తమిళ నాట తలైవా సంచలనం..!

ఇండియాలో తమిళుల రూటే సపరేట్. వాళ్లకు ఆవేశం వచ్చినా లేక ఆవేదన వచ్చినా తట్టుకోలేరు. వారికున్నంత ఆత్మాభిమానం ఇంకెవ్వరికి లేదంటే అతిశయోక్తి కాదేమో. అక్కడ సినిమా స్టార్స్ కు ఉన్నంత ఫాలోయింగ్ పొలిటికల్ లీడర్లు కు ఉండదు . వీరే వారిని శాశిస్తారు ..అంతకంటే ఎక్కువగా ప్రభావితం చేస్తారు. ఎంజీఆర్ , కరుణానిధి , జయలలిత ..ఇలా తమిళ గత కొంత కాలంగా సాగుతూ వచ్చాయి. ఇప్పుడు స్టాలిన్ , వైగో లాంటి వాళ్ళున్నారు. దేశమంతటా బీజేపీ గాలి వీచినా తమిళనాట ఇంకా పాగా వేయలేక పోతోంది. ట్రబుల్ షూటర్ అమిత్ షా కన్ను మదరాసు మీద పడింది. ఎలాగైనా సరే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగుర వేయాలన్నది ఆయన ప్లాన్. ఇందు కోసం కలిసి వచ్చే వారి కోసం ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు . తాజాగా భారత ఉప రాష్ట్ర పతి వెంకయ్య నాయుడు రాసిన పుస్తకావిష్కరణ సందర్బంగా అమిత్ షా ప్రత్యేకంగా పాల్గొన్నారు . ఈ కార్యక్రమానికి అతిరథ మహారథులు వచ్చారు . కానీ ఒకే ఒక్కరు మాత్రం సెంటర్ ఆఫ్ ది అట్ట్రాక్షన్ గా నిలిచారు . అతను ఎవరో కాదు లక్షలాది మంది కి ఆరాధ్య దైవంగా పిలుచుకునే రజనీకాంత్ ఉరఫ్ తలైవా. కొద్ది సేపు షా ..రజని ముచ్చటించుకున్నార...