కేసీఆర్ కు నమ్మకం..వినోద్ కు అందలం

లాయర్ సాబ్ , మాజీ ఏపీ వినోద్ కుమార్ కు కీలకమైన పదవి దక్కింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు ఆయనపై నమ్మకం ఉంచి ..ప్రధానమైన పోస్టులో కూర్చో బెట్టారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా ఆయనను నియమేస్తున్నట్లు ప్రకటించారు. ఆ మేరకు నియామక పత్రాన్ని వినోద్ కు స్వయంగా కేసీఆర్ అందజేశారు. బడ్జెట్ రూప కల్పన బాధ్యతలను అప్పగించారు. ప్రభుత్వం ఉత్తర్వులను కూడా జారీ చేసింది. రాష్ట్ర అభివృద్ధికి సంబంధిచి అంశాల్లో ప్రణాళిక సంఘం అత్యంత కీలకమైనది ఈ పదవి. ఎంతో అనుభవం కలిగిన వైకథగా వినోద్ కుమార్ కు పేరుంది. దీంతో ఈ పదవిని కట్టబెడుతున్నారు సీఎం తెలిపారు. దీనికి సంబంధించిన ఫైల్ పై సంతకం చేశారు. ఈ పదవిలో వినోద్ కుమార్ మూడు సంవత్సరాల పాటు కొనసాగుతారు.

2019-20 ఆర్ధిక సంవత్సరానికి త్వరలోనే పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశ పెట్టాలి ఉంది. దీంతో ఆకస్మికంగా ఈ నిర్ణయం తీసుకున్నారు సీఎం. అన్ని శాఖలకు ప్రతిపాదనలు తాయారు చేయడం, ఉన్నతాధికారులతో సమన్వయం చేసు కోవడం చేయాల్సి ఉంటుంది. ఆయా శాఖలను సమీఖించి , ప్రతిపాదనలు తయారు చేసే కీలక భాద్యతలను అప్పగించారు. ప్రణాళిక  సంఘం ఉపాధ్యక్షుడిగా వినోద్ కుమార్ కు కేబినెట్ హోదా ఉంటుంది. మంత్రి మండలి సమావేశాలకు శాశ్వత ఆహ్వానితుడిగా వుంటారు . రెండుసార్లు ఆయన ఎంపీగా పని చేశారు. రాజకీయాలలో , పాలనా పరమైన అంశాల్లో వున్నా అనుభవం ఉన్నది. తెలంగాణ రాష్ట్ర సామాజిక , ఆర్ధిక అంశాల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉన్నారు . దీంతో వినోద్ సేవలు ఈ సమయంలో తెలంగాణ కు అవసరమని ఈ పదవిని కట్టబెట్టామని కేసీఆర్ వెల్లడించారు.

తాజాగా మంత్రివర్గ విస్తరణపై అంతటా చర్చ జరుగుతోంది. దీంతో ఎవరిని తీసుకోవాలో , ఎవరిని పక్కన పెట్టాలో వినోద్ సీఎం కు సూచనలు చేసే అవకాశం ఉంది. పార్టీ ఆవిర్భావం నుంచి వినోద్ కేసీఆర్ తో ఉన్నారు. కరీంనగర్ ఎంపీగా గెలిచినా వినోద్ లోక్ సభ పక్ష ఉప నేతగా వ్యవహరించారు. ఢిల్లీలో తెరాసకు , రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కీలక అంశాల సాధనలో ముఖ్య పాత్ర పోషించారు. వినోద్ నియామకంతో మంత్రి మండలి విస్తరణపై ఓ స్పష్టత వచ్చినట్లైంది. దసరాకు విస్తరణ ఖాయంగా ఉంటుందని ఆ పార్టయికి చెందిన నేతలు భావిస్తున్నారు. ఈ సందర్బంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచిన సీఎం కు కృతజ్ఞతలు తెలిపారు. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!