పృథ్వీరాజ్ రాక ..మారనున్న ఎస్వీబీసీ తలరాత..!

ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో కానీ బబ్లూ పృత్వి రాజ్ కు మహర్దశ స్టార్ట్ అయ్యింది. వైసీపీ అధికారం లోకి రావడంలో ఆ పార్టీకి ప్రచార బాధ్యతలతో పాటు జగన్ పర్యటనలో వెన్నంటి ఉన్నారు. అంతే కాకుండా కళాకారులను ఎంపిక చేయడం తో పాటు వారిని దగ్గరుండి చూసుకున్నారు. ప్రజలను చైతన్యవంతం చేయడంలో పృత్వి రాజ్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. దీంతో తన కోసం , పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసిన ప్రతి ఒక్కరికి కీలక బాధ్యతలు అప్పగించారు ఏపీ సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి. నటుడు ఆలీకి ఏపీ నాటక రంగ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. అంతకంటే ముందు పృథ్వీ రాజ్ కు జీవితంలో మరిచి పోలేని బహుమానం ఇచ్చారు.

ఏకంగా శ్రీ తిరుమల తిరుపతి భక్తి ఛానల్ కు చైర్మన్ గా నియమించారు. దీంతో తన జన్మ ధన్యమైందని, ఇక్కడ ఎలాంటి రాజకీయాలకు తావు లేదని, అలాంటి వాటికి చోటు ఇవ్వనని ఇంతకు ముందే స్పష్టం చేశారు పృథి రాజ్ . అంతే కాకుండా సమూలమైన మార్పులు చేయబోతున్నట్లు ప్రకటించారు. పూర్తిగా పారదర్శకత ఉండేలా చూస్తానని చెప్పారు. గతంలో పదవీ బాధ్యతలు నిర్వహించిన వారు పూర్తిగా పట్టించు కోలేదని, ఇప్పుడు దానికి భిన్నంగా పాలనాపరమైన సంస్కరణలు ఉంటాయని స్పష్టం చేశారు పృథ్వీ . సీఎం జగన్ అందిస్తున్న ప్రోత్సాహం మరువలేమన్నారు. తాను ఇప్పటికే నివాసాన్ని తిరుపతికి మార్చనని, అందుకే ఆధార్ , ఓటర్ కార్డులను మార్చేసుకున్నాని పృధ్వీరాజ్‌ చెప్పారు.

శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ లో పని చేస్తున్న ఉద్యోగులను, సిబ్బందిని ముఖ్యమంత్రి జగన్ కళ్ళు పట్టుకునైనా పర్మినెంట్ చేయిస్తానని ఛానల్ చైర్మన్ పృధ్వీరాజ్‌ హామీ ఇచ్చారు. సీనియర్ నటుడు ప్రభాకర్ రెడ్డి ఆదరణతో సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన తాను , దర్శకుడు బాపు గారి వద్ద అసిస్టెంట్ గా పని చేశానని తిరుపతిలో చెప్పారు. పక్షమా గోదావరి జిల్లాలో పుట్టినా ..శ్రీకాళహస్తిలో పెద్దమ్మ ఇంట్లో ఉంది చదువుకున్నాని గుర్తు చేసుకున్నారు. ఎస్వీబిసి చైర్మన్ అయిన వెంటనే ఆధార్, ఓటర్ కార్డులను ఇక్కడికే మార్చుకుని స్వామి వారికి సేవ చేస్తున్నానని తెలిపారు. ఓ ఛానల్లో సినిమా వార్తలు రాసిన అనుభవం తనకు ఉందని చెప్పారు. తిరుమలలో అజెండాలు తప్పా రాజకీయ జెండాలు ఉండవన్నారు. ఎస్వీబిసి లో పనిచేస్తున్న 286 మంది ఉద్యోగులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు .ఛానల్ అభివృద్ధికి సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. త్వరలో హిందీలో కూడా ప్రసారం చేస్తామన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!