తమిళ నాట తలైవా సంచలనం..!
ఇండియాలో తమిళుల రూటే సపరేట్. వాళ్లకు ఆవేశం వచ్చినా లేక ఆవేదన వచ్చినా తట్టుకోలేరు. వారికున్నంత ఆత్మాభిమానం ఇంకెవ్వరికి లేదంటే అతిశయోక్తి కాదేమో. అక్కడ సినిమా స్టార్స్ కు ఉన్నంత ఫాలోయింగ్ పొలిటికల్ లీడర్లు కు ఉండదు . వీరే వారిని శాశిస్తారు ..అంతకంటే ఎక్కువగా ప్రభావితం చేస్తారు. ఎంజీఆర్ , కరుణానిధి , జయలలిత ..ఇలా తమిళ గత కొంత కాలంగా సాగుతూ వచ్చాయి. ఇప్పుడు స్టాలిన్ , వైగో లాంటి వాళ్ళున్నారు. దేశమంతటా బీజేపీ గాలి వీచినా తమిళనాట ఇంకా పాగా వేయలేక పోతోంది. ట్రబుల్ షూటర్ అమిత్ షా కన్ను మదరాసు మీద పడింది. ఎలాగైనా సరే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగుర వేయాలన్నది ఆయన ప్లాన్.
ఇందు కోసం కలిసి వచ్చే వారి కోసం ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు . తాజాగా భారత ఉప రాష్ట్ర పతి వెంకయ్య నాయుడు రాసిన పుస్తకావిష్కరణ సందర్బంగా అమిత్ షా ప్రత్యేకంగా పాల్గొన్నారు . ఈ కార్యక్రమానికి అతిరథ మహారథులు వచ్చారు . కానీ ఒకే ఒక్కరు మాత్రం సెంటర్ ఆఫ్ ది అట్ట్రాక్షన్ గా నిలిచారు . అతను ఎవరో కాదు లక్షలాది మంది కి ఆరాధ్య దైవంగా పిలుచుకునే రజనీకాంత్ ఉరఫ్ తలైవా. కొద్ది సేపు షా ..రజని ముచ్చటించుకున్నారు . ఈ సందర్బంగా తలైవా చేసిన కామెంట్స్ సంచలం రేపాయి . దేశ వ్యాప్తంగా వైరల్ గా మారాయి . మోడీ , అమిత్ షా లు ఇద్దరు కృష్ణార్జునులుగా అభివర్ణించారు రజనీకాంత్. దీంతో నిన్నటి దాకా పాలిటిక్స్ లోకి ఎంటర్ అవుతారో లేదోనన్న మీమాంశకు ఫుల్ స్టాప్ పెట్టేశారు తలైవా. చెన్నైలో ఇదే హాట్ టాపిక్ గా మారింది .
గత ఇరవయ్యేళ్ళుగా రాజకీయ ప్రవేశాన్ని దాట వేస్తూ వస్తున్నారు . కాగా తలైవా రావాలని అభిమానులు కోరుతున్నారు . మరో వైపు తన స్నేహితుడు కమల హాసన్ ఇప్పటికే పార్టీ పెట్టారు . తనతో కలిసి రావాలని ఆయన కోరారు . అయితే రజని ఇంకా స్పష్టమైన ప్రకటన చేయలేదు . ఇప్పుడు దర్బార్ సినిమాలో బిజీగా ఉన్నారు . గత ఎన్నికల్లో బీజేపీ రజనితో ప్రచారం చేయాలనీ పావులు కదిపింది . కానీ ఆయన సినిమాల వైపే మొగ్గు చూపారు . ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థుతుల దృష్ట్యా రజని కమలం వైపు మొగ్గు చూపుతున్నట్టు అనిపిస్తోంది . జమ్మూ ..కాశ్మీర్ విషయంలో మోదీని పొగిడారు . ఇప్పుడు షా, మోదీని కృష్ణార్జులతో పోల్చడం కూడా చర్చనీయాంశ మైంది. రజనీ చరిష్మా తోడైతే తమిళనాట అధికారంలోకి రావచ్చని బీజేపీ భావిస్తోంది . మొత్తం మీద తలైవా ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి .

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి