మీడియా రంగంలోకి పేటీఎం ఎంటర్ ..?

ఇండియాలో రిలయన్స్ ఎంతగా పాపులర్ అయ్యిందో పేటీఎం కూడా అంతగా ప్రచారం పొందింది. డిజిటల్ చెల్లింపుల్లో ఈ కంపెనీ ఇప్పుడు టాప్ పొజిషన్ లో కొనసాగుతోంది. స్వాయంగా భారత ప్రధాన మంత్రి సైతం డిజిటల్ చెల్లింపుల గురించి పదే పదే ప్రస్తావిస్తున్నారు . డెమోనిటరైజేషన్ తర్వాత నగదు బదిలీకి యెనలేని ప్రాధాన్యత పెరిగింది. ప్రతి భారతీయుడు దీనిని వాడేందుకు మొగ్గు చూపిస్తూ ఉండటం కూడా డిజిటల్ చెల్లింపుల రంగం మూడు పూలు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. ఇప్పటికే పేటీఎం తో పాటు రూపే , పే పల్, భీం , ఫోన్ పే , తేజ్ లతో పాటు ఇంటర్నెట్ లో దిగ్గజ కంపెనీగా పేరొందిన గూగుల్ కంపెనీ కూడా డిజిటల్ చెల్లింపుల్లోకి ఎంటర్ అయ్యింది. అది గూగుల్ పే గా ఏర్పాటు చేసింది. ప్రతి రోజు కోట్లాది రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయి. వీటిని వాడడం వల్ల సమయం ఆదా అవుతుంది. అంతే కాకుండా బ్యాంకుల దగ్గరకు వెళ్లాల్సిన పని తప్పుతుంది. ఒక్కో కంపెనీకి నగదు లావాదేవీలు జరపడంతో వేలాది రూపాయలు కమీషన్ రూపేణా ఆదాయం లభిస్తోంది. ఒక్కో కంపెనీ కోట్లకు పడగలు ఎత్తింది. ఇప్పటికే పేటీఎం ప్రాఫిట్ 750 కోట్లకు చేరుకుంది. ఒక్కో కంపెనీది ఒక్కో స్టైల్. రోజు రోజుకు దీని ఆ...