింది. రిల‌య‌న్స్ రిటైల్ కొత్త‌గా 265 స్టోర్స్‌ను ప్రారంభించింది. ఏప్రిల్, మే, జూన్ నెల‌ల కాలానికి కంపెనీ నిర్వ‌హ‌ణ ఆదాయం వార్షిక ప్రాతిప‌దిక‌న చూస్తే 44 శాతం పెరిగి ..11 వేల 679 కోట్ల ప్రాఫిట్‌కు చేరుకుంది. టెలికాం సేవ‌ల్లో వేగంగా దూసుకుపోతున్న రిల‌య‌న్స్ జియో స‌రికొత్త రికార్డు న‌మోదు చేసింది. తాజాగా ఈ కంపెనీ భార‌తీ ఎయిర్ టెల్‌కు షాక్ ఇచ్చి రెండో అతి పెద్ద టెలికాం కంపెనీగా అవ‌త‌రించింది. ఈ కంపెనీ క‌ష్ట‌మ‌ర్ల సంఖ్య 32.29 కోట్ల‌కు చేరుకుంది..ఇది కూడా ఓ చ‌రిత్రే. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!